సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నషా ముక్త్ భారత్ అభియాన్

Posted On: 19 DEC 2023 3:06PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత విభాగం, 23 నవంబర్ 2023న, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్‌తో (ఇస్కాన్) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళలు, విద్యార్థులు మొదలైన వారిలో నషా ముక్త్ భారత్ అభియాన్‌ (ఎన్‌ఎంబీఏ) సందేశాన్ని వ్యాప్తి చేయడం ఈ ఒప్పందం ఉద్దేశం. ఎంవోయూ ప్రధాన లక్ష్యాలు ఇవి:

  1. క్షేత్ర స్థాయి కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో అవగాహన కల్పించడం
  2. ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలను మత్తు రహితంగా మార్చడంపై దృష్టి పెట్టడం
  3. మత్తుపై ఆధారపడిన జనాభాను గుర్తించడం
  4. కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలు పెంచడం
  5. యువత & బాలల మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం

"నషా ముక్త్ భారత్ అభియాన్" కింద, దేశంలోని పాఠశాల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ 'నవచేతన' మాడ్యూళ్లను రూపొందించింది. ఈ 9 మాడ్యూళ్లు ఉపాధ్యాయ శిక్షణ మాడ్యూళ్లు (6-11 తరగతి విద్యార్థులకు 8 మాడ్యూళ్లు, తల్లిదండ్రుల కోసం 1). వీటి ద్వారా, పాఠశాల విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడానికి ఉపాధ్యాయులు ప్రచారం చేస్తారు.

మొదటి దశలో, గుర్తించిన 300 జిల్లాల్లో, 30 మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్న 100 పాఠశాలలను పరిగణిస్తారు. సంబంధిత రాష్ట్రంలోని విద్యా శాఖ & ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ప్రతి జిల్లా నుంచి ఐదుగురు (05) గురువులకు శిక్షణ ఇస్తారు. వాళ్లు, ఆ మాడ్యూళ్లపై మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.

నవచేతన పరిధిని, ప్రభావాన్ని మరింత బలోపేతం చేసేలా శిక్షణ సామగ్రిని 12 ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువదిస్తున్నారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ కింద, పాఠశాలల్లో విద్యార్థులలో జీవన నైపుణ్యాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడానికి నవచేతన శిక్షణను ఉపాధ్యాయులు ప్రచారం చేసి, అమలు చేస్తున్నారు.

నవచేతన మాడ్యూళ్ల ముఖ్యాంశాలు:

  1. పాఠశాల విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడకుండా నివారించడం
  2. మత్తు పదార్థాలకు ఇప్పటికే అలవాటు పడిన పిల్లలకు తదుపరి పరిశీలన, కౌన్సెలింగ్, చికిత్స కోసం మద్దతు
  3. చిన్న పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభ సంకేతాలపై కుటుంబాలు/ఉపాధ్యాయుల్లో అవగాహన పెంచడం, అందుబాటులో ఉన్న సహాయాలపై సమాచారం ఇవ్వడం

నవచేతన మాడ్యూళ్ల కింద చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము, శ్రీనగర్, పంజాబ్, దిల్లీ, హరియాణా రాష్ట్రాలు/యూటీల్లో ఇప్పటి వరకు 309 మంది గురువులకు తొలి దశ శిక్షణ అందించడం జరిగింది. వచ్చే సంవత్సరం, గుర్తించిన 300 జిల్లాల్లోని గుర్తించిన పాఠశాలల్లో నవచేతన మాడ్యూళ్లను అమలు చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ.నారాయణస్వామి ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

 

***


(Release ID: 1988212) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Marathi , Hindi