వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

'వివిధ రాష్ట్రాల్లో రవాణా సౌలభ్యం (లీడ్స్) 2023”నివేదికను విడుదల చేసిన శ్రీ పీయూష్ గోయల్


విస్తృత పరిధి, ప్రాముఖ్యత కలిగి ఉన్న రవాణా రంగం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది... శ్రీ పీయూష్ గోయల్

లీడ్స్ నివేదిక ఆధారంగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా రంగంతో సంబంధం ఉన్నవారు ఉత్తమ విధానాలు అమలు చేసి మెరుగైన భవిష్యత్తు సాధించడానికి ఉపయోగపడుతుంది... శ్రీ :గోయల్

10 రెట్లు వృద్ధి సాధించి 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో రవాణా రంగం పాత్ర కీలకంగా ఉంటుంది...శ్రీ గోయల్

Posted On: 16 DEC 2023 4:12PM by PIB Hyderabad

'వివిధ రాష్ట్రాల్లో రవాణా సౌలభ్యం (లీడ్స్) 2023”  నివేదికను న్యూఢిల్లీలో 2023 డిసెంబర్ 16న  కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి, శ్రీ పీయూష్ గోయల్ విడుదల చేశారు. 

కార్యక్రమంలో డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి  సుమితా దావ్రా, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షునిగా నియమితులైన శ్రీ  సజీవ్ పూరి, ఎర్నెస్ట్  యంగ్.భాగస్వామి శ్రీ  మిహిర్ షా తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగామాట్లాడిన శ్రీ గోయల్ రవాణా రంగంలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలు చేయడానికి అవసరమైన సమాచారాన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లీడ్స్ అందిస్తుందని అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు రవాణా రంగంలో అమలు జరిగే సంస్కరణలు తోడ్పడతాయని మంత్రి పేర్కొన్నారు.  వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని అందించి రవాణా రంగంతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరికీ నివేదిక మార్గదర్శకంగా ఉంటుందని  ఆయన తెలిపారు. రవాణా రంగం  పనితీరును మెరుగుపరచడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెంపొందించడంలో నివేదిక  కీలక పాత్ర పోషిస్తుందన్న ఆశాభావాన్ని  ఆయన వ్యక్తం చేశారు.మౌలిక సదుపాయాల కల్పన కోడం పీఎం   గతిశక్తి కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు,రవాణా రంగానికి  'పరిశ్రమ' హోదా కల్పించడం, బహుళ విధాన రవాణా వ్యవస్థ అభివృద్ధి,  డిజిటల్ కార్యక్రమాలు,నగర రవాణా ప్రణాళికలు,  మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు మొదలైన ముఖ్యమైన కార్యక్రమాల వివరాలు  కూడా నివేదికలో లభిస్తాయన్నారు.  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. సామర్ధ్య నిర్మాణం, రవాణా రంగం విధానాల రూపకల్పన, పర్యవేక్షణ వ్యవస్థ  మానిటరింగ్ అమలు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.10 రెట్లు వృద్ధి సాధించి 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను  3.5 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 35 ట్రిలియన్‌ డాలర్ల  ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో రవాణా రంగం పాత్ర కీలకంగా ఉంటుందని శ్రీ  గోయల్ పేర్కొన్నారు. 

 డిజిటలైజేషన్‌ అమలు చేయడం  వల్ల రవాణా  ఖర్చు గణనీయంగా తగ్గుతుందని డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు.. గత తొమ్మిదేళ్ల కాలంలో రవాణా రంగం వంటి ముఖ్యమైన రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన చర్యల వల్ల రవాణా రంగం అభివృద్ధి సాధించిందన్నారు. సులభతర వ్యాపార నిర్వహణ కోసం అమలు చేసిన  సంస్కరణలు, సమ్మతి భారం తగ్గింపు, నియంత్రణ వ్యయాన్ని తగ్గించడానికి అమలు జరుగుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.

కేంద్ర, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు , పరిశ్రమ  ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు.

 ప్రపంచ బ్యాంకు రూపొందిస్తున్న లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ తరహాలో 2016 నుంచి లీడ్స్ నివేదిక రూపొందుతోంది.  మరియు కాలక్రమేణా అభివృద్ధి చెందింది.గా అవగాహన-ఆధారిత సర్వేలపై ఆధారపడి  లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రూపొందుతుంది. అవగాహన, నిష్పాక్షికత ఆధారంగా సిద్దమవుతున్న లీడ్స్ నివేదిక సమగ్రంగా విశ్వసనీయంగా ఉంటుంది. 

2023 సంవత్సరానికి సంబంధించి రూపొందిన  లీడ్స్ వార్షిక  నివేదికలో  రాష్ట్రాలు/ కేంద్రపాలిత  స్థాయిలో రవాణా రంగం సాధించిన అభివృద్ధిని పొందుపరిచారు, సంస్కరణలు అమలు చేయడం వల్ల  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత వర్గాలపై చూపించిన సానుకూల ప్రభావాన్ని నివేదికలో వివరించారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సేవలు, నిర్వహణ, నియంత్రణ విధానం వంటి కీలక అంశాల్లో  పనితీరులో రాష్ట్రాలు కనబరిచిన  సానుకూల మార్పులను నివేదికలో పొందుపరిచారు. నివేదిక ఆధారంగా  నిర్ణయం తీసుకోవడం, సమగ్ర వృద్ధి కోసం ప్రాంతాల వారీగా నివేదిక సమాచారం అందిస్తుంది.

జాతీయ స్థాయిలో 2023 మే -జూలై నెలల మధ్య  36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో సేకరించిన 7,300కి పైగా ప్రతిస్పందనల ఆధారంగా నివేదిక రూపొందింది

 

లీడ్స్ 2023 నివేదిక ముఖ్యాంశాలు:

తీరప్రాంతాలు: 

* లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు

*వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలు : కేరళ, మహారాష్ట్ర

* ఆశావహ రాష్ట్రాలు : గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్

తీరప్రాంతాలు లేని రాష్ట్రాలు 

* లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్

*వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలు  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్

* ఆశావహ రాష్ట్రాలు  : బీహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్

ఈశాన్య ప్రాంతం: 

* లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు  అస్సాం, సిక్కిం, త్రిపుర

*వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలు  : అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్

* ఆశావహ రాష్ట్రాలు   మణిపూర్, మేఘాలయ, మిజోరాం

కేంద్రపాలిత ప్రాంతాలు

* లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు   చండీగఢ్, ఢిల్లీ

*వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలు  : అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి

* ఆశావహ రాష్ట్రాలు   డామన్  డయ్యూ/ దాద్రా & నగర్ హవేలీ, జమ్మూకాశ్మీర్, లడఖ్

ఈరోజు ప్రారంభించిన లీడ్స్ నివేదిక  5వ ఎడిషన్ ను సహకార ,సంప్రదింపుల పద్ధతిలో రూపొందించామని   డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి  సుమితా దావ్రా తెలిపారు. అభివృద్ధి, ప్రక్రియ సంబంధిత సంస్కరణల ప్రభావాన్ని  అంచనా వేశామన్నారు. జాతీయ రవాణా విధానానికి అనుగుణంగా  23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  తమ రాష్ట్ర రాష్ట్ర  విధానాలను ప్రకటించాయి. రవాణా రంగానికి  16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  పరిశ్రమ హోదా కల్పించాయి. పీఎం  గతిశక్తి, లాజిస్టిక్స్ డేటా బ్యాంక్, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫాం (ULIP), జీఎస్టీ  వంటి డిజిటల్ సంస్కరణలు ప్రపంచ స్థాయిలో భారతదేశం  ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తున్నాయి. 

కార్యక్రమంలో భాగంగా  (i) లాజిస్టిక్స్‌ను సులభతరం చేయడానికి డేటా మరియు సాంకేతికతలు ఉపయోగించుకోవడం; (ii) స్థిరమైన హరిత రవాణా వ్యవస్థపై చర్చలు జరిగాయి. 

 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  వాణిజ్య పోటీతత్వాన్ని అలవరచుకోవడానికి  సమర్థవంతమైన దేశీయ రవాణా వ్యవస్థ అవసరం ఉంటుంది.  అవగాహన-ఆధారిత సమాచారం ఆధారంగా  ఏకీకరణ రవాణా వ్యవస్థ రూపకల్పన, మూల్యాంకనం చేయడానికి ఒక సంపూర్ణ వ్యవస్థను లీడ్స్ నివేదిక అందిస్తుంది. పీఎం  గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను స్వీకరించడం, రాష్ట్ర స్థాయి రవాణా విధానాలను జాతీయ రవాణా విధానంతో సమలేఖనం చేయడం, నగర స్థాయి రవాణా ప్రణాళిక  అభివృద్ధి చేయడం మొదలైన వాటితో సహా రాష్ట్ర కార్యక్రమాల ఆధారంగా లీడ్స్ నివేదిక సిద్దమయ్యింది. 

లీడ్స్ 2023 నివేదిక  వివరాల కోసం 

For more detailes on LEADS 2023 report, చూడండి. 

 

***



(Release ID: 1987377) Visitor Counter : 129