ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 2 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, బి ఎస్ ఎల్ -3 లాబొరేటరీకి శంకుస్థాపన చేశారు


ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో 7 ఐ పి హెచ్ ఎల్ లేబొరేటరీలను ప్రారంభించింది

ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నందున ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలను అందించడం మా ప్రభుత్వ బాధ్యత మరియు నిబద్ధత: డాక్టర్ మాండవ్య

"కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు విస్తరించడం మాత్రమే కాకుండా వైద్య నిపుణుల అవసరాలను తీర్చడానికి మరిన్ని వైద్య మరియు నర్సింగ్ కళాశాలలను నిర్మించడం ద్వారా సమగ్ర ఆరోగ్య విధానాన్ని అనుసరిస్తోంది"

Posted On: 29 DEC 2023 11:12AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈరోజు 2 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మరియు బి ఎస్ ఎల్-3 లేబొరేటరీకి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 7 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజినీ కూడా పాల్గొన్నారు.

ఈ కొత్త సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి మరియు ఏదైనా ఆరోగ్య అత్యవసర సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.



ఈ సందర్భంగా డాక్టర్ మాండవ్య హర్షం వ్యక్తం చేస్తూ, బీఎస్‌ఎల్ ల్యాబొరేటరీ, ఏడు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు, రెండు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. లబ్ధిదారులను అభినందిస్తూ, "ఆరోగ్యకరమైన దేశం మాత్రమే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని  అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నందున ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలను అందించడం మా ప్రభుత్వ బాధ్యత మరియు నిబద్ధత" అని అన్నారు.
 

 


కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ కొత్త సౌకర్యాలు వైద్య సేవలు సౌలభ్యతను  పెంచడంలో సహాయపడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను నవీకరించడం మరియు విస్తరించడమే కాకుండా, వైద్య మరియు నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా వైద్య నిపుణుల అవసరాన్ని తీర్చడం ద్వారా ఆరోగ్య రంగంలొ  సమగ్ర విధానాన్ని అనుసరిస్తుందని ఆయన అన్నారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్య నేటికి 23కి పెరిగిందని, ఎంబీబీఎస్ మరియు నర్సింగ్ సీట్ల సంఖ్య రెట్టింపు అయిందని ఆయన చెప్పారు

.



దేశ ఆరోగ్య అవసరాలను తీర్చడానికి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమిష్టి ప్రయత్నాలు అవసరమని డాక్టర్ మాండవీయ ధృవీకరించారు. రాష్ట్రాల ఆరోగ్య కృషిలో కేంద్ర ప్రభుత్వ మద్దతు మరియు చిత్తశుద్ధిని ఆయన పునరుద్ఘాటించారు.

పీఎం-ఆబిమ్ పధకం   రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలను కొత్త సౌకర్యాలను మరింత బలోపేతం చేయడంలో సహాయపడతాయని శ్రీమతి విడదల రజినీ అన్నారు. కేంద్రం నుండి లభించిన మద్దతు మరియు మార్గదర్శనంపై ఆమె కృతజ్ఞతలు తెలిపుతూ , "పీఎం-ఆబిమ్ కింద ఆంధ్రప్రదేశ్‌కు 1271 కోట్ల రూపాయల కేటాయింపు రాష్ట్రంలోని ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు స్పందించగల సామర్థ్యాన్ని ఇస్తుంది" అని ఆమె అన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశోక్ బాబు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1991469) Visitor Counter : 136