మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

భారతీయ పౌల్ట్రీ ఎగుమతులను పెంచడానికి మరియు పౌల్ట్రీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ఎదురయ్యే సవాళ్లు మరియు అనుసరించాల్సిన వ్యూహాలను గుర్తించడానికి కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి పౌల్ట్రీ ఎగుమతి దారులతో న్యూఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.


గుడ్లు, బ్రాయిలర్‌ల ఉత్పత్తి ఏడాదికి 8 నుంచి 10 శాతం చొప్పున పెరుగుతోందని కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ చెప్పారు.

ఎగుమతులను ప్రోత్సహించడానికి 33 పౌల్ట్రీ కంపార్ట్‌మెంట్‌లను ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా రహితమైనవిగా డిపార్ట్మెంట్ గుర్తించింది: కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ

2022-–23 ఆర్థిక సంవత్సరంలో.. భారతదేశం 664,753.46 మెట్రిక్ టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను 57 దేశాలకు ఎగుమతి చేసింది. దీని మొత్తం విలువ రూ. 1,081.62 కోట్లు (134.04 మిలియన్ అమెరికన్ డాలర్లు)

Posted On: 23 DEC 2023 11:24AM by PIB Hyderabad

కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ  అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.  భారత పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతి: పౌల్ట్రీ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఎదురయ్యే సవాళ్లు మరియు అనుసరించాల్సిన వ్యూహాల’’పై ఈ వ్యూహాత్మక సమావేశం  జరిగింది.  ప్రముఖ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమ సంఘాలతో సహా కీలకమైన వాటాదారులను ఈ సమావేశం ఒకచోటుకు చేర్చింది.


ఈ సందర్భంగా కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ  మాట్లాడుతూ..  ప్రస్తుతం వ్యవసాయంలో అంతర్భాగమైన భారతీయ పౌల్ట్రీ రంగం ప్రోటీన్ మరియు పోషకాహార అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పంటల ఉత్పత్తి ఏడాదికి 1.5 నుంచి 2 శాతం చొప్పున పెరుగుతుండగా..  గుడ్లు, బ్రాయిలర్‌ల ఉత్పత్తి ఏటా 8 నుంచి 10 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇది ఒక అతిపెద్ద పరిశ్రమగా పరిణామం చెందిందన్నారు.  గుడ్లు మరియు బ్రాయిలర్ మాంసం యొక్క ప్రధాన ప్రపంచ ఉత్పత్తిదారుగా భారతదేశాన్ని నిలబెట్టిందని కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ చెప్పారు.



ఎగుమతులను పెంచేందుకు పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు అల్కా ఉపాధ్యాయ్ తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ పాథోజెనిసిటీ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను అధిగమించిందని డిపార్ట్మెంట్ ఇటీవలే స్వీయ ప్రకటనను సమర్పించిందన్నారు. భారతీయ పౌల్ట్రీ ఎగుమతులను ప్రోత్సహించడానికి 33 పౌల్ట్రీ కంపార్ట్‌మెంట్‌లను ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా రహితంగా గుర్తించినట్లు తెలిపారు. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (డబ్ల్యూఓఏహెచ్) వాలిడిటీ ఆధారంగా 26 కంపార్ట్మెంట్ లను గుర్తించింది. డిపార్ట్మెంట్ చేసిన స్వీయ ప్రకటన  అక్టోబర్ 13, 2023న వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (డబ్ల్యూఓఏహెచ్) ఆమోదం పొందింది.  అంతేకాకుండా, గత సంవత్సరాల్లో దాణా కొరత సమస్యను పరిష్కరించడానికి కేంద్ర  పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ చొరవ తీసుకుంది. అలాగే కోవిడ్ సమయంలో పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాపించే తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి డిపార్ట్‌మెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంది.

భారతీయ పౌల్ట్రీ ఎగుమతులను ప్రోత్సహించడం, భారతీయ పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యాపారాన్ని సులభతరం చేయడం, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులలో సవాళ్లను పరిష్కరించడం మరియు అనధికారిక రంగంలో యూనిట్ల ఏకీకరణకు వ్యూహరచన చేయడం మరియు ప్రపంచంలో భారతీయ పౌల్ట్రీ రంగాల స్థానాన్ని మరింత సుస్థిరం చేయడంపై కేంద్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శ అల్కా ఉపాధ్యాయ ధీమా వ్యక్తం చేశారు.  పౌల్ట్రీ మరియు పౌల్ట్రీ సంబంధిత ఉత్పత్తుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి పౌల్ట్రీ కంపార్ట్‌మెంటలైజేషన్ భావనను అనుసరించడం ద్వారా హెచ్పీఏఐతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి డిపార్ట్‌మెంట్ ప్రోయాక్టివ్ విధానంపై డిపార్ట్మెంట్ ఆలోచనలను ఈ సమావేశంలో అల్కా ఉపాధ్యాయ్ పంచుకున్నారు.

2022-–23 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం ప్రపంచ మార్కెట్లో గణనీయమైన పురోగతి సాధించింది.  57 దేశాలకు 664,753.46 మెట్రిక్ టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాటి  మొత్తం విలువ రూ. 1,081.62 కోట్లు (134.04 మిలియన్ USD). ఇటీవలి మార్కెట్ ఇంటెలిజెన్స్ అధ్యయనం ప్రకారం, భారతీయ పౌల్ట్రీ మార్కెట్ 2024–-2032 నుండి 8.1% సీఏజీఆర్తో 2023లో 30.46 బిలియన్ల అమెరికన్ డాలర్ల విశేషమైన విలువను సాధించింది.

రౌండ్ టేబుల్ సమావేశం డైనమిక్ ఎక్స్ఛేంజీలకు వేదికగా పనిచేసింది.  ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి మరియు భారత పౌల్ట్రీ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి బలమైన వ్యూహాలను రూపొందించడానికి సహకార ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. ఈ సమావేశంలో పౌల్ట్రీ రంగ ప్రతినిధులు, ఎగుమతిదారులతో పౌల్ట్రీ ఎగుమతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన పశువుల అభివృద్ధికి మరియు భారతదేశంలోని పాడి మరియు మాంసం రంగాలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి అంకితం చేయబడింది.

ఇన్వెస్ట్ ఇండియా గురించి:

ఇన్వెస్ట్ ఇండియా అనేది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ మరియు ఫెసిలిటేషన్ ఏజెన్సీ. పెట్టుబడిని ఉత్ప్రేరకపరచడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మరియు భారతదేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.

 

***



(Release ID: 1991206) Visitor Counter : 51