వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నూతన సాంకేతికతలతో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 2.0 ... శ్రీ పీయూష్ గోయల్
జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇ-జాగృతి పోర్టల్, అన్ని రాష్ట్ర వినియోగదారుల కమీషన్ల కోసం వీసీ సౌకర్యాన్ని ప్రారంభించిన శ్రీ గోయల్
ఈ ఏడాది నవంబర్ వరకు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ కు వచ్చిన వచ్చిన కాల్‌ల సంఖ్య10,000 నుంచి 1,32,209కి పెరిగింది... శ్రీ గోయల్
Posted On:
24 DEC 2023 5:47PM by PIB Hyderabad
వినియోగదారుల రక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం 2023 ని న్యూఢిల్లీలో వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్వహించింది.జాతీయ వినియోగదారుల దినోత్సవం 2023లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్స్,జౌళి, వాణిజ్యం,పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్పాల్గొన్నారు. ప్రారంభ ప్రసంగంలో వినియోగదారుల సంతృప్తి దేశాభివృద్ధిలో కీలక అంశంగా ఉంటుందని అన్నారు. బి 20 శిఖరాగ్ర సమావేశంలో వినియోగదారుల హక్కులపై జరిగిన గురించి చర్చలో వినియోగదారుల హక్కుల సంరక్షణ ప్రాముఖ్యతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా దేశ పురోగతి వినియోగదారుల సంతృప్తిని పై ఆధారపడి ఉందని చేసిన ప్రకటనను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
వినియోగదారుల హక్కుల సంరక్షణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ అమలు చేస్తున్న చర్యలను ప్రశంసించిన శ్రీ గోయల్ ఇ-జాగృతి పోర్టల్‌ను, అన్ని రాష్ట్ర వినియోగదారుల కమీషన్ల కోసం వీసీ సౌకర్యాన్ని,17 భాషల్లో అందుబాటులో ఉండే జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 2.0, ఎన్టీహెచ్ లో డ్రోన్ పరీక్ష సౌకర్యాన్ని ప్రారంభించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని శ్రీ గోయల్ తెలిపారు. వినియోగదారుల నుంచి వస్తున్న కాల్స్ 13 రెట్లు పెరగడం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనమన్నారు.ప్రభుత్వం రూపొందించిన . కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌లు (QCOs) మార్కెట్‌లోని వస్తువుల నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం విస్తృత వినియోగం వల్ల సానుకూల ప్రభావం ఉంటుందని, అయితే, ఇదే సమయంలో దుష్ప్రభావాలు కూడా ఉంటాయని మంత్రి వ్యాఖ్యానించారు.కృత్రిమ మేధస్సు వినియోగం, వినియోగదారుల రక్షణ వంటి అంశాలకు సంబంధించి నిరంతరం చర్చలు జరగాలని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇటీవల విడుదల చేసిన నియంత్రణ మార్గదర్శకాలు, 2023"ని మంత్రి అభినందించారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉండే 13 నిర్దిష్ట నమూనాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.తారుమారు చేసిన పద్ధతులను నిరోధించడం,నియంత్రించడం, వినియోగదారుల కోసం న్యాయమైన, పారదర్శకమైన మార్కెట్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
కేసుల పరిష్కారంలో సానుకూల మార్పులను తీసుకు వచ్చేందుకు ఇటీవల జాతీయ కమిషన్ అధ్యక్షుడిగా నియమితులైన న్యాయమూర్తి శ్రీ అమరేశ్వర్ ప్రతాప్ సాహి చేస్తున్న కృషిని శ్రీ గోయల్ ప్రశంసించారు. పాత పెండింగ్ కేసుల పరిష్కారం, కొత్త కేసులను మరింత వేగంగా , నిజ సమయంలో పరిష్కరించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, వినియోగదారుల కమీషన్‌లతో కలిసి వ్యూహరచన చేయాలని వినియోగదారుల వ్యవహారాల శాఖకు మంత్రి సూచించారు.
నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడుతూ వినియోగదారుల వ్యవహారాల శాఖ సహకారంతో అవసరమైన చర్యలు అమలు చేయడం, ద్రవ్య , ఆర్థిక విధానాలను అమలు చేయడం ద్వారా భారతదేశం ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో విజయం సాధించిందని శ్రీ గోయల్ అన్నారు. ధరల పర్యవేక్షణ కోసం కొత్తగా 140 కేంద్రాలు ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ, సమస్యల పరిష్కారం కోసం చర్యలు అమలు చేస్తుందని మంత్రి అన్నారు. నూతనంగా ఏర్పాటైన కేంద్రాలతో దేశంలో ధరల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న కేంద్రాల సంఖ్య 550కి చేరింది. సూచిక ధరను పర్యవేక్షించి, విశ్లేషించి వినియోగదారులకు ఆహార ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించడానికి ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వినియోగదారులందరికీ సబ్సిడీ ధరలో భారత్ దాల్ , భారత్ అట్టాతో పాటు టమాటా ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి శాఖ అమలు చేస్తున్న చర్యలు వినియోగదారులకు ప్రయోజనం కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. ద్రవ్యోల్బణం నుండి వినియోగదారులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు అమలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
మెరుగైన వినియోగదారుల భవిష్యత్తు కోసం, ప్రజల సహకారంతో ప్రజలను భాగస్వాములను చేసి కార్యక్రమాలు అమలు చేయాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖకు సూచించిన మంత్రి ప్రజలకు అవగాహన కల్పించడం, ఎంపికలు అందించడం, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారం, అభిప్రాయ సేకరణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవం, 2023 సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ ఈ క్రింది వాటిని విడుదల చేశారు:
1. వినియోగదారుల కమీషన్ల కోసం ఇ-జాగృతి పోర్టల్ ప్రారంభం
2. ఎన్‌సిడిఆర్‌సిలో విసి ఫెసిలిటీ ప్రారంభోత్సవం
3. NTHలో డ్రోన్ సర్టిఫికేషన్ సౌకర్యం ప్రారంభం.
4. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 2.0 ప్రారంభోత్సవం.
5. నేషనల్ టెస్ట్ హౌస్‌లో కొత్త ప్రయోగశాలల ప్రారంభోత్సవం
6.ముంబై లో గృహోపకరణాలను పరీక్షించే ప్రయోగశాల,గువాహటిలో ట్రాన్స్‌ఫార్మర్ టెస్టింగ్ సౌకర్యం
7. జైపూర్‌లోని ఆర్గానిక్ ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీ
8. EV (పరీక్ష)లో పరస్పర సహకారం కోసం NTH మరియు RRSL మధ్య అవగాహన ఒప్పందం మార్పిడి
ఎన్‌సిడిఆర్‌సి అధ్యక్షుడు జస్టిస్ శ్రీ అమరేశ్వర్ ప్రతాప్ సాహి తన ముఖ్య ఉపన్యాసంలో 'ఉప్ భోక్త దేవో భవ' ప్రాముఖ్యతను ప్రస్తావించారు. వినియోగదారుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా చర్యలు అమలు జరగాలన్నారు. కేసుల ఇ-ఫైలింగ్ సౌకర్యం దేశంలో ప్రతి మూలకు అందుబాటులో ఉండాలని, సాంకేతిక అవగాహన లేని వినియోగదారులు కూడా ఇ-దాఖిల్ ద్వారా కేసును దాఖలు చేయడానికి వీలు కల్పించాలని ఆయన సూచించారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు,, ఆహారం, ప్రజా పంపిణీ మరియు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ బిఐఎస్, లీగల్ మెట్రాలజీ, నేషనల్ టెస్ట్ హౌస్ ద్వారా వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల అమలు, ఆన్‌లైన్ పోర్టల్స్, టెస్టింగ్ సౌకర్యాల అప్‌గ్రేడేషన్. ఇ-కామర్స్‌లో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడం వల్ల వినియోగదారులకు ప్రమాదాలు, సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని శ్రీ అశ్విని కుమార్ చౌబే హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని , వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం సమర్థవంతంగా మరియు సకాలంలో పరిష్కరించడం కోసం చర్యలు అమలు జరగాలన్నారు.
వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ తన ప్రారంభ వ్యాఖ్యలలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు, కేసుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు, పరీక్షా ప్రమాణాల రంగంలో సాధించిన విజయాల వివరాలు వివరించారు. కేసుల పరిష్కారం, సమర్థవంతమైన పాలన కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
ప్రారంభ కార్యక్రమం తర్వాత, కింది అంశాలపై సాంకేతిక సదస్సులు జరిగాయి:- :
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- వినియోగదారుల హక్కుల పరిరక్షణ.
* వినియోగదారుల కేసులను త్వరగా పరిష్కరించడంలో సాంకేతికత పాత్ర.
*వినియోగదారు ఎంపికలు , ప్రాధాన్యతలపై చీకటి నమూనాల ప్రభావం
సంయుక్త కార్యదర్శి శ్రీ అనుపమ్ మిశ్రా,శ్రీ వినీత్ మాథుర్, సీనియర్ అధికారులు, వినియోగదారుల కమిషన్ల అధ్యక్షులు, సభ్యులు, వివిధ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, పరిశ్రమ సంఘాలు, వినియోగదారుల సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
****
(Release ID: 1990155)
Visitor Counter : 129