సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని సూరత్‌లో ప్రారంభం కానున్న 12వ దివ్యకళా మేళ -2023
Posted On:
29 DEC 2023 11:56AM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్) (డిఇపిడబ్ల్యుడి), జాతీయ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌డిఎఫ్‌డిసి అన్నది డిఇపిడబ్ల్యుడి కింద ఒక అగ్ర కార్పొరేషన్) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పారిశ్రామికవేత్తలు/ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు, నైపుణ్యాలను ప్రదర్శించే ప్రత్యేక ప్రదర్శన దివ్య కళా మేళాను గుజరాత్‌లోని సూరత్‌లో 29 డిసెంబర్ 2023 నుంచి 7 జనవరి 2024వరకు నిర్వహిస్తోంది. జమ్ము&కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్తకళలు, చేనేత, ఎంబ్రాయిడరీ పని, ప్యాకేజ్డ్ ఆహారం సహా భిన్న వస్తువులతో ఈ కార్యక్రమం సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
ఇది పిడబ్ల్యడి/ దివ్యాంగ జనుల ఆర్ధిక సాధికారత దిశగా తీసుకున్న ప్రత్యేక చొరవ. దివ్యాంగ జనుల ఉత్పత్తులు, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, మార్కెటింగ్ చేసేందుకు దివ్య కళా మేళ ఒక భారీ వేదికను అందిస్తోంది. 2022లో ప్రారంభమైన ప్రదర్శనల శ్రేణిలో సూరత్‌లో జరుగుతున్న దివ్య కళా మేళ 12వది. 1)ఢిల్లీలో 2-6 డిసెంబర్ 2022న 2) 16 -25 ఫిబ్రవరి 2023 వరకు 3)భోపాల్ లో 12-21 మార్చి 2023 4) గువాహతి 11 నుంచి 17 మే 2023వరకు 5) ఇందోర్ 17 నుంచి 23 జూన్ 2023వరకు 6) జైపూర్‌లో 29 నుంచి 5 జులై 2023వరకు 7) వారణాసి 15 నుంచి 24 సెప్టెంబర్ 2023వరకు 8) సికింద్రాబాద్, హైదరాబాద్ 6 నుంచి 15 అక్టోబర్ 2023వరకు 9) బెంగళూరు, కర్నాటక 27 అక్టోబర్ నుంచి 5 నవంబర్ 2023 వరకు 10) చెన్నై, తమిళనాడు 17 నుంచి 26 నవంబర్ 2023 వరకు 11) పాట్నా (బీహార్) 8 నుంచి 17 డిసెంబర్ 2023 వరకు జరిగాయి.
దాదాపు 20 రాష్ట్రాలు/ యుటిలకు చెందిన సుమారు 100 మంది దివ్యాంగ చేతిపనివారు/ కళాకారులు, వ్యాపారవేత్తలు వారి ఉత్పత్తులను, నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు.
కింద పేర్కొన్న విస్త్రత వర్గంలో ఉత్పత్తులు ఉండనున్నాయి - గృహాలంకరణ & జీవనశైలి, దుస్తులు, స్టేషనరీ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారం, సేంద్రీయ ఉత్పత్తులు, బొమ్మలు & బహుమతులు, వ్యక్తిగత ఉపకరణాలు, ఆభరణాలు, క్లచ్ బ్యాగ్‌లు ఉంటాయి. దివ్యాంగ హస్తకళాకారులు తమ సంకల్పాన్ని, పట్టుదలను కలబోసి తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు, వోకల్ ఫర్ లోకల్ ను ఆచరణలో పెట్టేందుకు ఇది ఒక మంచి అవకాశం కానుంది.
పది రోజుల దివ్యకళా మేళా సూరత్ ప్రజల సందర్శనార్థం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలవరకు తెరిచే ఉంటుంది. ప్రదర్శనలో దివ్యాంగ కళాకారుల ప్రదర్శనలు, ప్రముఖ కళాకారులతో పాటు అనేక సాంస్కృతిక కార్యకలాపాలను వారు వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తమకు నచ్చిన ఆహారాన్ని కూడా సందర్శకులు ఎంజాయ్ చేయవచ్చు.
ఈ కార్యక్రమాన్ని 29 డిసెంబర్ 2023న సాయంత్రం 4 గంటలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికరత శాఖ మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి పాల్గొననున్నారు.
ఈ భావనను ప్రోత్సహించేందుకు విభాగం భారీ ప్రణాళికలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా దివ్యకళా మేళాను నిర్వహించడం ఇందులో భాగమే. 2023-2024వ సంవత్సరంలో ఇతర నగరాలలో కూడా దీనిని నిర్వహిస్తారు.
***
(Release ID: 1991496)
Visitor Counter : 148