ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్, అలాగే ఎన్.ఎల్.సి.పి.ఆర్ కింద ఈశాన్య రాష్ట్రాలకు ప్రాజెక్టులు.

प्रविष्टि तिथि: 14 DEC 2023 4:09PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక మౌలికసదుపాయాల అభివ్రుద్ధి పథకం (ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్) పథకం కింద గత మూడు సంవత్సరాలలో అంటే 2020-21,నుంచి 20222-23 సంవత్సరాల మధ్య,  మొత్తం 32 ప్రాజెక్టులకు 839.59 కోట్ల రూపాయలు అస్సాంకు మంజూరయ్యాయి.

ఎన్.ఎల్.సి.పి.ఆర్ పథకం కింద మొత్తం 1635 ప్రాజెక్టుల కింద రూ 16233.78 కోట్ల రూపాయలు మంజూరు కాగా, మరోవైపు 1307 ప్రాజెక్టులు రూ 11124.32 కోట్ల రూపాయల విలువగలవి పూర్తి అయ్యాయి. 5005. 55 కోట్ల రూపాయల విలువగల 327 ప్రాజెక్టులు వివిధ దశలలో  ఉన్నాయి.

ఎన్.ఇ.ఎస్.ఐ.డి పథకం కింద, ఆ పథకం ప్రారంభం నుంచి రూ 6,180.23 కోట్ల రూపాయల వ్యయం కాగల మొత్తం 181 ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ మంజూరు చేయడం జరిగింది. ఇందులో 956.77 కోట్ల రూపాయల విలువగల 25 ప్రాజెక్టులు  పూర్తి కాగా, మిగిలిన ప్రాజెక్టులు వివిధ దశలో అమలులో ఉన్నాయి.

ఈ పథకానికి మొదటి  నుంచి మొత్తం రూ 4134.07 కోట్ల రూపాయలు కేటాయించగా, అందులో రూ 1564 కోట్ల రూపాయలు వినియోగించడం జరిగింది. 

 ఈ సమాచారాన్ని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ , రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 1987305) आगंतुक पटल : 89
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali-TR , Assamese