ప్రధాన మంత్రి కార్యాలయం

ఉద్యోగం కోసం ఎదురు చూసే దశ నుంచి ఉద్యోగం కల్పించే దశకు ఎదిగిన కర్ణాటకలోని తుముకూర్ కు చెందిన ముఖేష్ .


కర్ణాటకలోని తుముకూర్ కు చెందిన వి.బి.ఎస్.వై. లబ్ధిదారు, గృహోపకరణాల షాపు యజమానితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

‘‘యువతకు మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’: ప్రధానమంత్రి

Posted On: 09 DEC 2023 2:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వికసిత భారత్ సంకల్పయాత్ర (విబిఎస్వై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ పథకాలను దేశవ్యాప్తంగా సకాలంలో అందేలా చూసేందుకు , వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టడం జరుగుతోంది. 
 
కర్ణాటకలోని తుముకూరులో వి.బి.ఎస్.వై లబ్ధిదారుడైన గృహోపకరణా షాపు యజమాని శ్రీ ముఖేష్ తో ప్రధానమంత్రి ముచ్చటించారు . ఈ సందర్భంగా లబ్ధిదారు ముఖేష్ ప్రధానమంత్రితో మాట్లాడుతూ, పి.ఎం. ముద్రయోజన కింద వ్యాపారం చేసుకునేందుకు తనకు 4.5 లక్షల రూపాయలు రుణం లభించినట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఎదురు చూసిన ముఖేష్ ఇప్పుడు మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రుణం ఎంత సులభంగా ముఖేష్ పొందగలిగిందీ , ప్రధానమంత్రి అతనిని అడిగి తెలుసుకున్నారు.
 
ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా వేదికగా , ముద్రా రుణాలకు సంబంధించి చేసిన పోస్ట్ ద్వారా తనకు ఈ పథకం గురించి తెలిసిందని, ఇందుకు సంబంధించిన సమాచారం ఆ పోస్ట్ ద్వారా తెలుసుకున్నానని, అలాగే బ్యాంకుకు దరఖాస్తు చేసుకోగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, తన అవసరానికి అనుగుణంగా రుణం మంజూరైందని తెలిపారు.

ముఖేష్ ను తన వ్యాపార కార్యకలాపాలను యుపిఐ, డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయాల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. దీని వల్ల బ్యాంకులనుంచి మరింత పెట్టుబడి పొందవచ్చని తెలిపారు. ప్రస్తుత 50 శాతం డిజిటల్, యుపిఐ చెల్లింపుల విధానం నుంచి మొత్తం డిజిటల్, యుపిఐ చెల్లింపుల విధానానికి మారాల్సిందిగా ప్రధానమంత్రి , లబ్ధిదారు ముఖేష్ కు సూచించారు.

ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ముఖేష్ ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దేశ యువతకు అండగా నిలవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు.

***



(Release ID: 1985886) Visitor Counter : 60