సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబుల్టీస్ (పీడీయుఎన్ఐపీవీడీ) మొదటి స్నాతకోత్సవం

Posted On: 22 DEC 2023 6:58PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (పీడీయుఎన్ఐపీవీడీ) మొదటి స్నాతకోత్సవం22.12.2023న నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి కుమారి ప్రతిమా భూమిక్ ముఖ్య అతిథిగా మరియు డీఈపీడబ్ల్యుడీ డైరెక్టర్ (ఎన్.ఐ.ఎస్) శ్రీ వినీత్ సింఘాల్ ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా హాజరయ్యారు. జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2023 గ్రాడ్యుయేట్‌లను అభినందించారు మరియు ఉత్తీర్ణత సాధించిన బ్యాచ్‌లో.. మెజారిటీ బాలికలు గ్రాడ్యుయేట్లు విజయం సాధించడం పట్ల ఆమె సంతోషం మరియు సంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు ఆడపిల్లలు చదువుకుని సాధికారత సాధించాలనేది గౌరవప్రదమైన ప్రధాన మంత్రి  కల అని ఆమె పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారతదేశం నలుమూలల నుండి విద్యార్థుల ఉనికిని కూడా ఆమె గుర్తించింది. విద్యార్థులు నిస్వార్థ మరియు నిజాయితీ సాధన యొక్క గంభీరమైన ప్రమాణానికి కట్టుబడి ఉండాలని ఆమె తన ఆశను మరియు కోరికను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు, తద్వారా దేశం మొత్తం బలోపేతం అవుతుందని అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబుల్టీస్ సంస్థ డైరెక్టర్ కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా.  భవిష్యత్తు ప్రణాళికలను గురించి వివరించారు.

 

***


(Release ID: 1989808) Visitor Counter : 107
Read this release in: English , Urdu , Hindi