వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కిసాన్ ఇ-మిత్ర
Posted On:
05 DEC 2023 5:55PM by PIB Hyderabad
పీ ఎం - కిసాన్ పథకం భూమి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడిన కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. ఈ పథకం కింద, ప్రతి నాలుగు నెలలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000/- ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజన బదిలీ (డి బీ టీ ) విధానం ద్వారా దేశవ్యాప్తంగా రైతుల కుటుంబాల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. రైతు-కేంద్రీకృత డిజిటల్ అవస్థాపన పథకం యొక్క ప్రయోజనాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ చేరేలా చేసింది. లబ్ధిదారుల నమోదు మరియు ధృవీకరణలో సంపూర్ణ పారదర్శకతను కొనసాగిస్తూ, భారత ప్రభుత్వం 11 కోట్ల కంటే ఎక్కువ మంది రైతులకు రూ. 2.80 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది.
పీ ఎం - కిసాన్ పథకం కింద, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలులో ఉంది. పీ ఎం - కిసాన్ పోర్టల్ మరియు 24x7 ఐ వీ ఆర్ ఎస్ సదుపాయం ద్వారా రైతుల ఫిర్యాదులను సమర్థవంతం గా మరియు సకాలంలో పరిష్కరించవచ్చు. ఇంకా, రైతులు తమ ఫిర్యాదులను రైతుల ఫిర్యాదుల పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పైన పేర్కొన్న వాటితో పాటుగా, భారత ప్రభుత్వం కిసాన్ ఇ-మిత్ర (ఏ ఐ చాట్‌బాట్)ను అభివృద్ధి చేసింది. రైతుల సందేహాలను వారి స్వంత భాషల్లో పరిష్కరించేందుకు డిజిటల్ సహాయం ద్వారా సాంకేతిక జోక్యాల ద్వారా రైతులను శక్తివంతం చేస్తుంది. కిసాన్ ఇ-మిత్ర రైతులకు ఉన్న సాంకేతిక మరియు భాషా అడ్డంకులను తొలగిస్తోంది.
కిసాన్-ఇ-మిత్ర, ఏ ఐ చాట్‌బాట్ ప్రారంభంలో 5 భాషల్లో అంటే ఇంగ్లీష్, హిందీ, ఒడియా, తమిళం మరియు బంగ్లా భాషల్లో అందుబాటులో ఉంది.
ముఖ నిర్దారణ ఆధారిత ఇ-కెవైసి ఫీచర్‌తో భారత ప్రభుత్వం పీ ఎం - కిసాన్ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ప్రభుత్వ ప్రయోజన పథకాలలో ముఖ నిర్దారణ-ఆధారిత ఇ-కెవైసి ఫీచర్‌ను ఉపయోగించిన తొలి మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ ను ఉపయోగించడం చాలా సులభం మరియు గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి సులభంగా అందుబాటులో ఉంటుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా ఎటువంటి ఓ టీ పీ లేదా వేలిముద్ర లేకుండా, కేవలం వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా వారి ఇ-కెవైసి ని ఇంట్లో కూర్చొని పూర్తి చేయడానికి ఇది రైతులకు సౌకర్యం ఇస్తుంది. బయోమెట్రిక్ ఆధారిత ఇ-కెవైసి కోసం రైతులు సీ ఎస్ సి ని సందర్శించాల్సిన అవసరాన్ని లేదా వారి ఆధార్‌తో మొబైల్ లింక్ చేయాల్సిన తప్పనిసరి అవసరాన్ని ఇది తొలగిస్తుంది. రైతు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అతను/ఆమె తన ఇ-కెవైసి నింపుకోవచ్చు. వారు తమ ఇంటి వద్దే ఇ-కెవైసి ని పూర్తి చేయడానికి వారి పరిసరాల్లోని 100 మంది రైతులకు కూడా సహాయం చేయవచ్చు. దీనితో పాటుగా, భారత ప్రభుత్వం రూపొందించిన దరఖాస్తు నిబంధనలు నమోదు చేసుకున్న రాష్ట్ర/యుటి ప్రభుత్వ అధికారులు 500 మంది రైతుల వరకు ఇ-కెవైసి చేయడానికి అనుమతిస్తుంది.
అప్లికేషన్ ప్రారంభించినప్పటి నుండి, సుమారు 20 లక్షల మంది రైతులు తమ ఇ-కెవైసిని విజయవంతంగా పూర్తి చేసారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 1983034)
Visitor Counter : 158