సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యువ కళాకారులకు ఉపకార వేతనాలు
Posted On:
21 DEC 2023 3:12PM by PIB Hyderabad
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాలు (ఎస్‌వైఏ)’ పథకాన్ని అమలు చేస్తోంది. సాంప్రదాయ కళారూపాలు సహా వివిధ సాంస్కృతిక రంగాల్లో యువ కళాకారులు ఆధునిక శిక్షణ పొందేందుకు ఈ ఆర్థిక సాయాన్ని మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తుంది. ఈ పథకం భాగం కింద ఎన్నికైన కళాకారుడికి నెలకు రూ.5,000/- చొప్పున, రెండు సంవత్సరాల పాటు, నాలుగు సమాన ఆరు నెలల వాయిదాల్లో ఉపకార వేతనం అందుతుంది. ఎంపికైన కళాకారులకు 18-25 సంవత్సరాల వయస్సు ఉండాలి. కనీసం 5 సంవత్సరాలుగా ఎవరైనా గురువు లేదా ఏదైనా సంస్థ దగ్గర శిక్షణ పొందుతూ ఉండాలి. ఉపకార వేతనాల మంజూరు కోసం, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వద్ద వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ ముఖాముఖిలో కళాకారుడి పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు.
గత ఐదేళ్లలో, 'వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాలు' పథకం కింద ఉపకార వేతనాల కోసం చేసిన ఖర్చు, లబ్ధి పొందిన యువ కళాకారుల వివరాలు ఇవి:-
ఆర్థిక సంవత్సరం
|
ప్రయోజనం పొందిన మొత్తం యువ కళాకారుల సంఖ్య
|
ఉపకార వేతనాల కోసం చేసిన వ్యయం (రూ. లక్షల్లో)
|
2018-19
|
1151
|
345.30
|
2019-20
|
1086
|
325.80
|
2020-21
|
1265
|
379.50
|
2021-22
|
1293
|
390.30
|
2022-23
|
396
|
118.80
|
ఎంపికైనా కళాకారుడు ఆరు నెలలవారీ నివేదికలను సమర్పించడంపై ఉపకార వేతనాల పంపిణీ ఆధారపడి ఉంటుంది, ఇది నిరంతర ప్రక్రియ.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
***
(Release ID: 1989260)
Visitor Counter : 93