ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అలకనంద, రోహిణి సెక్టార్ -16, వసంత్ విహార్‌లో మూడు సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్లతో పాటు ఎన్‌ఐటీఆర్‌డిలోని రోబోటిక్ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు
341 సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్లు దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నాయి. కొత్తగా మరో మూడు సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్లు మరియు శస్త్రచికిత్స కోసం రోబోటిక్ యూనిట్‌తో లబ్దిదారుల ఆరోగ్య సంరక్షణ గణనీయంగా మెరుగుపడుతుంది: డాక్టర్ మాండవ్య
“సీజీహెచ్‌ఎస్ కింద కవర్ చేయబడిన నగరాల సంఖ్య 2014లో 25 ఉండగా 2023లో వాటి సంఖ్య 80కి పెరిగింది; వాటిని 100 నగరాలకు విస్తరిస్తాం"
Posted On:
15 DEC 2023 1:07PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అలకనంద, రోహిణి సెక్టార్ -16, వసంత్ విహార్‌లో మూడు సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్లతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీబీ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ ( ఎన్‌ఐటీ&ఆర్‌డి)లోని రోబోటిక్ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 341 సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్లు దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నాయి. కొత్తగా మరో మూడు సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్లు మరియు శస్త్రచికిత్స కోసం రోబోటిక్ యూనిట్‌తో లబ్దిదారుల ఆరోగ్య సంరక్షణ గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సంబంధాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ మీనాక్షి లేఖి, ఎంపీ శ్రీ రమేష్ బిధూరి పాల్గొన్నారు.
"సీజీహెచ్‌ఎస్ పరిధిలోకి వచ్చే నగరాల సంఖ్య 2014లో 25 ఉండగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా వాటి సంఖ్య 80కి పెరిగింది. ఈ కేంద్రాలు త్వరలో భారతదేశంలోని 100 నగరాలకు చేరుకుంటాయి" అని డాక్టర్ మాండవ్య పేర్కొన్నారు.
“మీ ఆరోగ్యం, మా లక్ష్యం” అనే సీజీహెచ్‌ఎస్ లక్ష్యాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పునరుద్ఘాటిస్తూ “సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులకు వారి నివాసానికి దగ్గరగా ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం మా లక్ష్యం" అని తెలిపారు. ఇది దేశంలోని అన్నిభాగాలకు చేరువయిందని చెప్పారు. "శస్త్రచికిత్స అవసరమయ్యే క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు సరైన ఆరోగ్య సౌకర్యాలను నిర్ధారించడంతో పాటు రోబోటిక్ సర్జరీ వారికి సరైన సంరక్షణను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని డాక్టర్ మాండవ్య కూడా పేర్కొన్నారు. "దేశంలోని అన్నిప్రాంతాలకు అందుబాటులో ఉన్న మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడం మా లక్ష్యం మరియు ఆరోగ్యకరమైన దేశానికి పునాది" అని కేంద్రమంత్రి అన్నారు.
ఆరోగ్యకరమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు సంపన్నమైన దేశాన్ని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి “సరసమైన ధరలకు సమగ్ర నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించే ప్రయత్నాల్లో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్యాకేజీని సవరించిన బహుళ-స్థాయి విధానాన్ని అనుసరించింది" అని తెలిపారు. ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రులలో సీజీహెచ్‌ఎస్ ప్యాకేజీల రేట్లు, లబ్ధిదారులు వారి లావాదేవీలలో మరియు ఆసుపత్రులకు ప్రయోజనం చేకూర్చే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగానే నేషనల్ హెల్త్ అథారిటీ ప్లాట్‌ఫారమ్ ఈ ప్రయోజనం కోసం అమలు చేయబడిందని, ఈ సదుపాయం లబ్ధిదారులకు ప్రాధాన్యత చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు వనరులను సమకూర్చే ప్రక్రియలను సులభతరం చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. డా. మాండవీయ ఇంకా మాట్లాడుతూ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధిదారులకు అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ సులభతరం చేయబడిందని వివరించారు.
ప్రపంచంలో సూచించిన 10 ఔషధాలలో 4 భారతదేశంలో తయారు చేయబడిన జెనరిక్ ఔషధాలే అని హైలైట్ చేస్తూ డాక్టర్. మాండవీయ "జన్ ఔషధి మందులు కూడా సీజీహెచ్‌ఎస్ వెల్నెస్ సెంటర్లలో అందించబడతాయి. కేవలం సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ అందించబడతాయి." అని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు మౌలిక సదుపాయాల పరివర్తనను తెలియజేస్తూ "భారతదేశంలో 1.6 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు స్థాపించబడ్డాయి. ప్రతి 10,000 మందికి ఒకటి ప్రజలకు సంపూర్ణ చికిత్సను అందిస్తున్నాయి" అని డాక్టర్ మాండవియ ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనస్వి కుమార్, కేంద్ర ప్రభుత్వ హెల్త్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ జైన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1986748)
Visitor Counter : 79