రక్షణ మంత్రిత్వ శాఖ
నౌకాదళ సిబ్బంది వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎవిఎస్ఎం, ఎన్ఎం
Posted On:
04 JAN 2024 1:42PM by PIB Hyderabad
నావికాదళ సిబ్బంది వైస్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎవిఎస్ఎం, ఎన్ఎం 04 జనవరి 2024న బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశం కోసం మహోన్నత త్యాగం చేసిన వీరులకు జాతీయ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ఘనంగా నివాళులు ఘటించారు. ఆయన నావికాదళ సిబ్బంది వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టక ముందు వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి పశ్చిమ నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందించారు.
రేవా సైనిక స్కూల్, ఖండకా్వస్లా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పూర్వ విద్యార్ధి అయిన ఆయన భారతీయ నావికా దళంలోకి 01 జులై 1985లో నియమితులయ్యారు. కమ్యూనికేషన్ & ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్ అయిన ఆయన, నావికాదళ ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకలలో సిగ్నల్ కమ్యూనికేషన్ అధికారి& ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అధికారిగా సేవలందించి, అనంతరం గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ ఐఎన్ ఎస్ ముంబైకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & ప్రిన్సిపల్ వార్‌ఫేర్ అధికారిగా పని చేశారు. భారత నావికాదళ నౌకలు వినాశ్, కిర్చ్, త్రిశూల్‌కు ఆయన నాయకత్వం వహించారు. కార్యాచరణ, సిబ్బంది నియామకాలకు సంబంధించి వెస్టర్న్ ఫ్లీట్ ఆఫ్ ముంబైకి ఫ్లీట్ ఆపరేషన్స్ అధికారిగా, నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, నెట్‌వర్క్ కేంద్రిత ఆపరేషన్ల ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా, న్యూఢిల్లీలో నావికాదళ ప్రణాళికల ప్రధాన డైరెక్టర్‌గా సేవలు అందించారు. రేర్ అడ్మిరల్‌గా పదోన్నతి పొందిన తర్వాత, ఆయన అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (పాలసీ & ప్లాన్స్)గా ఎన్‌హెచ్‌క్యూలోను, ఈస్టర్న్ ఫ్లీట్ కు ఫ్లాగ్ ఆఫీసర్ గా సేవలు అందించారు.
వైస్ అడ్మిరల్‌గా జూన్ 2019లో పదోన్నతి పొందిన అనంతరం, ఫ్లాగ్ ఆఫీసర్‌ను కేరళలోని ఎఝిమలలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ నావల్ అకాడమీకి కమాండెంట్‌గా నియమితులయ్యారు. ఆయన జులై 2020 నుంచి మే 2021వరకు నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. ఈ సమయంలో నావికాదళ సముద్ర కార్యకలాపాలలో వేగం పెరిగిన సమయమది. నావికాదళం ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా, విశ్వసనీయంగా, సమ్మిళిత, భవిష్యత్‌లో కూడా అబేధ్యంగా ఉంటూ అన్నిరకాలుగా కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా సంక్లిష్ట భద్రతా సవాళ్ళను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం, జూన్ 21 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఫ్లాగ్ ఆఫీసర్ సిబ్బందికి అధిపతిగా సేవలు అందించారు.
అడ్మిరల్ వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాను పొందారు. అక్కడే ఆయనకు తిమ్మయ్య పతకాన్ని కూడా ప్రదానం చేశారు. ఆయన రోడె ఐలెండ్స్‌లోని న్యూపోర్ట్‌లో యుఎస్ నావల్ వార్ కాలేజీలో నావల్ హయ్యర్ కమాండ్ కోర్స్‌ను, నావల్ కమాండ్ కాలేజ్ 2007-08లో హాజరయ్యారు. ఆయన అక్కడ ప్రతిష్ఠాత్మక రాబర్ట్ ఇ బేట్‌మాన్ అంతర్జాతీయ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.
వైస్ అడ్మిరల్ త్రిపాఠి విధుల పట్ల ప్రదర్శించిన అంకిత భావానికి అతి విశిష్ట సేవా పతకాన్ని, నవసేనా పతకాన్ని పొందారు. ఆయన మంచి క్రీడాకారుడు కావడమే కాదు టెన్నిస్, బాడ్మింటన్, క్రికెట్ వంటి క్రీడలను తిలకించి ఆనందిస్తుంటారు. ఫ్లాగ్ ఆఫీసర్ అంతర్జాతీయ సంబంధాలు, సైనిక చరిత్ర, నాయకత్వ కళ &శాస్త్రంపట్ల ఆసక్తి కలిగిన విద్యార్ధి. ఆయన కళాకారిణి అయిన శ్రీమతి శశి త్రిపాఠిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు, అతడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు విధాన నిర్ణయ రంగంలో పని చేసే తాన్యాను వివాహం చేసుకున్నాడు.
***
(Release ID: 1993150)
Visitor Counter : 144