భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఇండస్ట్రీ 4.0'పై అవగాహన కార్యక్రమాలు

प्रविष्टि तिथि: 19 DEC 2023 2:48PM by PIB Hyderabad

ఇండస్ట్రీ 4.0 గురించి భారతీయ తయారీ పరిశ్రమల్లో అవగాహన పెంచడానికి సెమినార్లు, శిక్షణ కార్యక్రమాలు, కార్యశాలల నిర్వహణ కోసం, “ఎన్‌హాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ది ఇండియన్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్‌” పథకం కింద, ప్రాజెక్టు అమలు సంస్థలు (పీఐవోలు), పారిశ్రామిక సంఘాలకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈ పథకం కింద, ఇండస్ట్రీ 4.0పై అవగాహన పెంచడానికి 2021-22, 2022-23 సంవత్సరాల్లో వివిధ ప్రాజెక్టు అమలు సంస్థలు, పారిశ్రామిక సంఘాల ద్వారా 195 సెమినార్లు/శిక్షణ కార్యక్రమాలు/కార్యశాలలు నిర్వహించారు. వీటిలో 9,000 మంది నిపుణులు పాల్గొన్నారు.

పుణెకు చెందిన సీ4ఐ4 ల్యాబ్ సాంకేతిక సహకారంతో, 7 అక్టోబర్ 2022న, గుజరాత్‌లోని కేవాడియాలో "ఇండస్ట్రీ 4.0పై జాతీయ సదస్సు"ను మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఐఐఎస్‌సీ, సీఎంటీఐ సాంకేతిక సహకారంతో 03-04 జులై 2023న బెంగుళూరులో “నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రోబోటిక్స్” అంశంపై సమావేశం నిర్వహించారు.

పరిశ్రమలు తమ కార్యకలాపాల్లో ఇండస్ట్రీ 4.0ను స్వీకరించేందుకు ఎస్‌ఎంఈలతో సహా పరిశ్రమ నిపుణులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 “ఎన్‌హాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ది ఇండియన్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్‌” పథకంలోని "కామన్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ సెంటర్స్" కింద, సమర్థ్‌ కేంద్రాలు, ఇతర ప్రాజెక్టు అమలు సంస్థలు తయారీ రంగంలో ఇండస్ట్రీ 4.0ను చేర్చడానికి ఎస్‌ఎంఈలు, ఎంఎస్‌ఎంఈలు, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాయి.

భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

***


(रिलीज़ आईडी: 1988231) आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil