ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భవ తాజా సమాచారం
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆరోగ్య శిబిరాలకు హాజరైన 12.6 లక్షలకు పైగా ప్రజలు
17 కోట్ల మందికి పైగా ప్రజలకు క్షయ, రక్తపోటు,మధుమేహం, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, క్యాటరాక్ట్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ
ఆరోగ్య శిబిరాల ద్వారా 3.70 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ
4.38 కోట్లకు పైగా అభా (హెల్త్ ఐడి ) కార్డులు పంపిణీ
Posted On:
17 DEC 2023 3:47PM by PIB Hyderabad
దేశంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమాన్ని ,ఆయుష్మాన్ భవ పోర్టల్‌ను భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబర్ 13న గుజరాత్‌లోని గాంధీనగర్లో ప్రారంభించారు. ఆయుష్మాన్ కార్డ్‌లను మరింత అందుబాటులోకి తీసుకుని రావడానికి, ఆభా కార్డులు అందించడానికి, ముఖ్యమైన ఆరోగ్య పథకాలు,వ్యాధి పరిస్థితుల గురించి అవగాహన పెంచడానికి, సంక్రమించే లక్షణం లేని వ్యాధులు, క్షయ, జన్యు సంబంధ వ్యాధులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి 2023 సెప్టెంబర్ 17 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, పథకాల ప్రయోజనాలు ప్రజలు పొందేలా చూడడానికి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా ప్రజలకు చేరేలా చూసేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడుతున్నాయి.
2023 డిసెంబర్ 16 వ తేదీన ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలు రాయిని సాధించింది. 2023 సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య శిబిరాల ద్వారా లబ్ది పొందిన వారి సంఖ్య 2023 డిసెంబర్ 16న 10 కోట్లకు చేరింది. ప్రారంభించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా 12.6 లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలు జరిగాయి.
2023 డిసెంబర్ 10 నుంచి 2023 డిసెంబర్ 16వ తేదీ వరకు ఒక వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా 47,522 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆరోగ్య మేళాలు జరిగాయి. 2023 సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 12,29,792 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ మేళాలు ఏర్పాటు అయ్యాయి. ఆరోగ్య మేళాలకు ఇంతవరకు మొత్తం 8,86,17,970 మంది ప్రజలు హాజరయ్యారు. 2023 డిసెంబర్ 10 నుంచి 2023 డిసెంబర్ 16వ తేదీ వరకు నిర్వహించిన ఆరోగ్య శిబిరాల ద్వారా 42,41,864 ప్రయోజనం పొందారు.
2023 సెప్టెంబర్ 17 నుంచి ఇంతవరకు 17 కోట్ల (17,26,66,845) మంది వ్యక్తులు క్షయ, జన్యు సంబంధ వ్యాధులు, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ , క్యాటరాక్ట్ వంటి ఏడు రకాల వ్యాధుల పరీక్షలు జరిగాయి. 2023 డిసెంబర్ 16 తో ముగిసిన వారంలో 86,19,636 మంది ఈ ఏడు వ్యాధుల ఉచిత స్క్రీనింగ్‌ను పొందారు.
సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్‌సి) కింద ఇప్పటివరకు 34,107 ఆరోగ్య శిబారాలు జరిగాయి. మొత్తం 1,37,84,954 మంది నమోదు చేసుకున్నారు.
ఆరోగ్య మేళాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 3,70,36,445 ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. 2023 డిసెంబర్ 16 తో ముగిసిన వారంలో 4,78,168 కార్డులు జారీ అయ్యాయి. జారీ అయిన మొత్తం అభ (హెల్త్ఐడి) కార్డుల సంఖ్య 4,38,93,025కి చేరింది. 2023 సెప్టెంబర్ 17 నుంచి ఇంతవరకు మొత్తం 1,10,298 ఆయుష్మాన్ సభలు జరిగాయి.
నేపథ్యం
దేశంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందిస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చేలా చూడాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామం/పట్టణంలో అన్ని ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి 'ఆయుష్మాన్ భవ'కార్యక్రమం అమలు జరుగుతోంది. 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమంలో భాగంగా 'ఆయుష్మాన్ - ఆప్కే ద్వార్ 3.0', 'ఆయుష్మాన్ సభలు', ' హెల్త్ అండ్ వెల్‌నెస్ స్థాయిలో ఆయుష్మాన్ మేళాలు', సిహెచ్‌సిల పరిధిలో వైద్య కళాశాలలు ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. అంతిమంగా గ్రామ/నగర స్థాయిలో . పంచాయతీ లేదా అర్బన్ వార్డు 'ఆయుష్మాన్ పంచాయతీ' లేదా 'ఆయుష్మాన్ అర్బన్ వార్డు' హోదా సాధించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతోంది.
***
(Release ID: 1987644)
Visitor Counter : 111