విద్యుత్తు మంత్రిత్వ శాఖ

జమ్మూలోని విద్యార్థుల నేతృత్వంలో 4ఈ వేవ్ పేరుతో ప్రారంభమైన నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్


కార్బన్ ఉద్ఘారాల హానికరమైన ప్రభావాన్ని తగ్గించడానికి మరియు స్థిరమైన ఇంధన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడానికి 4ఈ వేవ్ ఉద్యమం నిబద్ధతను సూచిస్తుంది: కేంద్ర విద్యుత్ మరియు నవీన & పునరుత్పాదక ఇంధన మంత్రి

4ఈ వేవ్ ఉద్యమం మన భూమిని రక్షించడానికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది:జె&కె ఎల్‌జీ

Posted On: 08 DEC 2023 6:58PM by PIB Hyderabad

విద్యార్ధుల నేతృత్వంలోని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్‌ 4ఈ వేవ్‌ను కేంద్ర విద్యుత్ మరియు నవీన & పునరుత్పాదక ఇంధన మంత్రి శ్రీ ఆర్‌. కె. సింగ్  ప్రారంభించారు. కార్యక్రమంలో జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్  నిన్న డిసెంబరు 7, 2023న ఢిల్లీలో మంత్రిని కలిసినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభించబడింది.

ఈ ఉద్యమం స్థిరమైన అభ్యాసాలను ప్రోత్సహించడానికి మరియు శక్తిని ఆదా చేయడానికి వ్యక్తులు మరియు సంఘాలలో బాధ్యతాయుత భావాన్ని కలిగించడానికి కృషి చేస్తుంది.

4ఈ వేవ్ నాలుగు కీలక అంశాలను కలుపుతుంది:

  • పర్యావరణ అనుకూలత: పర్యావరణ అనుకూలమైన ఇంధన-పొదుపు పద్ధతులను ప్రోత్సహించడం
  • ఆర్థిక వ్యవస్థ: వ్యక్తులు మరియు సంఘాలకు ఆర్థిక ప్రయోజనాలకు దారితీసే శక్తి-పొదుపు పరిష్కారాలను నొక్కి చెప్పడం
  • విద్య: ఇంధన పొదుపు పద్ధతులు మరియు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించడం
  • సాధికారత: శక్తిని ఆదా చేయడంలో చురుకైన పాత్రలు పోషించడానికి వ్యక్తులు మరియు సంఘాలను శక్తివంతం చేయడం

 
జమ్మూలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (జిసిఈటి) విద్యార్థుల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమయింది.  యువత నేతృత్వంలోని ఉద్యమం, జె&కె పవర్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, జె&కె ప్రభుత్వం మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బిఈఈ), భారత ప్రభుత్వ ఇంధన మంత్రిత్వశాఖ మద్దతుతో ప్రారంభించబడింది. ఇంధన పరిరక్షణలో సహకారానికి దేశవ్యాప్తంగా వ్యక్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది.

ఈ సందర్భంగా ఇంధన పొదుపుకు సంబంధించిన సమాచారం మరియు వనరుల భాగస్వామ్యం కోసం దేశవ్యాప్తంగా పౌరులకు ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించే ఉద్యమం (www.4ewave.com) వెబ్ పోర్టల్‌ను మంత్రి ఆవిష్కరించారు. వినియోగదారులకు స్నేహపూర్వకమైన ఈ పోర్టల్‌కు ఉద్యమంలో ఆన్-బోర్డింగ్ కోసం  నమోదు ప్రక్రియ అవసరం. ఇందులో పాల్గొనేవారికి  సర్టిఫికేట్‌లు అందించబడతాయి. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ప్రచారంలో భాగం కావచ్చు. పాల్గొనేవారు తమ వినియోగ విధానాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన ఇంధన-పొదుపు చిట్కాలు, ఇంధన పొదుపులో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు మరియు 'ఇ-క్షితిజ్' అనే ఇ-మ్యాగజైన్‌లో ప్రచురణ కోసం శక్తి పొదుపుపై కథనాలను పంచుకోవడానికి డైనమిక్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా పొందుతారు. వీటితో పాటు ఈ పోర్టల్ ఇంధన పొదుపుపై దృష్టి సారించే పోటీలను హోస్ట్ చేస్తుంది. వినియోగదారులకు ఇంటరాక్టివ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ గొప్ప కార్యక్రమం జె&కె యువత చురుగ్గా పాల్గొన్నందుకు  జె&కె ప్రభుత్వ ఎల్‌జీ ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ చొరవ నేషనల్ కాజ్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్‌ను ప్రోత్సహించడంలో గణనీయంగా దోహదపడుతుందని మరియు మన భూమిని రక్షించడంలో  సహాయపడుతుందని తెలిపారు.

హానికరమైన కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు స్థిరమైన ఇంధన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడానికి నిశ్చయమైన నిబద్ధతను 4ఈ వేవ్ ఉద్యమం  సూచిస్తుందని విద్యుత్ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఉద్ఘాటించారు. 4ఈ వేవ్ ప్రచారంలో చురుకుగా పాల్గొనడం ద్వారా వ్యక్తులు కార్బన్ ఉద్ఘారాలను తగ్గించే దిశగా అడుగులు వేయడమే కాకుండా మరింత స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల భవిష్యత్తు కోసం ఒక సమిష్టి బాధ్యతను కూడా పెంపొందించుకుంటున్నారు. ఇంధన సంరక్షణ మరియు స్థిరమైన భవిష్యత్తు వైపు ఈ ప్రభావవంతమైన ప్రయాణంలో భాగం కావాలని ఆయన భారతీయ పౌరులందరినీ ఆహ్వానించారు.

ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, జె&కె పవర్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ శ్రీ హెచ్ రాజేష్ ప్రసాద్ మరియు జె&కె మరియు సిపిఎస్‌యులకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

image.png

image.png

image.png

***



(Release ID: 1984272) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi