ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అవయవ మార్పిడిపై తాజా సమాచారం


మరణించిన వ్యక్తి అవయవాలు దానం చేసే అంశంపై అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా అవయవ దాన మహోత్సవాల నిర్వహణ

Posted On: 08 DEC 2023 4:49PM by PIB Hyderabad

 దేశంలో అవయవ దానాల సంఖ్య  మెరుగుపరచడానికి కేంద్ర  ప్రభుత్వం అనేక చర్యలు అమలు చేస్తోంది. అవయవ దానానికి సంబంధించిన సమాచారాన్ని  నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ (NOTP) కింద ఏర్పాటు చేసిన నేషనల్ ఆర్గాన్ , టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO), రీజినల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్స్ (ROTTO) , స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్స్ (SOTTO) వ్యాప్తి చేస్తున్నాయి. అవయవ దానం కోసం ప్రభుత్వం ఆమోదించిన ప్రక్రియ, చట్ట నిబంధనలకు లోబడి అవయవ దానం చేసే అంశంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి,  ద్వారా అనుమతించబడిన ప్రభుత్వ గుర్తింపు పొందిన అవయవ దానం ప్రక్రియ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు మానవ అవయవాలు మరియు కణ మార్పిడి చట్టం, 1994 నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అవయవ అక్రమ రవాణా కార్యక్రమాలపై తీసుకుంటున్న చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాలని నేషనల్ ఆర్గాన్ , టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO), రీజినల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్స్ (ROTTO) , స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్స్ (SOTTO) లకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అవయవ దానం ఒక ప్రజా ఉద్యమంగా జరిగేలా చూసేందుకు చర్యలు అమలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ MyGov ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిజ్ఞ చేయించి  నినాదాల పోటీని నిర్వహిస్తోంది.2023  జూలై నెలలోప్రారంభమైన '  అవయవ దాన    మహోత్సవం' లో భాగంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి అవయవాలు దానంచేసే అంశంపై వివిధ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి.  అవయవ కణజాల దానం, మూత్రపిండం, కాలేయ వైఫల్య నివారణపై 1వ జాతీయ వెబ్‌నార్ జూలై 2023 నెలలో జరిగింది.  దీనికి వేలాది మంది వైద్య నిపుణులు హాజరయ్యారు.

www.notto.mohfw.gov.in’  వెబ్‌సైట్ 24x7 కాల్ సెంటర్‌తో పాటు సమాచారం, టెలి-కౌన్సిలింగ్ అందించడానికి, అవయవ దానంపై  సహాయం చేయడానికి టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ (1800114770) ఏర్పాటు అయ్యాయి. . ప్రతి సంవత్సరం భారతీయ అవయవ దాన దినోత్సవం (IODD) సందర్భంగా పలు కార్యక్రమాలు, సదస్సులు, నడక పోటీలు, , సెమినార్లు, వర్క్‌షాప్‌లు, , NOTTO సైంటిఫిక్ డైలాగ్ 2023 మొదలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.   అవయవ దానంపై అవగాహన కల్పించడానికి ఐసీయూ, మార్పిడి/తిరిగి పొందే ఆస్పత్రిలో  డిస్‌ప్లే బోర్డ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. సమాచారాన్ని ప్రచారం చేయడానికి  ప్రింట్ మీడియాకు  ప్రకటనలు విడుదల అవుతున్నాయి. , సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొదలైన వాటి ద్వారా ఆడియో, ఆడియో-విజువల్ సందేశాలు ప్రసారం అవుతున్నాయి. . పాఠశాల పిల్లలకు అవయవ దానం గురించి అవగాహన కల్పించడం, పోస్టర్ తయారీ, ప్రత్యేక ప్రతిజ్ఞ ప్రచారం వంటి పోటీలు తరచు  నిర్వహిస్తారు.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  ఆయుష్మాన్ భారత్ పీఎం-జె  పథకం కింద మూత్రపిండాల మార్పిడి ప్యాకేజీని చేర్చారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రోగులకు   రాష్ట్రీయ ఆరోగ్య నిధి (RAN) కింద గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ మొదలైన వాటి మార్పిడి కోసం మంత్రిత్వ శాఖ 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. 

మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం, 1994  నిబంధనలు లేదా  ఏదైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందని అందిన  ఏదైనా ఫిర్యాదు లేదా ఉల్లంఘనను పరిశోధించడానికి ప్రతి రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక సంస్థ పనిచేస్తోంది. ఆరోగ్యం,  శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అవయవాలను వ్యాపార వస్తువులుగా మార్చి అక్షరమా రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా  చర్యలు తీసుకోవడం ప్రాథమికంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత. రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నియమించే చట్టబద్ధ సంస్థ సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908 (5 ఆఫ్ 1908) ప్రకారం ఒక దావాను పరిష్కరించడానికి  సివిల్ కోర్టుకు ఉండే  అన్ని అధికారాలను కలిగి ఉంటుంది.

ఈ వివరాలను  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ .ఎస్.పి.సింగ్ భాగెల్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు. 

 

***

 



(Release ID: 1984171) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Hindi , Tamil