రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

2023 డిసెంబర్ నాటికి 1154.67 ఎంటీ సరుకులు రవాణా చేసిన భారతీయ రైల్వేలు


గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 45.28 ఎంటీ పెరిగిన సరుకు రవాణా

2023 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా ద్వారా రూ. 125106.2 కోట్లు ఆదాయం ఆర్జించిన రైల్వే
గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ. 4626.92 కోట్లు పెరిగిన సరుకు రవాణా ఆదాయం

డిసెంబర్ 2022 పోల్చి చూస్తే 2023 డిసెంబర్ నెలలో 6.37% వృద్ధి సాధించి 138.99 ఎంటీ సరుకులు రవాణా చేసిన భారతీయ రైల్వేలు

Posted On: 04 JAN 2024 5:13PM by PIB Hyderabad

2023 ఏప్రిల్-డిసెంబర్ వరకు రైల్వే శాఖ 1154.67 ఎంటీ  సరుకులు రవాణా చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రైల్వే శాఖ 1109.38 ఎంటీల సరుకులు రవాణా చేసింది. గత ఏడాదితో పోల్చి చూస్తే  సరుకు రవాణా  2023 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో  45.28 ఎంటీ ల వరకు పెరిగింది. సరుకు రవాణా ద్వారా  రైల్వే శాఖ 125106.2 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది.. గత సంవత్సరం ఇదే కాలంలో సరుకు రవాణా ద్వారా రైల్వే శాఖ 120479.3 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోల్చి 2023 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రైల్వే ఆదాయం  4626.92 కోట్ల రూపాయల వరకు పెరిగింది. 

 2023 డిసెంబర్  నెలలో 138.99  ఎంటీ సరుకుల లోడింగ్ జరిగింది. 2022  డిసెంబర్ లో  130.66 ఎంటీ సరుకుల లోడింగ్ జరిగింది.  గత సంవత్సరం డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే సరుకుల లోడింగ్  6.37% పెరిగింది.  2023 డిసెంబర్ లో సరుకు రవాణా  ద్వారా ఆర్జించిన  ఆదాయం  రూ.15097.61 కోట్లుగా ఉంది .  2022 డిసెంబర్ లో సరుకు రవాణా ఆదాయం  14574.25 కోట్ల రూపాయలుగా ఉంది.  గత సంవత్సరం కంటే సరుకు రవాణా ఆదాయం దాదాపు 3.59% పెరిగింది. 

 రైల్వేలు 69 ఎంటీ  బొగ్గు, 16.54 ఎంటీ ఇనుప ఖనిజం,  7.23 ఎంటీ సిమెంట్.    (క్లింకర్ కాకుండా ),  6 ఎంటీ పిగ్ ఐరన్, 5.07 ఎంటీ క్లింకర్‌, 4.26ఎంటీ  ఆహార ధాన్యాలు, 5.77 ఎంటీ ఎరువులు, 4.33 ఎంటీ మినరల్ ఆయిల్‌ రవాణా చేశాయి.  కంటైనర్‌లలో 7.70 ఎంటీ,  9.76ఎంటీ  ఇతర వస్తువులు రైల్వే ద్వారా రవాణా అయ్యాయి. 

"హంగ్రీ ఫర్ కార్గో" అనే నినాదాన్ని పాటిస్తున్న రైల్వే శాఖ సరుకు రవాణాను సులభతరం చేసి, పోటీ ధరలకు అందించడానికి కృషి చేస్తోంది. ఖాతాదారులకు ప్రయోజనం కలిగించే చర్యలు అమలు చేస్తున్న రైల్వే శాఖకి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న విధానాలు సహాయ పడుతున్నాయి.  

 

***



(Release ID: 1993264) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Marathi