రైల్వే మంత్రిత్వ శాఖ
68వ జాతీయ రైల్వే పురస్కారాలను ఈ నెల 15న భారత్ మంటపంలో ప్రదానం చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
● అత్యుత్తమ సేవలు/పనితీరు కనబరిచిన రైల్వే సిబ్బంది/జోనల్ రైల్వేలు/పీఎస్‌యూలకు అవార్డు/షీల్డ్ అందజేయనున్న శ్రీ అశ్విని వైష్ణవ్
● అత్యుత్తమ సేవలకు పురస్కారాలు అందుకోనున్న 100 మంది రైల్వే ఉద్యోగులు, 21 షీల్డ్‌లు అందుకోనున్న జోనల్ రైల్వేలు, ఉత్పత్తి యూనిట్లు, పీఎస్‌యూలు
Posted On:
14 DEC 2023 2:40PM by PIB Hyderabad
రైల్వే ఉద్యోగులలో ఉత్తమ పనితీరును ప్రోత్సహించేందుకు, ఉత్తమ సేవలు అందించిన రైల్వే సిబ్బందికి కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ నెల 15న, 68వ రైల్వే వీక్ సెంట్రల్ ఫంక్షన్‌లో 'అతి విశిష్ట రైల్ సేవ పురస్కారం-2023'ను ప్రదానం చేస్తారు. న్యూదిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మంటపంలో ఈ వేడుక జరుగుతుంది. నిర్దిష్ట విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జోనల్ రైల్వేలు/పీఎస్‌యూలకు కూడా కేంద్ర మంత్రి షీల్డ్‌లు అందిస్తారు. రైల్వే శాఖ సహాయ మంత్రులు శ్రీ రావుసాహెబ్ పాటిల్ దాన్వే, శ్రీ దర్శన జర్దోష్ గౌరవ అతిథులు హాజరవుతారు. రైల్వే బోర్డు ఛైర్మన్ & సీఈవో, బోర్డు సభ్యులు, అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లు, రైల్వే పీఎస్‌యూల ఉత్పత్తి యూనిట్ల అధిపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను, దేశవ్యాప్తంగా ఉన్న జోనల్ రైల్వేలు, ఉత్పత్తి యూనిట్లు, రైల్వే పీఎస్‌యూల నుంచి 100 మంది రైల్వే ఉద్యోగులు 21 షీల్డ్‌లు, పురస్కారాలు అందుకుంటారు. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొట్టమొదటి రైలును నడిచిన జ్ఞాపకార్థం ఏటా ఏప్రిల్ 10 నుంచి 16 వరకు రైల్వే వారోత్సవాలు జరుపుకుంటారు. ఈ వారంలో, దేశవ్యాప్తంగా రైల్వే విభాగాలన్నింటిలో కార్యక్రమాలు నిర్వహిస్తారు.
షీల్డ్ విజేతలు-2023 జాబితా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి:
పురస్కార గ్రహీతల తుది జాబితా చూడాడానికి ఇక్కడ క్లిక్ చేయండి:
***
(Release ID: 1986502)
Visitor Counter : 73