ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అస్సాంలోని గౌహతిలో అష్టలక్ష్మి హాత్ & అనుభవ కేంద్రాన్ని నెలకొల్పనున్న ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ
అస్సాంలోని బక్సాలోని ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్‌లో ఈఆర్ఐ సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ASPIRE పథకం కింద ఆభరణాలు మరియు హస్తకళ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని మంజూరు చేసిన ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ
Posted On:
01 JAN 2024 3:42PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతానికి చెందిన దేశీయ కళలను అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ కార్యక్రమాలు అమలు చేస్తోంది. మార్కెట్‌లు , వినియోగదారులకు హస్తకళాకారులను చేరువ చేయడం ద్వారా హస్తకళాకారుల ఆర్థిక, సాంస్కృతిక మరియు సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ వారసత్వ సాంస్కృతిక విలువలను ప్రజలకు పరిచయం చేస్తోంది.
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సంస్థ కళాకారుల తయారు చేసిన హస్తకళలు, నేత కార్మికులు నేసిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రజలకు విక్రయిస్తోంది. ప్రదర్శనలు మరియు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రదర్శనల ద్వారా వివిధ మార్కెట్లలో ఈశాన్య ప్రాంత ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. కళాకారులు, చేనేత కార్మికుల నైపుణ్యం , జ్ఞానాన్ని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు, సదస్సులను ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది.
హస్త కళాకారులు, చేనేత కార్మికుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 7.6 కోట్ల రూపాయల ఖర్చుతో గౌహతిలో అష్టలక్ష్మి హాట్ , ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. దీనిలో 24 శాశ్వత స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. అన్ని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కళాకారులకు అష్టలక్ష్మి హాట్ , ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మార్కెట్ సౌకర్యాలు అందిస్తుంది. ఇతర పాటల నుంచి వచ్చే కళాకారులకు వసతి కల్పించడానికి వసతి సౌకర్యాలు అభివృద్ధి చేస్తారు.
ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్, ముషల్పూర్, బక్సా (అస్సాం)లో 14.92 రూపాయల ఖర్చుతో ఈఆర్ఐ సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్‌ను అభివృద్ధి చేయాలని ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 375 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 25,003 కుటుంబాలు పరోక్ష ఉపాధి అవకాశాలు పొందుతాయి. ప్లాంట్ రోజుకు 450 కిలోల ఈఆర్ఐ సిల్క్ నూలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
డిజిటలైజేషన్, ప్రామాణీకరణ, ట్రేస్‌బిలిటీ ద్వారా ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ మార్కెట్ అవకాశాలను అభివృద్ధిని చేస్తోంది. దీనికోసం ఈశాన్య రాష్ట్రాల్లో ( సిక్కిం మినహాయించి)10,000 మంది నేత కార్మికులకు ప్రయోజనం కలిగించడానికి 14.92 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల రాబోయే 2-3 సంవత్సరాలలో నేత కార్మికుల ఆదాయంలో 20-30% పెరుగుదల ఉంటుందని అంచనా వేయబడింది. ప్రాజెక్టు అమలులో భాగంగా సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 10,000 మందికి పైగా క్రియాశీల మగ్గం నేత కార్మికులను ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థ గుర్తించింది.
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ASPIRE పథకం కింద ఆభరణాలు, హస్తకళ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈశాన్య హస్తకళలు,చేనేత అభివృద్ధి సంస్థకు అనుమతులు లభించాయి. 1.9 కోట్ల రూపాయల ఖర్చుతో
ఆభరణాలు, హస్తకళల ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు అవుతుంది.
***
(Release ID: 1992263)
Visitor Counter : 168