సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

హర్యానాలోని సోనిపట్‌ లో పీఎం విశ్వకర్మ యోజనపై అవగాహన కార్యక్రమం

Posted On: 28 DEC 2023 10:47AM by PIB Hyderabad

 సోనిపట్‌ ముర్తల్ రోడ్,లో జీవిఎం గర్ల్స్ కాలేజీలో   పీఎం  విశ్వకర్మ పథకంపై సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.కర్నాల్ ఎంఎస్ఎంఈ   డెవలప్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో  జరిగిన  ఈ కార్యక్రమానికి  సోనిపట్ జిల్లా రాయ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మోహన్‌లాల్ బడోలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

పీఎం  విశ్వకర్మ పథకం వివరాలను  తొలుత కర్నాల్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ డైరెక్టర్  శ్రీ సంజీవ్ చావ్లా వివరించారు. రెజిస్ట్రేషన్ ప్రక్రియ, పథకం కింద అమలు చేసే వివిధ కార్యక్రమాలు,  గ్రామ పంచాయతీ/పట్టణ స్థానిక సంస్థల పాత్రను ఆయన వివరించారు.  సాంప్రదాయ కళాకారుల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా అర్హులైన వారు ప్రయోజనం పొందాలని ఆయన అన్నారు. .   సమ్మాన్, సామర్థ్యం, సమృద్ధి లక్ష్యంగా పథకం అమలు జరుగుతుందన్నారు. 

కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న  సోనిపట్ జిల్లా రాయ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మోహన్‌లాల్ బడోలి ప్రసంగిస్తూ హర్యానా రాష్ట్రంలోని కళాకారులందరూ ఈ పథకం కింద నమోదు చేసుకొని లబ్ధి పొందాలన్నారు.

2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారని  ఎంఎస్ఎంఈ  మంత్రిత్వ శాఖ అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ డాక్టర్  ఇషితా గంగూలి త్రిపాఠి తెలియజేసారు. ఈ పథకం కింద 15 వేల రూపాయల విలువ చేసే టూల్ కిట్ ను  కళాకారులకు అందించి ఎటువంటి పూచీకత్తు  లేకుండా  5% వడ్డీతో . 3 లక్షల వరకు రుణం సౌకర్యం అందుతుంది. రోజుకు రూ. 500 రోజువారీ భత్యంతో , ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తారు.   మార్కెటింగ్ సహాయం, సర్టిఫికెట్ , ఆర్టిజన్ గుర్తింపు కార్డు అందిస్తామని డాక్టర్  ఇషితా గంగూలి త్రిపాఠి తెలిపారు. పథకం కింద నమోదు చేసుకున్న వారిలో మహిళల శాతం 55 వరకు ఉండడం పట్ల డాక్టర్  ఇషితా గంగూలి త్రిపాఠి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించడానికి, స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించడానికి కృషి చేయాలని కోరారు.   

 

కార్యక్రమంలో సోనిపట్ సిటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (అర్బన్ లోకల్ బాడీ) శ్రీ రాకేష్ కద్యన్, జిల్లా అధికారులు  శ్రీ పరమవీర్ సైనీ , శ్రీ దినేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో CSC సెంటర్ ద్వారా 10 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారుడు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు , తాపీ మేస్త్రి, మంగలి, చాకలి, దర్జీ తదితర 18 రకాల చేతివృత్తుల కళాకారులు పేర్లు నమోదు చేసి   పీఎం విశ్వకర్మ కింద అందిస్తున్న ప్రయోజనాల గురించి తెలియజేశారు.

 సోనిపట్ జిల్లా  ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్  శ్రీ వి.పి. సింగ్ వాలియా, అసిస్టెంట్ డైరెక్టర్లు  శ్రీ సౌరభ్ అరోరా,  శ్రీ సత్ పాల్, శ్రీ కెసి మీనా,  శ్రీ ఎంకె వర్మ,  శ్రీ బల్బీర్ సింగ్, శ్రీమతి రచనా త్రిపాఠి, శ్రీమతి మీను బాలా. శ్రీ హర్పాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది కళాకారులు హాజరయ్యారు. 

 

***

 


(Release ID: 1991259) Visitor Counter : 121