గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి జన్ మన్ కింద గిరిజన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : శ్రీ అర్జున్ ముందా


సికిల్ సెల్ రక్తహీనత నిర్మూలనకు ఇప్పటి వరకు 90 లక్షల మందికి పరీక్షలు: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులతో సహా అట్టడుగు స్థాయి ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ

కార్యక్రమాలను 100% సంతృప్తం చేయడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం: శ్రీ అర్జున్ ముందా

పి ఎం జె ఎ వై దేశంలో నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది: అర్జున్ ముందా

Posted On: 20 DEC 2023 3:51PM by PIB Hyderabad

ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ ఆరోగ్యం- అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత కు సంబంధించి కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముందా   న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

 

నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజేఎంపీ (లోక్ సభ), శ్రీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మఎంపి (రాజ్యసభ), శ్రీమతి ఇందు బాలా గోస్వామి కూడా మీడియా సమావేశం లో పాల్గొన్నారు.

ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను 2018 సెప్టెంబర్ 23 జార్ఖండ్ లోని రాంచీలో ప్రారంభించామని, ఇది దేశంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తోందని శ్రీ ముందా  తెలియజేశారు. ఇది 55 కోట్లకు పైగా లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం అని, సంవత్సరానికి రూ .5 లక్షల భీమా కవరేజీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

 

2023 జూలై 1 నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా (ఎస్ సిఎ) ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా దేశంలోని గిరిజన జనాభాలో వ్యాధి విసురుతున్న గణనీయమైన ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం దీని లక్ష్యం. ఎస్ సి కోసం ఎనిమిది కోట్ల మంది గిరిజనులను స్క్రీనింగ్ చేయడమే మిషన్ లక్ష్యమని, వీరిలో ఇప్పటికే 90 లక్షల మందికి సంబంధించిన డేటాను సేకరించామని ముందా తెలిపారు.

 

గిరిజన ప్రాంతాల్లో 360 డిగ్రీల అభివృద్ధిని తీసుకురావడానికి ప్రధాన మంత్రి జన జాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎంజన్మన్ ) అనే బృహత్తర కార్యక్రమం గురించి శ్రీ ముందా  తెలియజేశారు. పీఎం జన్మన్ మిషన్ వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల  పథకాల వల్ల వదిలివేయబడిన  ముఖ్యంగా బలహీనమైన 75 గిరిజన సమూహాల (పివిటిజి) అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ సుమారు రూ. 24,000 కోట్ల ఆర్థిక వ్యయాన్ని కలిగి ఉందిఇంకా తొమ్మిది ప్రధాన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 11 కీలక జోక్యాలపై దృష్టి పెడుతుంది. ప్రధాని మోదీ పాలనలో గిరిజన ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించామని మంత్రి వివరించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్, సమన్వయ మంత్రిత్వ శాఖగా ఉంటుందని, మిగతా ఎనిమిది సెక్టోరల్ మంత్రిత్వ శాఖలు, విభాగాలు వాటికి సంబంధించిన జోక్యాలను అమలు చేస్తాయని తెలిపారు. ఇప్పుడు

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులతో సహా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ కార్యక్రమాలను 100 శాతం పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం గత 70 ఏళ్లలో సాధించిన దానికంటే గత 9 సంవత్సరాలలో ఎక్కువ ప్రగతి సాధించిందని, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలలో ఒకటిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల (హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ )మిషన్ కింద ఆయుష్మాన్ భారత్ పథకం జిల్లా స్థాయిలో ఆధునిక ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తోంది. దేశంలో కేవలం ఎనిమిది ఎయిమ్స్ లు మాత్రమే ఉండగా, ఇప్పుడు సంఖ్య 23కి పెరిగిందని, వాటిలో 20 పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. టెస్టింగ్ సౌకర్యాలు కల్పించామని, 1.6 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి, ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజంఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి చాలా అవసరం అని శ్రీ ముందా అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కింద దేశం ఆరోగ్య రంగంలో అపూర్వమైన విప్లవాన్ని చవిచూసిందని శ్రీ అర్జున్ ముందా అన్నారు. “నేడు దేశంలో తొలిసారిగా ఆరోగ్యాన్ని అభివృద్ధితో ముడిపెడుతున్నారు. నిజానికి ఇప్పుడు దేశంలో 'హెల్తీ నేషన్, రిచ్ నేషన్' అనే భావన ఏర్పడిందిఅన్నారు.

 

దేశం లో గత కొద్ది సంవత్సరాలలో-

 

  •  ప్రాథమిక ఆరోగ్యం కోసం 1,63,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభించబడ్డాయి, ప్రతి 10,000 కంటే తక్కువ జనాభాకు ఒక కేంద్రం అందుబాటులో ఉంది.
  •  ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే లక్ష్యంతో గత తొమ్మిదేళ్లలో వాటి సంఖ్యను 350 నుంచి 700కు పెంచారు.
  •  గత తొమ్మిదేళ్లలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 52 వేల నుంచి 1,80,000కు పెంచారు.
  •  అలాగే పీజీ సీట్ల సంఖ్యను 31,185 (2014లో) నుంచి ప్రస్తుతం 70,674కు పెంచారు.
  •  గత తొమ్మిదేళ్లలో దేశంలో 10 వేలకు పైగా జన ఔషధి స్టోర్లను ప్రారంభించా రు. ఇప్పుడు వాటి సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నారు. ఒకప్పుడు పేదలకు అందుబాటులో లేని చౌక మందులను ఇప్పుడు అందిస్తున్నారు. జన్ ఔషధి యోజన ద్వారా దేశంలోని పేదలు ఇప్పటివరకు రూ.25,000 కోట్లకు పైగా ఆదా చేశారు.
  •  హార్ట్ స్టెంట్ ధరను రూ.1.25 లక్షల (2017) నుంచి రూ.38 వేలకు తగ్గించడంతో పాటు మోకాలి ఇంప్లాంట్ ధరను కూడా భారీగా తగ్గించారు.
  •  2014కు ముందు దేశంలో కేవలం 8 ఎయిమ్స్ లు మాత్రమే ఉంటే నేడు వాటి సంఖ్య 23కు పెరిగింది.
  •  దేశంలోని 5,000 బ్లడ్ బ్యాంకులను నేషనల్ పోర్టల్ లో అనుసంధానం చేయడం ద్వారా బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్యాంక్ లో అందుబాటులో ఉందో పారదర్శకంగా తెలుసుకునేందుకు వీలుగా ఒక గ్రిడ్ ను రూపొందించారు.
  •  ఆయుష్మాన్ భారత్ - పి ఎం జె వై పథకం కింద దేశంలోని 55 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా హామీ లభించింది.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశం దేశంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను (ఎబి- హెచ్ డబ్ల్యూసి) స్థాపించడం, దీనిని ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలుస్తారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రజల ఇళ్లకు సమీపంలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (సిపిహెచ్.సి) అందించే లక్ష్యంతో సార్వత్రిక ఆరోగ్య కవరేజీ కి సంబంధించిన ప్రోత్సాహక, నివారణ, చికిత్స, పలియేటివ్ఉపశమన, పునరావాస అంశాలను మిళితం చేస్తుంది.

డిసెంబర్ 18, 2023 నాటికి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో నివేదించబడిన మొత్తం సంచిత పురోగతి క్రింది విధంగా ఉంది:

*సందర్శకుల సంఖ్య - 227.41 కోట్లు

*వెల్నెస్ సెషన్ - 2.81 కోట్లు

*హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ - 55.72 కోట్లు

*డయాబెటిస్ స్క్రీనింగ్ - 48.49 కోట్లు

*ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ - 32.83 కోట్లు

*రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ - 14.92 కోట్లు

*గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ - 10.05 కోట్లు       

***


(Release ID: 1989025) Visitor Counter : 94