సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దివ్యాంగుల (వికలాంగులకు) రిజర్వేషన్ కోసం వికలాంగ కేటగిరీల సంఖ్యను మోదీ ప్రభుత్వం 3 నుంచి 5కి పెంచిందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్
చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న దివ్యాంగుల కోసం ఉద్దేశించిన 15,000 పోస్టులను ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కింద భర్తీ చేసింది: డాక్టర్ జితేంద్ర సింగ్
2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు: డాక్టర్ జితేంద్ర సింగ్
"సమ్మిళిత సమాజం మరియు వికలాంగుల సాధికారత కోసం పని చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది": డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
24 DEC 2023 5:38PM by PIB Hyderabad
దివ్యాంగుల (వికలాంగులు) రిజర్వేషన్ కోసం వికలాంగ వర్గాల సంఖ్యను మోదీ ప్రభుత్వం 3 నుండి 5కి పెంచింది.
దివ్యాంగ్ ఎంప్లాయీస్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందంతో కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, డిఓపిటి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్) ఇంచార్జ్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమాచారాన్ని తెలిపారు. ఇంతకుముందు మూడు కేటగిరీలు 1) అంధత్వం మరియు తక్కువ దృష్టి 2) చెవిటి మరియు వినికిడి లోపం మరియు 3) మస్తిష్క పక్షవాతం, కుష్టు వ్యాధి, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు మరియు కండరాల బలహీనతతో పాటు లోకోమోటర్ వైకల్యం వంటి ఉండగా ఇప్పుడు వాటికి అదనంగా 4) ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం మరియు మానసిక అనారోగ్యం మరియు 5) చెవిటి-అంధత్వంతో సహా క్లాజులు (1) నుండి (4) వరకు వ్యక్తుల మధ్య బహుళ వైకల్యాలను చేర్చినట్టు కేంద్రమంత్రి చెప్పారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వాల వల్ల ప్రధాన స్రవంతి నుండి దూరంగా ఉన్న సమాజంలోని వర్గాల వారికి అండగా ఉండాలన్న ప్రధాని మోదీ నిబద్ధతకు ఇది కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
“ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్, 2016’ ప్రకారం, వికలాంగుల కేటగిరీలు 3 నుండి 5కి పెంచబడ్డాయి మరియు మరిన్ని రకాల వైకల్యాలను జోడించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంది. అంతేకాకుండా దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 3 నుంచి 4 శాతానికి, విద్యలో 5 శాతానికి రిజర్వేషన్ కోటాను పెంచారు.
దివ్యాంగులు మానవ వనరులలో అంతర్భాగమని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్..సమ్మిళిత సమాజం మరియు వికలాంగుల సాధికారత కోసం కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
“సివిల్ సర్వీసెస్ పరీక్షలో దివ్యాంగులకు ఫీజు మినహాయింపు, దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు అర్హత సాధించే కేడర్ రెండు ఎంపికలు, దివ్యాంగుల పింఛను పెంపు, అటెండర్ అలవెన్స్ పెంపు మొదలైన చర్యలను దివ్యాంగుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది” అన్నాడు.
చాలా ఏళ్లుగా భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న దాదాపు 15,000 దివ్యాంగ పోస్టులను ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కింద భర్తీ చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వికలాంగులను ఉద్దేశించి 'విక్లాంగ్' అనే బదులు వారిని 'దివ్యాంగ్' (దైవ శరీరం) అని పిలవాలన్న ఆలోచన కూడా ప్రధాని మోదీగదేనని చెప్పారు.
దివ్యాంగులకు సాధికారత కల్పించడం ద్వారా ప్రధాని చేస్తున్న కృషిని కొనియాడుతూ ప్రమోషన్ మార్గాలు మరియు సేవా పరిస్థితుల కోసం ఇన్‌పుట్‌లను సూచిస్తూ ప్రతినిధి బృందం మంత్రికి మెమోరాండం సమర్పించింది.
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో పారా అథ్లెట్లను అభివృద్ధి పరుస్తామని, పారాలింపిక్స్‌లో ముందుకు సాగేలా చేస్తామని హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
2021 ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగిన టోక్యో 2020 పారాలింపిక్స్‌లో భారతీయ పారాలింపియన్లు 5 బంగారు, 8 రజతాలు మరియు 6 కాంస్యాలతో సహా 19 పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించారు.
దివ్యాంగుల కోసం ప్రభుత్వం షిల్లాంగ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక క్రీడా శిక్షణా సంస్థను ఏర్పాటు చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు స్టార్టప్‌లలో దివ్యాంగులకు మద్దతు ఇవ్వడానికి గత 9 సంవత్సరాలలో సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేసారు.
***
(Release ID: 1990121)
Visitor Counter : 243