మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ , పుదుచ్చేరిలో వివిధ ప్రదేశాలలో 2024 జనవరి నుంచి 6 వరకు జరిగే సాగర్ పరిక్రమ (దశ X) కార్యక్రమంలో పాల్గోనున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా
గతంలో జరగని ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన కోస్తా జిల్లాలు, యానాం (పుదుచ్చేరి)లో సాగర్ పరిక్రమ దశ-X నిర్వహణ
కార్యక్రమంలో మత్స్యకారులు, ఆక్వా రైతులు,ఇతర లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి) పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి
Posted On:
31 DEC 2023 12:41PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ , పుదుచ్చేరిలో వివిధ ప్రదేశాలలో 2024 జనవరి నుంచి 6 వరకు జరిగే సాగర్ పరిక్రమ (దశ X) కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ పాల్గొంటారు.
కార్యక్రమంలో భాగంగా ప్రగతిశీల మత్స్యకారులు, ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులు,చేపల పెంపకందారులు, యువ మత్స్య పారిశ్రామిక వేత్తలు మొదలైన వారికి కేంద్ర మంత్రులు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పంపిణీ చేస్తారు. మత్స్యకారుల ప్రయోజనాల కోసం అమలు జరుగుతున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద అమలు జరుగుతున్న విధానాలు, కార్యక్రమాలు. కేసీసీ లాంటి పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య శాఖ, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా లకు చెందిన ఉన్నతాధికారులు, మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
సాగర్ పరిక్రమ యాత్రలో మత్స్యకారులు, చేపల పెంపకందారులు , ఇతర సంబంధిత వర్గాల ప్రతినిధులతో మంత్రి పరస్పర చర్చలుజరుపుతారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని కోస్తా జిల్లాల్లో కేసీసీ , ఇతర కార్యకలాపాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు ప్రతినిధులు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, మత్స్యకారుల సహకార సంఘం నాయకులు, నిపుణులు, శాస్త్రవేత్తలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వాటాదారులు ఈ కార్యక్రమాల్లో [పాల్గొంటారు.
"సాగర్ పరిక్రమ" మొదటి దశ 2022 మార్చి5 న గుజరాత్‌లోని మాండ్వి నుంచి ప్రారంభమైంది. సాగర్ పరిక్రమ తొమ్మిది దశలు గుజరాత్, డామన్ , డయ్యూ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అండమాన్, నికోబార్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి , ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కొంత భాగంలో అమలు జరిగాయి. సాగర్ పరిక్రమ దశ-X ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, యానాం (పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం)లో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల తీరప్రాంతం, 33,227 కిలోమీటర్ల కాంటినెంటల్ షెల్ఫ్ ప్రాంతం కలిగి ఉంది. 555 సముద్ర మత్స్యకారుల గ్రామాలు, 2 ఫిషింగ్ హార్బర్‌లు, 350 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 31147 పడవలు , 65 కోల్డ్ స్టోరేజీలు, 64 ప్రాసెసింగ్ ప్లాంటులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉంది. 235 ఐస్ ప్లాంటులు , 28 ఫీడ్ మిల్లులు, 357 హేచరీలు మరియు 234 ఆక్వాలాబ్‌లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 5 సంవత్సరాల కాలంలో మత్స్య రంగంలో మొత్తం పెట్టుబడి రూ. 2300 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీలు/ఐస్ ప్లాంట్ల నిర్మాణం, సాంప్రదాయ మత్స్యకారుల కోసం కొత్త డీప్ సీ ఫిషింగ్ వెసెల్‌ల కొనుగోలు, బ్రూడ్ బ్యాంక్ నిర్మాణం, మంచినీటి ఫిన్‌ఫిష్ నిర్మాణం హేచరీలు, ఆక్వాకల్చర్ కోసం విస్తరణ ప్రాంతం, ఫింగర్లింగ్స్ స్టాకింగ్, డిసీజ్ డయాగ్నస్టిక్ అండ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు, కమ్యూనికేషన్ మరియు ట్రాకింగ్ సంప్రదాయ మరియు మోటరైజ్డ్ నౌకలైన VHF/ట్రాన్స్‌పాండర్‌లు మొదలైన కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
మత్స్యకార సమాజ సంక్షేమం , తీరప్రాంత అభివృద్ధికి సాగర్ పరిక్రమ కార్యక్రమం అమలు జరుగుతోంది. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, మత్స్యకారుల కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన వంటి కార్యక్రమాల కింద మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం అవసరమైన చర్యలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా వారి జీవన నాణ్యత, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సాగర్ పరిక్రమ ప్రభావం చూపుతోంది. సాగర్ పరిక్రమ కింద మత్స్యకారుల సమస్యలను మంత్రులు, అధికారులు స్వయంగా తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించడంలో సాగర్ పరిక్రమ నిరంతరం సహకరిస్తుంది . వారి ఆర్థిక పురోభివృద్ధిని సులభతరం చేస్తుంది.
***
(Release ID: 1991994)
Visitor Counter : 110