యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఖేలో ఇండియా పారా గేమ్స్ సమయంలో పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి...

Posted On: 08 DEC 2023 6:21PM by PIB Hyderabad

ఖేలో ఇండియా పారా గేమ్స్ సమయంలో అథ్లెట్లు, ఈవెంట్ కి సంబంధించి సంస్థాగత మద్దతులో భాగంగా సమగ్ర వైద్య కవరేజీని అందుకుంటారు. కవరేజీలో అత్యవసర వైద్య సేవలు, ఆన్-సైట్ మెడికల్ టీమ్‌లు, అవసరమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (ఎన్సిఎస్ఎస్ఆర్) డిసెంబర్ 10 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరిగే ఖేలో ఇండియా పారా గేమ్స్ కోసం విభిన్న వైద్య పరిస్థితుల నిర్వహణలో శిక్షణ పొందిన నిపుణులను నియమించింది.

పారా అథ్లెట్లకు వారి ప్రత్యేక అవసరాలు, సవాళ్ల కారణంగా తరచుగా ప్రత్యేకమైన, సున్నితమైన వైద్య సంరక్షణ అవసరమవుతుంది. ఏదైనా ఊహించని పరిస్థితిని ఎదుర్కోవడానికి వైద్య సౌకర్యాలు విస్తారంగా అందుబాటులో ఉంచారు అధికారులు. 

 

ఎన్సిఎస్ఎస్ఆర్, స్పోర్ట్స్ సైన్సెస్,  స్పోర్ట్స్ మెడిసిన్‌పై దృష్టి సారించి ఎలైట్ అథ్లెట్ల అధిక పనితీరుకు సంబంధించి ఉన్నత స్థాయి పరిశోధన, విద్య,  ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది.

"పాల్గొనే పారా అథ్లెట్లందరూ సురక్షితంగా పోటీలో ఉండేలా, ఏవైనా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన వైద్య సహాయాన్ని పొందేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని ఖేలో ఇండియా విభాగం తరపున  ఎన్సిఎస్ఎస్ఆర్   ద్వారా సాధ్యమయ్యే అన్ని చర్యలు చేపట్టారుని ఆ సంస్థ డైరెక్టర్-ఇన్-ఛార్జ్ కల్నల్ బిభు నాయక్ పేర్కొన్నారు.

వారి ప్రత్యేక అవసరాలు, సవాళ్ల కారణంగా అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆటల కోసం సమగ్ర వైద్య కవరేజ్ ఉంటుందని ఆయన అన్నారు. 

మెడికల్ కవర్ ప్లాన్‌లో ఫీల్డ్ ఆఫ్ ప్లేలో అంకితమైన సహాయక సిబ్బంది కూడా ఉంటారని , ప్రతి వేదిక వైద్య కేంద్రాలలో పునరుజ్జీవన గదులు, స్థిరీకరణ గదుల ఏర్పాటుతో పాటు తక్షణ తరలింపు కోసం ఖేలో ఇండియా పారా గేమ్స్ వేదిక వద్ద తగిన సంఖ్యలో ఏఎల్ఎస్, బిఎల్ఎస్  అంబులెన్స్‌లను కలిగి ఉంటుంది. సమీపంలోని తృతీయ సంరక్షణ వైద్య కేంద్రానికి అనుసంధానం అవుతుంది.

ఎయిమ్స్  ట్రామా సెంటర్, లోక్ నాయక్ జయ్ ప్రకాష్ హాస్పిటల్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని స్పోర్ట్స్ ఇంజూరీ సెంటర్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వంటి ప్రధాన ఆసుపత్రులతో ఒప్పందం ప్రకారం, తక్షణ వైద్య అత్యవసర సేవలతో పాటు ఇమేజింగ్ సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోటీదారుల కోసం 50 పడకల ఐసీయూ ప్రత్యేక సదుపాయాన్ని లోక్ నాయక్ జయ ప్రకాష్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది.

హోలిస్టిక్ మెడికల్ కవరేజీని అందించే బాధ్యతను అప్పగించిన వైద్య సిబ్బందికి ఎలాంటి ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన శిక్షణ ఇవ్వబడింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ సమయంలో ఫుడ్ మెనూ కూడా పారా అథ్లెట్ల ప్రత్యేకమైన పోషకాహార అవసరాలను తీర్చడానికి స్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌లచే ప్రణాళిక చేశారు. వైద్య అధికారులు, నర్సింగ్ సహాయకులు, ఫిజియోథెరపిస్ట్‌లు, సైకాలజిస్టులు, పోషకాహార నిపుణులు సహా కనీసం 60 మంది సిబ్బందిని నియమించారు. క్రీడలకు JLN స్టేడియం, IG స్టేడియం, డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ వేదికలుగా ఉంటాయి. 

***



(Release ID: 1984333) Visitor Counter : 51


Read this release in: English , Urdu , Hindi , Marathi