వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎంఎస్ఎంఈ రంగం, సాంప్రదాయ హస్తకళలు, చేతివృత్తులు, నేత కార్మికులు,తయారీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి భారతదేశాన్నిప్రపంచ సమావేశ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు కృషి .. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్


రాబోయే నెలల్లో ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్, ఇండస్ ఫుడ్, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024, భారత్ టెక్స్ నిర్వహణ.. శ్రీ గోయల్

Posted On: 29 DEC 2023 1:31PM by PIB Hyderabad

సమావేశ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు   (సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు) గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. . ప్రపంచ సమావేశాల కేంద్రంగా భారతదేశానికి గుర్తింపు తీసుకు రావాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఆకాంక్ష నెరవేరేలా చూసేందుకు కార్యక్రమాలు రూపొందించామని ఆయన చెప్పారు. 

నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు లభించేలా చూసి, ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు  బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వివరించారు. 

ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశ స్థానాన్ని పెంచడానికి రాబోయే నెలల్లో వరుస మెగా ఈవెంట్లు జరుగుతాయని శ్రీ గోయల్ చెప్పారు. 2024 జనవరి 3 నుంచి 10 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో  'ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్'తో ఈ మెగా ఈవెంట్లు ప్రారంభం కానున్నాయి.కళాకారులు, నేత కార్మికులు, ఖాదీ, గిరిజన హస్తకళలు, ఎంఎస్ఎంఈ, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో 'ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్' జరుగుతుందన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్' లో భాగంగా  ఉత్పత్తిదారులు , వినియోగదారుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతాయన్నారు. 

2024 జనవరి 8 నుంచి 10 వరకు  గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లో   'ఇండస్ ఫుడ్' ఎగ్జిబిషన్ జరుగుతుంది.  దాదాపు 120 దేశాలకు చెందిన 1100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొనే ఈ ఎగ్జిబిషన్ ను  2500 మంది విదేశీ కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా నిర్వహిస్తామని శ్రీ గోయల్ తెలిపారు. . విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని ఎక్కువ చేసి , ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింత ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. 

'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024' 2024 ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తారు.  10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరిగే 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024'  లో   ఆటోమొబైల్, రవాణా రంగానికి చేస్తుండిన ప్రముఖ సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. పర్యావరణహిత తదుపరి తరం ఉత్పత్తులు, నిర్మాణ పరికరాలు, రవాణా రంగంలో చోటు చేసుకున్న ఆవిష్కరణలకు 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024' వేదికగా ఉంటుందని మంత్రి తెలిపారు. 

2024 ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు ఢిల్లీలో భారత్ మండపం, యశో భూమిలో దాదాపు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 'భారత్ టెక్స్' జరుగుతుంది.  ఈ భారీ ప్రదర్శన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ ఈవెంట్లలో ఒకటిగా గుర్తింపు పొందేలా 'భారత్ టెక్స్' నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  విలువ ఆధారిత వస్త్ర రంగాన్ని'భారత్ టెక్స్' ఆవిష్కరిస్తుంది. దాదాపు 40 దేశాలకు చెందిన  3500కి పైగా  ఎగ్జిబిటర్లు, 3000కి పైగా  విదేశీ కొనుగోలుదారులు 'భారత్ టెక్స్' లో పాల్గొంటారు. వస్త్ర రంగంలో భారతదేశానికి చెందిన నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం లక్ష్యంగా భారత్ టెక్స్ జరుగుతుంది. 

మెగా ఈవెంట్ల నిర్వహణతో భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపిన శ్రీ గోయల్  ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 

***



(Release ID: 1991553) Visitor Counter : 107