మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కాశీ తమిళ సంగమం 2023 ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన తమిళనాడు నుంచి వచ్చిన మొదటి బృందం
పవిత్ర నది 'గంగ' పేరుతో వచ్చిన బృందం సభ్యులుగా విద్యార్థులు
Posted On:
17 DEC 2023 1:05PM by PIB Hyderabad
కాశీ తమిళ సంగమం రెండవ దశను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వారణాసిలోని నమో ఘాట్‌లో ప్రారంభించనున్నారు. పవిత్ర నది 'గంగా' పేరుతో తమిళనాడు లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల బృందం ఈ రోజు పవిత్ర నగరం కాశీ (వారణాసి)కి చేరుకుంది. 15 రోజుల పాటు జరిగే కాశీ తమిళ సంగమం రెండో దశలో బృందం సభ్యులు పాల్గొంటారు.తమిళనాడు నుంచి వచ్చిన మొదటి బృందం సభ్యులు శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్నిసందర్శించారు. వారణాసి కంటోన్మెంట్ స్టేషన్ లో బృందం సభ్యులకు ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా బృందం సభ్యులు వారు ప్రయాగ్‌రాజ్,అయోధ్యలను కూడా సందర్శిస్తారు.
కాశీ తమిళ సంగమం 2023 లో పాల్గొనడానికి తమిళనాడు నుంచి మరో ఆరు బృందాలు కాశీకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు (యమునా), నిపుణులు (గోదావరి), ఆధ్యాత్మిక (సరస్వతి), రైతులు మరియు కళాకారులు (నర్మద), రచయితలు (సింధు) , వ్యాపారులు,వ్యాపారవేత్తలు (కావేరి)తో కూడిన మరో ఆరు బృందాలు సంగమం లో పాల్గొంటాయి.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, రైల్వే, జౌళి,ఆహారశుద్ధి, ఎంఎస్ఎంఈ, సమాచార ప్రసార, నైపుణ్యాభివృద్ధి, ఐఆర్సిటసి సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
ప్రాచీన భారతదేశంలో రెండు ముఖ్యమైన అభ్యాస, సంస్కృతి కేంద్రాలుగా గుర్తింపు పొందిన కాశీ, తమిళనాడు మధ్య బంధాలు పునరుద్ధరించడం, రెండు ప్రాంతాల ప్రజలను అనుసంధాన చేయడం లక్ష్యంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య భాగస్వామ్య వారసత్వం, సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా ఈ రెండు విజ్ఞానం, సంస్కృతి సంప్రదాయాలను దగ్గరగా తీసుకురావడం కార్యక్రమం లక్ష్యం. రెండు సంస్కృతుల మధ్య పురాతన మేధో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, శిల్పకళా సంబంధాలను గుర్తించి బలోపేతం చేయడం కూడా లక్ష్యంగా కార్యక్రమం జరుగుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తమిళనాడు, వారణాసికి చెందిన వివిధ సాంస్కృతిక బృందాలు కాశీలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తాయి.
తమిళనాడు, కాశీకి చెందిన కళలు, సంస్కృతి, చేనేత, హస్తకళలు, వంటకాలు, ఇతర ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శించే స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కాశీలోని నమో ఘాట్‌లో తమిళనాడు, కాశీ సంస్కృతులను మేళవించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సాహిత్యం, ప్రాచీన గ్రంథాలు, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, సంగీతం, నృత్యం, నాటకం, యోగా, ఆయుర్వేదం, చేనేత, హస్తకళలు వంటి విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై సదస్సులు , చర్చలు, ఉపన్యాసాలు, ఆవిష్కరణలు, వ్యాపార మార్పిడి, ఎడ్ టెక్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిపుణులు, పండితులు, తమిళనాడు, కాశీ ప్రాంతాలకు చెందిన వివిధ విభాగాలు/వృత్తుల స్థానిక అభ్యాసకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, కార్యక్రమం వల్ల వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులు, ప్రముఖుల మధ్య జరిగే చర్చల వల్ల ఆచరణాత్మక జ్ఞానం/ నూతన అంశాలను గుర్తించడానికి వీలవుతుంది.
తమిళనాడు నుంచి వచ్చిన ప్రతినిధులతో పాటు, కాశీకి చెందిన స్థానిక నివాసితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
***
(Release ID: 1987437)
Visitor Counter : 72