పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
మెట్రో నగరాలలో వంట కోసం పిఎన్‌జి
Posted On:
21 DEC 2023 5:22PM by PIB Hyderabad
గొట్టాల ద్వారా సహజ వాయువు (పిఎన్‌జి) కనెక్షన్లను అందించడం అన్నది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) నెట్‌వర్క్ అభివృద్ధిలో భాగం. దీనినే పెట్రోలియం & సహజవాయువు నియంత్రణ బోర్డు (పిఎన్‌జిఆర్‌బి) నుంచి అధికారం పొందిన సంస్థలే నిర్వహిస్తున్నాయి. 11ఎ సిజిడి బిడ్డింగ్ దశ పూర్తి అయిన తర్వాత, దేశంలో 98% జనాభాను, మొత్తం 28 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉండి జిఎకు పరిధిలో మెట్రోపాలిటన్ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు సహా 630 జిల్లాలతో 88% భౌగోళిక ప్రాంతాన్ని సిజిడి నెట్‌వర్క్ కింద కవర్ చేయడం జరిగింది. కనీస పని ప్రణాళిక (ఎండబ్ల్యుపి) ప్రకారం పిఎన్‌జిఆర్‌బి నిర్ధారించిన లక్ష్యంతో, సాధికార సిజిడి సంస్థలు 2032 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 12.50 కోట్ల పిఎన్‌జి (డి) కనెక్షన్లను అందించాలి.
దేశంలో సహజవాయువు అందుబాటును విస్తరించేందుకు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, మణిపూర్, జమ్ము& కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలు, మొత్తం లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ పిఎన్‌జిఆర్‌బి 12వ, 12ఎ సిజిడి బిడ్డింగ్ రౌండ్లను నిర్వహించారు.
ఈ సమాచారాన్ని పెట్రోలియం & సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి గురువారం లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1989445)
Visitor Counter : 89