బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎనిమిది ప్రధాన పరిశ్రమలతో పోలిస్తే 2023 నవంబర్‌లో 10.9% వృద్ధిని సాధించిన బొగ్గు రంగం
2023 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో 12.8 శాతానికి చేరుకున్న మొత్తం వృద్ధి
Posted On:
01 JAN 2024 12:41PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 2023 నవంబర్‌లో, ఎనిమిది ప్రధాన పరిశ్రమలతో పోలిస్తే బొగ్గు రంగం సూచీ 10.9% (తాత్కాలిక) వృద్ధిని సాధించింది. బొగ్గు రంగం 2023 నవంబర్‌లో 185.7 పాయింట్లను సాధించింది, గత ఏడాది ఇదే సమయంలో 167.5 పాయింట్లతో నిలిచింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, 2023 ఏప్రిల్-నవంబర్ కాలంలో బొగ్గు రంగం మొత్తం సూచీ 12.8%కు పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, ఎనిమిది ప్రధాన పరిశ్రమల సంయుక్త సూచీ 2023 నవంబర్‌లో 7.8% (తాత్కాలిక) పెరుగుదలను చూపింది.
ఐసీఐ ఎనిమిది ప్రధాన పరిశ్రమల పనితీరును సంయుక్తంగా, విడివిడిగా సూచిస్తుంది. ఆ రంగాలు సిమెంట్, బొగ్గు, ముడి చమురు, విద్యుత్, ఎరువులు, సహజ వాయువు, శుద్ధి చేసిన ఉత్పత్తులు, ఉక్కు.
2023 నవంబర్‌లో, బొగ్గు పరిశ్రమ సూచీలో వృద్ధి ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి వల్ల సాధ్యమైంది. ఆ నెలలో బొగ్గు ఉత్పత్తి 84.52 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే నెలలో 76.16 మెట్రిక్ టన్నులను అధిగమించింది, 10.97% పెరుగుదలను సాధించింది.
వివిధ వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా ఈ వృద్ధిని పెంచడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించింది. వాణిజ్య బొగ్గు గనుల వేలం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచడం, మూసేసిన గనులను తిరిగి తెరవడం, గనుల అభివృద్ధి & నిర్వహణ సంస్థలను ప్రోత్సహించడం వంటివి చేసింది.
బొగ్గు రంగంలో కనిపించిన గణనీయమైన వృద్ధి, ఎనిమిది ప్రధాన పరిశ్రమల మొత్తం వృద్ధి కోసం అందించిన సహకారం బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర కార్యక్రమాలకు నిదర్శనం. ఈ ప్రయత్నాలు ఆత్మనిర్భర్ భారత్ దృక్పథానికి అనుగుణంగా సాగాయి, స్వయం సమృద్ధి & దేశ ఇంధన భద్రతను కల్పిస్తూ దేశాభివృద్ధికి దోహదం చేశాయి.
***
(Release ID: 1992261)
Visitor Counter : 255