రక్షణ మంత్రిత్వ శాఖ
అరేబియా సముద్రంలో హైజాకింగ్ ఘటనకు స్పందించిన భారతీయ నావికాదళం మిషన్ డిప్లాయ్డ్ ప్లాట్‌ఫాంలు (మిషన్ కోసం మోహరించిన వేదికలు)
Posted On:
16 DEC 2023 11:15AM by PIB Hyderabad
అరేబియా సముద్రంలో మాల్టాకు చెందిన ఓడ ఎంవి రూవెన్ హైజాకింగ్ ఘటనలో అక్కడ మోహరించిన భారతీయ నావికాదళ మిషన్ తక్షణం స్పందించింది. 18మంది సిబ్బందితో కూడిన ఓడ యుకెఎంటిఒ పోర్టల్‌పై 14 డిసెంబర్ 23న దాదాపు ఆరుగురు గుర్తుతెలియని సిబ్బంది ఓడ ఎక్కినట్టు మేడే (అత్యవసర) సందేశాన్ని పంపింది.
ఆ పరిణామాలకు వేగంగా ప్రతిస్పందిస్తూ, వెంటనే ఎంవి రూవెన్‌ను గుర్తించి, తోడ్పడేందుకు ఆ ప్రాంతంలో పర్యవేక్షణ చేపడుతున్న భారతీయ నావికాదళ పహారా విమానాన్ని, గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో తన సముద్ర దోపిడీ వ్యతిరేక పహారా ఓడను పంపింది.
గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో సముద్ర దోపిడీ వ్యతిరేక పహారాకు మోహరించిన భారతీయ నావికా దళ యుద్ధనౌక, 16 డిసెంబర్ 23 తెల్లవారుజామున ఎంవి రూవెన్‌ను అడ్డకుంది.
మొత్తం పరిస్థితిని ఆ ప్రాంతంలోని ఇతర ఏజెన్సీలు/ ఎంఎన్ఎఫ్ సమన్వయంతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రాంతంలో అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక విదేశీ దేశాలతో వాణిజ్య షిప్పింగ్ భద్రతను నిర్ధారించడానికి తొలి ప్రతిస్పందనదారుగా ఉండేందుకు భారత నావికాదళం కట్టుబడి ఉంది.
***
(Release ID: 1987379)
Visitor Counter : 103