యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్


సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి మరియు బలోపేతం చేయడానికి మరో అడుగు ఖేలో ఇండియా పారా గేమ్స్: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 09 DEC 2023 3:41PM by PIB Hyderabad

తొలిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్ న్యూఢిల్లీలో డిసెంబర్ 10న ప్రారంభం కానున్నాయి. పారా ఖేలో ఇండియా గేమ్స్ న్యూఢిల్లీలో డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 17 వరకు నిర్వహించబడుతున్నాయి.

32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు పాటు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్‌ల నుండి మొత్తం 1350 మంది ఆటగాళ్లు ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో పాల్గొంటున్నారు. పారా అథ్లెటిక్స్, పారా షూటింగ్, పారా ఆర్చరీ, పారా ఫుట్‌బాల్, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్ మరియు పారా వెయిట్ లిఫ్టింగ్ వంటి 7 విభాగాల్లో క్రీడాకారులు పోటీ పడతారు. ఈ క్రీడలు 3 సాయ్‌ స్టేడియాలైన తుగ్లకాబాద్ ఐజీ స్టేడియం షూటింగ్‌ రేంజ్‌ మరియు జెఎల్‌ఎన్‌ స్టేడియంలో నిర్వహిస్తారు.

పారా ఖేలో ఇండియా గేమ్స్ గురించి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ అన్నింటికంటే తాదాత్మ్యంతో కూడిన సమగ్ర సమాజాన్ని సృష్టించే మరియు బలోపేతం చేసే దిశగా మరో అడుగు అని అన్నారు. న్యూఢిల్లీలోని మూడు వేర్వేరు వేదికలపై వారంపాటు జరిగే ఖేలో ఇండియా పారా గేమ్స్ భావోద్వేగాల సముద్రాన్ని కనుగొనడంలో సహాయపడతాయని మరియు భారతీయ క్రీడా ప్రేమికులకు ఇప్పటివరకు తెలియని ప్రతిభను తెలుసుకుంటారని తెలిపారు.

 

image.png


32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1400 మంది పారా అథ్లెట్లు ఢిల్లీలో సమావేశమవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. సర్వీసెస్ స్పోర్ట్స్ బోర్డ్ నుండి అథ్లెట్ల రాక  ప్రారంభ పారా గేమ్‌లకు మరింత ఆకర్షనను అందిస్తుందని చెప్పారు.

 

image.png

 


ఖేలో ఇండియా ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ అని ఇది క్రీడలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిన అనేక అకాడమీలు మరియు పథకాలతో శాస్త్రీయ మరియు ఆధునిక విధానాన్ని పెంపొందించిదనికేంద్ర మంత్రి తెలిపారు.

ప్రధాన ప్రజా స్రవంతిలో దివ్యాంగులు తమ ప్రతిభను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా సమకాలీకరించబడుతున్నాయని ఆయన అన్నారు. వృత్తి మరియు విద్యా శిక్షణ, వ్యాపారం కోసం సబ్సిడీ రుణాలు అందించడం వంటి కార్యక్రమాలు ఆర్థికం, సామాజికంగా సాధికారతకు దారితీశాయని చెప్పారు. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఈ కార్యక్రమాలను పటిష్టం చేసే దిశగా మరో అడుగు వేసిందని వివరించారు.

 

***



(Release ID: 1984564) Visitor Counter : 111