బొగ్గు మంత్రిత్వ శాఖ
మొత్తం బొగ్గు ఉత్పత్తి ఒక బిలియన్ టన్నులు దాటే అవకాశం ఉంది - మంత్రి ప్రహ్లాద్ జోషి
2025 ఆర్థిక సంవత్సరం నాటికి విద్యుత్ రంగ బొగ్గు దిగుమతి రెండు శాతానికి తగ్గుతుంది
ప్రారంభమైన 9వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం
ఆఫర్‌లో నాలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పై ఒక్క బొగ్గు గనులు
అసాధారణ పనితీరుకు బొగ్గు కంపెనీలకు స్టార్ రేటింగ్ అవార్డులు అందించబడ్డాయి
Posted On:
21 DEC 2023 1:25PM by PIB Hyderabad
దేశీయ బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున 2025 నాటికి విద్యుత్ రంగానికి బొగ్గు దిగుమతి 2 శాతానికి తగ్గుతుందని కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. నిన్న ఇక్కడ 9వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ..బొగ్గు ఉత్పత్తి మరియు ఆఫ్ టేక్‌లో స్వయం సమృద్ధి సాధించడానికి రికార్డ్ పనితీరు కోసం కోల్ ఇండియా లిమిటెడ్ మరియు అనుబంధ కంపెనీలకు శ్రీ జోషి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది మొత్తం బొగ్గు ఉత్పత్తి బిలియన్ టన్నులు దాటే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. భారతదేశపు బొగ్గు రంగం నిరంతరం దేశ ఇంధన భద్రతకు దోహదపడుతోందని తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తోందని చెప్పారు.
భారతదేశం అనుసరిస్తున్న స్థిరమైన బొగ్గు మైనింగ్ పద్ధతులను వివరించిన శ్రీ జోషి..ఉద్గారాలలో దేశం ప్రపంచ అగ్రగామిగా అవతరించిందన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌కు 6000 కోట్ల ప్రోత్సాహకం ఇచ్చినట్టు తెలిపారు. స్థిరమైన మైనింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు బొగ్గు పిఎస్‌యులు ఇటీవలి సంవత్సరాలలో 100 మిలియన్ మొక్కలను నాటినట్లు మంత్రి తెలిపారు.
9వ రౌండ్‌లో 26 మరియు 7వ రౌండ్‌లో 2వ ప్రయత్నంలో 5 సహా మొత్తం 31 బొగ్గు గనులు 9వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలంలో అందించబడ్డాయి. వేలం వేయబడుతున్న గనులు బొగ్గు/లిగ్నైట్-బేరింగ్ రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి.
భారతదేశం మొత్తం 344.02 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను కలిగి ఉంది మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా ఉంది. భారతదేశ విద్యుత్ డిమాండ్‌లో గత కొన్నేళ్లుగా స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. భారతదేశంలో 72% విద్యుత్తు బొగ్గు నుండి ఉత్పత్తి చేయబడినందున ఇది దేశ అభివృద్ధికి చాలా వ్యూహాత్మక రంగం అవుతుంది.
వాణిజ్య బొగ్గు గనుల తవ్వకం దేశానికి కొత్త పెట్టుబడులను తీసుకువస్తుందని మరియు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. బొగ్గును కలిగి ఉన్న రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ మరియు అస్సాం రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను తీసుకురావడానికి వేలం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం కేటాయించబడుతుంది.
ఇప్పటి వరకు వేలం వేసిన గనుల నుంచి బొగ్గు తవ్వకం ద్వారా ఏటా రూ. ~33,343 కోట్ల రాబడి వస్తుండగా ~220.90 ఎంటిపిఏ సముదాయ పీక్ రేట్ కెపాసిటీ స్థాయిలో ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ గనులు పూర్తిగా అందుబాటులోకి వస్తే అవి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు మూడు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తాయి. అలాగే ఈ బొగ్గు గనుల నిర్వహణకు రూ. 30,000 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నారు.
పరిశుభ్రతను సంస్థాగతీకరించడం మరియు పెండింగ్‌ను తగ్గించడం లక్ష్యంగా ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా బొగ్గు మరియు లిగ్నైట్ గనులు అనూహ్యంగా పనిచేసిన వారికి స్టార్ రేటింగ్ అవార్డులను మరియు బొగ్గు సిపిఎస్‌ఈలకు వివిధ విభాగాల్లో సర్టిఫికేట్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా ప్రసంగిస్తూ ఫైవ్‌స్టార్ రేటింగ్‌లు సాధించిన బొగ్గు గనులకు అభినందనలు తెలియజేసారు. బొగ్గు ఉత్పత్తి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బొగ్గు మరియు లిగ్నైట్ మైనింగ్ రంగంలో అత్యుత్తమ పనితీరుకు ఈ గుర్తింపు ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అదనపు కార్యదర్శి & నామినేటెడ్ అథారిటీ శ్రీ ఎం నాగరాజు స్థిరమైన బొగ్గు ఉత్పత్తిని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ సంస్కరణలను హైలైట్ చేశారు.
గనుల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడం మరియు బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా దేశంలో బొగ్గు మరియు లిగ్నైట్ మైనింగ్ పనితీరు మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రభుత్వం 01.04.2019 నుండి ఆమోదించింది. ఈ విధానం బొగ్గు మరియు లిగ్నైట్ మైనింగ్‌లో పనితీరు మరియు స్థిరత్వ ప్రమాణాలను గణనీయంగా పెంచింది, దేశవ్యాప్త భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. స్టార్ రేటింగ్‌లు ఫైవ్ స్టార్ నుండి నో స్టార్ వరకు ఉంటాయి. ప్రతి గని విజయాలను మూడు విభాగాలలో సమగ్రంగా అంచనా వేస్తుంది: భూగర్భ గనులు (యూజీ), ఓపెన్‌కాస్ట్ మైన్ (ఓసీ) మరియు మిశ్రమ గనులు. ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో మొత్తం 50 మూల్యాంకన పారామితులు మరియు భూగర్భ గనులలో 47 ఈ ఏడు మాడ్యూళ్లలో పేర్కొనబడ్డాయి.
గత నాలుగు సంవత్సరాలలో (2018-19, 2019-20, 2020-21, 2021-22) మొత్తం 68 గనులు 5-స్టార్ రేటింగ్‌కు అర్హత సాధించాయి. 91% కంటే ఎక్కువ స్కోర్ సాధించి 39 గనులు 1వ, 2వ, 3వ స్థానంలో నిలిచాయి.
బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రజా ఫిర్యాదులు, పిఎంఓ సూచనలు, సిఎంఓ సూచనలు మరియు ఐఎంసీ విషయాలను పరిష్కరించడంలో 100% విజయవంతమైన రేటును సాధించడం ద్వారా ప్రత్యేక ప్రచార 3.0ని విజయవంతంగా పూర్తి చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు దాని సిపిఎస్‌ఈలు అన్ని మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో 'స్పేస్ ఫ్రీడ్' కేటగిరీలో అగ్రస్థానాన్ని పొందాయి. బొగ్గు పిఎస్‌యులు మైనింగ్ స్క్రాప్ మెటీరియల్‌లను అద్భుతమైన శిల్పాలు మరియు వివిధ కళాఖండాలుగా సృజనాత్మకంగా పునర్నిర్మించాయి.
***
(Release ID: 1989257)
Visitor Counter : 291