ఆయుష్
azadi ka amrit mahotsav

ఏఐఐఏ గోవా మొదటి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 20 DEC 2023 5:59PM by PIB Hyderabad

ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ ) గోవా  మొదటి స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్, రేవులు,షిప్పింగ్,జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్  స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ , మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి  డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్  ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  రాజేష్ కొటేచా కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద,  ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో  కార్యక్రమం  జరిగింది. కార్యక్రమానికి ఏఐఐఏ   డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజ మనోజ్ నేసరి,ఏఐఐఏ  గోవా డీన్ ప్రొఫెసర్ సుజాత కదమ్, ఇండియన్ పోస్ట్ డీజీ  స్మితా కుమార్,  ఆండ్రూ యూల్ సీఎండీ  శ్రీ ఆర్.ఎస్. మంకు  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. . గోవాలోని శాటిలైట్ సెంటర్‌ను గత సంవత్సరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవా తొలి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు  స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం పట్ల హరీశమ్ వ్యక్తం చేశారు. దీనివల్ల ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందన్నారు. మెరుగైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కోసం జరుగుతున్న కృషికి ఏఐఐఏ సహకారం అందిస్తుందని అన్నారు.  

 శ్రీ ముంజపర మహేంద్రభాయ్ మాట్లాడుతూ ప్రారంభమైన ఏడాది కాలంలో ఏఐఐఏ  గోవా  ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద రంగంలో గుర్తింపు సాధించిందన్నారు. ఆండ్రూ యూల్, కంపెనీ లిమిటెడ్ (AYCL)తో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎంవోయూ కుదుర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టీ అందించే సంపూర్ణ ప్రయోజనాలపై మరింత  అవగాహన  పెంచుకునేందుకు ఒప్పందం వీలు కలిగిస్తుందన్నారు. 

 50 ఎకరాల క్యాంపస్‌లో ఏఐఐఏ  గోవా ఏర్పాటయింది.  ఢిల్లీ ఏఐఐఏ తరహాలో ఏఐఐఏ  గోవా నిర్మాణం జరిగింది.  అధునాతన నివారణ, రోగనిర్ధారణ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏఐఐఏ  గోవాలో అందుబాటులో ఉన్నాయి.  

 జీవవైవిధ్యం , సమృద్ధిగా ఉన్న ఔషధ మొక్కల ప్రాధాన్యత వివరించి , ఆయుర్వేద అభ్యాసానికి గణనీయమైన సహకారం అందించడానికి ఏఐఐఏ  గోవా ద్వారా కృషి జరుగుతోంది.  అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన గోవా లో ఏర్పాటైన ఏఐఐఏ  గోవా  దేశంలో మెడికల్ టూరిజం రంగం అభివృద్ధిలో  కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 ఆయుర్వేద రంగంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఒక ప్రధానమైన సం.  శ్రద్ధ,కరుణ అనే నినాదంతో అధిక-నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సంస్థ కృషి చేస్తోంది. దేశం వివిధ  ప్రాంతాలలో ఆయుర్వేద ఆరోగ్య సంరక్షణ సేవలు  విస్తరించాలనే లక్ష్యంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవాలో ఏర్పాటయింది. 

, దేశం కమ్యూనికేషన్, పోస్టల్ సర్వీస్‌లలో భారత ప్రభుత్వ తపాలా శాఖ అయిన ఇండియా పోస్ట్  పాత్ర పోషిస్తోంది. 

 

***


(Release ID: 1989024) Visitor Counter : 96