గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
నిన్న న్యూఢిల్లీ లో జరిగిన దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ భాగస్వాముల సమావేశంలో పాల్గొన్న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చరణ్‌జిత్ సింగ్
ఆహారం, పౌష్ఠిక ఆహారం, ఆరోగ్యం,సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యాలను సాధించడంలో దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పాత్ర కీలకంగా ఉంటుంది... శ్రీ చరణ్‌జిత్ సింగ్
“సంగతన్, స్వాస్త్య, సమృద్ధి” ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూ లోగోను ఆవిష్కరించిన శ్రీ సింగ్
Posted On:
15 DEC 2023 1:04PM by PIB Hyderabad
నిన్న న్యూఢిల్లీ లో జరిగిన దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ భాగస్వాముల సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చరణ్‌జిత్ సింగ్ పాల్గొన్నారు. ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం,సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యాలను సాధించడంలో దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పాత్ర కీలకంగా ఉంటుందని శ్రీ చరణ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు.
ప్రజల జీవనోపాధి,గ్రామీణ కుటుంబాల ఆరోగ్యం మరియు పోషకాహార స్థితిపై ప్రభావం చూపిస్తున్న వివిధ అంశాలను గుర్తించాల్సి ఉంటుందన్నారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ “సంగతన్, స్వాస్త్య, సమృద్ధి” ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూ లోగోను ఆయన ఆవిష్కరించారు.
దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూ ల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంటుందని జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ జీవనోపాధి విభాగం సంయుక్త కార్యదర్శి , శ్రీమతి స్మృతి శరణ్ అన్నారు. మహిళల నేతృత్వంలో, మహిళల యాజమాన్యంలో నడుస్తున్న సంస్థలు ఈ అంశంలో కీలకంగా ఉంటాయన్నారు. సంపూర్ణ ప్రభుత్వ విధానంలో అర్హులందరికీ తక్కువ ఖర్చుతో లబ్ది కలిగే విధంగా కార్యక్రమాలు అమలు జరగడానికి భాగస్వాములు ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఒకటి . గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం,సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యాలు సాధించడానికి వివిధ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించడానికి భాగస్వాముల సమావేశాన్ని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
ఎఫ్‌ఎన్‌హెచ్‌డబ్ల్యూపై గ్రామీణ ప్రజల్లో అవగాహనను పెంపొందించడం, ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సేవలు అందించడానికి దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు చేస్తున్న కృషి, సాధించిన విజయాలు పంచుకోవడం లక్ష్యంగా సమావేశం ఏర్పాటయింది. లక్ష్య సాధన కోసం అనుసరించాల్సిన కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడానికి నిర్వహిస్తున్న సంప్రదింపుల శ్రేణిలో సమావేశం మొదటిది, అమలు జరుగుతున్న విధానాలను కొనసాగించి, భాగస్వాముల మధ్య సమన్వయం సాధించి మరింత పటిష్టంగా దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
చహత్తీస్‌గఢ్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్, స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీమతి పద్మినీ సాహు తమ రాష్ట్రంలో ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం,సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యాలు సాధించడానికి అమలు చేస్తున్న ప్రణాళికను వివరించారు.వివిధ వర్గాల సహకారంతో లక్ష్యాల మేరకు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మిషన్ అమలులో పాల్గొంటున్న BMGF, PCI ఇండియా, UNICEF DAY సంస్థల ప్రతినిధులు లక్ష్య సాధన దిశగా అమలు జరుగుతున్న చర్యలను వివరించారు. ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద అమలు జరుగుతున్న కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.
దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అమలులో సమూల మార్పులు అమలు చేసి మరింత సమర్థంగా లక్ష్యాలు సాధించడానికి ఈ సమావేశం కీలకంగా ఉంటుంది. . వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడం, ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం,సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యాల సాధన కోసం చర్యలు అమలు చేయడం, గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ను అమలు చేస్తోంది.
***
(Release ID: 1986750)
Visitor Counter : 88