సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వి బి ఎస్ వై ద్వారా లబ్ధి పొందిన ట్రాన్స్ జెండర్ స్ఫూర్తిని ప్రశంసించిన ప్రధానమంత్రి
వి బి ఎస్ వై ద్వారా లబ్ధి పొంది చండీగఢ్ లో టీ స్టాల్ నడుపుతున్న ట్రాన్స్ జెండర్ శ్రీమతి మోనా తోమాట్లాడిన ప్రధానమంత్రి
ప్రభుత్వం అమలు చేస్తున్న "సబ్కా సాత్ సబ్కా వికాస్' విధానంతో సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు ... ప్రధానమంత్రి
Posted On:
09 DEC 2023 3:19PM by PIB Hyderabad
వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా చూడాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు.
ప్రధానమంత్రితో చండీగఢ్ నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారు శ్రీమతి మోనా మాట్లాడారు. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన శ్రీమతి మోనా చండీగఢ్ లో టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. చండీగఢ్‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నడిచే టీ షాప్ నిర్వహిస్తున్నానని ప్రధానికి శ్రీమతి మోనా తెలియజేశారు.
టీ స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి పీఎంస్వానిధి పథకం ద్వారా తాను రూ. 10,000 రుణాన్ని పొందినట్లు శ్రీమతి మోనా తెలియజేశారు. రుణ సౌకర్యం సమాచారం తనకు నగర కార్పొరేషన్ ద్వారా అందిందని ప్రధానమంత్రికి శ్రీమతి మోనా తెలిపారు. టీ స్టాల్‌లో గరిష్ట లావాదేవీలు యుపిఐ ద్వారా జరుగుతాయి కదా మరి మీకు అదనంగా అందించడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయా అని ప్రధానమంత్రి ఆరా తీశారు. ప్రధానమంత్రి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన శ్రీమతి మోనా తాను తర్వాత వరుసగా రూ. 20,000 మరియు రూ. 50,000 ఋణం పొందానని తెలియజేసారు. సున్నా వడ్డీతో శ్రీమతి మోనా మూడవ దశకు చేరుకున్నందుకు ప్రధాన మంత్రి ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు పొందేందుకు ట్రాన్స్ జెండర్లు మరింత ముందుకు రావాలని ప్రధానమంత్రి సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న సబ్కా సాథ్ సబ్కా వికాస్ విధానం వల్ల సమాజంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు.ప్రభుత్వ పథకాలు సక్రమంగా సరైన దిశలో అమలు జరుగుతున్నాయని చెప్పడానికి శ్రీమతి మోనా ఒక మంచి ఉదాహరణ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు అస్సాం రైల్వే స్టేషన్‌లోని అన్ని దుకాణాల నిర్వహణను ట్రాన్స్‌జెండర్లకు అప్పగించాలని రైల్వే నిర్ణయించిందని ప్రధానమంత్రి ప్రకటించిన ప్రధానమంత్రి దీనివల్ల ట్రాన్స్‌జెండర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శ్రీమతి మోనా చేసిన కృషిని, సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.
****
(Release ID: 1984572)
Visitor Counter : 114