గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వీధి వ్యాపారుల రక్షణ
Posted On:
14 DEC 2023 3:56PM by PIB Hyderabad
పట్టణ వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్) హక్కులను పరిరక్షించడానికి మరియు వీధి వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడానికి, ప్రభుత్వం వీధి వ్యాపారుల (జీవనోపాధి మరియు వీధి విక్రయాల నియంత్రణ) చట్టం, 2014ను రూపొందించింది. సంబంధిత నిబంధనలను రూపొందించడం ద్వారా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు చట్టంలోని నిబంధనల ప్రకారం వీధి విక్రయాల కోసం పథకం, ఉప-చట్టాలు మరియు ప్రణాళికలను అమలు చేస్తాయి.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా పేర్కొన్న చట్టంలోని వివిధ నిబంధనల అమలు కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు అమలు చేసే ఏజెన్సీగా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ) చట్టం, 2014 ప్రకారం రాష్ట్రాలు / పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీలు) కనీసం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వీధి వ్యాపారులను గుర్తించడానికి ఒక సర్వేను నిర్వహిస్తాయి. రెండు సర్వేల మధ్య వ్యవధిలో, ఎవరైనా వ్యక్తి విక్రయించాలని కోరుకుంటే, పట్టణ స్థానిక సంస్థల యొక్క టౌన్ వెండింగ్ కమిటీ అటువంటి వ్యక్తికి వెండింగ్ జోన్ల సామర్థ్యం, స్కీమ్, స్ట్రీట్ వెండింగ్ ప్లాన్ మరియు హోల్డింగ్ కెపాసిటీకి లోబడి వెండింగ్ సర్టిఫికేట్ (సర్టిఫికెట్ ఆఫ్ వెండింగ్) మంజూరు చేయవచ్చు.
పీఎం స్వనిధి పథకం కింద, ఈ మంత్రిత్వ శాఖ 'స్వనిధి సే సమృద్ధి' సబ్-కంపోనెంట్ కింద ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థలలో పీఎం స్వనిధి లబ్ధిదారులు మరియు వారి కుటుంబాల యొక్క సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హత ఉన్న వీధి వ్యాపారులను కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి జీవనజ్యోతిబీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, జననీ సురక్ష యోజన, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)తో సహా సంక్షేమ పథకాలతో అనుసంధానించడం పీఎం స్వనిధి లక్ష్యం
అంతేకాకుండా దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ యూఎల్ఎం)లో భాగంగా పట్టణ వీధి వ్యాపారుల మద్దతుకు సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలతో అమలు చేయబడుతోంది. ఈ కంపోనెంట్ కింద, వీధి వ్యాపారులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడానికి , నష్టాలు/ అనిశ్చితి నుండి కవరేజీని అందించడానికి; వీధి వ్యాపారుల సుముఖత మేరకు పట్టణ స్థానిక సంస్థలు, భారత ప్రభుత్వ బీమా పథకాలలో లేదా ఏదైనా రాష్ట్ర నిర్దిష్ట బీమా పథకాలలో నమోదు చేసుకునేందుకు వీలు కల్పిస్తాయి.
గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1986626)
Visitor Counter : 75