రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోల్, ఆపరేట్, బదిలీ (టిఓటి) బండిల్స్ 13 మరియు 14 ద్వారా ఎన్‌హెచ్‌ఏఐకు రూ. 9,384 కోట్లు

Posted On: 18 DEC 2023 3:50PM by PIB Hyderabad

టోల్, ఆపరేట్ మరియు ట్రాన్స్‌ఫర్ (టిఓటి) బండిల్స్ 13 మరియు 14   కలిపి 273 కి.మీ పొడవుకు గాను ఎన్‌హెచ్‌ఏఐకు రూ. 9,384 కోట్ల రాబడి. నవంబర్ 14, 2023న ఫైనాన్షియల్ బిడ్‌లు తెరవబడ్డాయి. సంబంధిత అధికారుల ఆమోదంతో విజయవంతమైన బిడ్డర్‌లకు ఒక రోజులోపు లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేయబడింది.

టిఓటి బండిల్ 13లో రాజస్థాన్‌లోని ఎన్‌హెచ్‌-76లో పరిధిలో గల కోట బైపాస్ మరియు స్టే బ్రిడ్జ్ ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్‌హెచ్‌-75లోని గ్వాలియర్-ఝాన్సీ విభాగం ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు రూ. 1,683 కోట్లు.

ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్‌హెచ్‌-9లోని ఢిల్లీ-హాపూర్ సెక్షన్‌తో సహా ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, ఒడిశా రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌-6లోని బింజబహల్ నుండి టెలిబానీ సెక్షన్‌ను కలిగి ఉన్న టిఓటి బండిల్ 14కు క్యూబ్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ. 7,701 కోట్లకు దక్కించుకుంది.

టిఓటి బండిల్‌ల రాయితీ వ్యవధి 20 సంవత్సరాలు. ఇందులో స్ట్రెచ్‌ను నిర్వహించడానికి మరియు ఆపరేట్ చేయడానికి రాయితీదారులు అవసరం. దీనికి బదులుగా కన్సెషనర్ ఈ స్ట్రెచ్‌ల కోసం ఎన్‌హెచ్‌ రుసుము నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము రేట్లకు అనుగుణంగా వినియోగదారు రుసుమును వసూలు చేస్తుంది.

అంతకుముందు అక్టోబర్ 2023లో ఎన్‌హెచ్‌ఏఐ బండిల్స్ 11 మరియు 12 కలిపి 400 కి.మీ పొడవు గల రహదారికి రూ. 6,584 కోట్లు లభించాయి. రెండు బండిల్స్‌ (11 & 12) ఉత్తర ప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌19పై అలహాబాద్ బైపాస్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్‌పూర్ - సాగర్ -లఖ్‌నాడన్ సెక్షన్‌లను వరుసగా మరియు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో అందించబడిన నాలుగు టిఓటి  బండిల్‌ల ఉమ్మడి విలువ దాదాపు రూ. 15,968 కోట్లు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మానిటైజేషన్ లక్ష్యం రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ.

హైవే రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి టిఓటి మోడల్ అభివృద్ధి చేయబడింది.ఎన్‌హెచ్‌ఏఐ కాలానుగుణంగా వివిధ జాతీయ రహదారుల టోల్ నిర్వహణ కోసం టోల్, బదిలీ ప్రాతిపదికన కాంట్రాక్టులను అందజేస్తుంది. రోడ్డు నెట్‌వర్క్ విలువను అన్‌లాక్ చేయడంలో టిఓటి కీలకపాత్ర పోషించింది. దేశంలో ప్రపంచ స్థాయి జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికి దోహదపడింది.


 

***


(Release ID: 1988076) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Hindi , Punjabi