విద్యుత్తు మంత్రిత్వ శాఖ

వచ్చే ఐదేళ్లలో రూ.35,000 కోట్ల విలువైన మల్టీ మోడల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సహకార ఒప్పందం కుదుర్చుకున్న రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆర్ఈసీ

Posted On: 03 JAN 2024 12:41PM by PIB Hyderabad

వచ్చే ఐదేళ్లలో రూ.35,000 కోట్ల  రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్ )చేపట్టనున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఆర్ఈసీ లిమిటెడ్ అంగీకరించింది.  . ఈ మేరకు  రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. . ఆర్వీఎన్ఎల్ చేపట్టనున్న  మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ ప్రాజెక్టులు, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, రోడ్డు, పోర్టు, మెట్రో ప్రాజెక్టులకు ఒప్పందం ప్రకారం ఆర్ఈసీ నిధులు సమకూరుస్తుంది. 

ఆర్ఈసీ సీఎండీ శ్రీ వి.కె.దేవాంగన్ సమక్షంలో ఆర్ఈసీ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ అజయ్ చౌదరి, ఆర్వీఎన్ఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ రాజేష్ ప్రసాద్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఆర్వీఎన్ఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్)శ్రీ సంజీవ్ కుమార్,  ఆర్వీఎన్ఎల్   డీపీఈ శ్రీమతి అనుపమ్ బెన్,, ఆర్ఈసీ, ఆర్వీఎన్ఎల్   కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

 1969 లో స్థాపించబడిన ఆర్ఈసీ లిమిటెడ్ మహారత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి. విద్యుత్ రంగంలో చేపడుతున్న జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి కొత్త సాంకేతిక తో కూడిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్థ దీర్ఘకాలిక రుణాలు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంది. ఇటీవల సంస్థ తన కార్యకలాపాలను విస్తృతం చేసి  ఉక్కు, రిఫైనరీ,రోడ్లు ,  మెట్రో రైలు, విమానాశ్రయాలు, ఐటీ కమ్యూనికేషన్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు (విద్యా సంస్థలు, ఆసుపత్రులు), పోర్టులు,ఎలక్ట్రో-మెకానికల్ ప్రాజెక్టులకు రుణ సౌకర్యం అందిస్తోంది. ఇంతవరకు . ఆర్ఈసీ  రూ.4,74,275 కోట్లకు మించి రుణాలు అందించింది. .

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని "షెడ్యూల్ 'ఎ' నవరత్న" కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా  ఆర్వీఎన్ఎల్ పని చేస్తోంది.  భారతీయ రైల్వేల మౌలిక సదుపాయాల అవసరాలలో 30% అవసరాలను ఆర్వీఎన్ఎల్  తీరుస్తోంది. పిపిపి మోడల్ కింద ఆర్వీఎన్ఎల్  ఆధ్వర్యంలో   మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది.  ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులు చేపడుతున్న ఆర్వీఎన్ఎల్   ఇటీవల  రోడ్డు, నౌకాశ్రయం, నీటిపారుదల, మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది.  వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు  రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడి ఉన్నాయి. 

 

***



(Release ID: 1992820) Visitor Counter : 122