ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ డీప్ డైవ్ శిక్షణ కార్యక్రమం
- సైబర్ సురక్షిత్ భారత్ చొరవ కింద ఎన్ఈజీడీ, మైటీ నిర్వహణ
Posted On:
05 DEC 2023 3:11PM by PIB Hyderabad
సైబర్ సురక్షిత్ భారత్ చొరవ కింద సైబర్-క్రైమ్ గురించి అవగాహన కల్పించడం మరియు పెరుగుతున్న సైబర్ విపత్తును ఎదుర్కోవడానికి తగిన భద్రతా చర్యలను నిర్ధారించడానికి ఎంఈఐటీవై పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ విభాగాలలోని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (సీఐఎస్ఓల) మరియు ఫ్రంట్‌లైన్ ఐటీ అధికారుల సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంస్థలు మరియు వారివారి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను రక్షించుకోవడానికి మరియు సైబర్-దాడులను ఎదుర్కోవడంలో భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికి వీలుగా వీటిని రూపొందించింది. నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) తన కెపాసిటీ బిల్డింగ్ పథకం కింద బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు కొత్త రాష్ట్రాల నుండి కలుపుకొని 31 మంది పాల్గొనే 40వ సీఐఎస్ఓ డీప్-డైవ్ శిక్షణా కార్యక్రమాన్ని డిసెంబర్ 4-8, 2023 వరకు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యక్రమ ప్రారంభ సెషన్‌లో ప్రముఖులు - శ్రీ ఎస్ కృష్ణన్, సెక్రటరీ, మైటీ; శ్రీ ఎస్.ఎన్. త్రిపాఠి, డీజీ-ఐఐపీఏ మరియు మైటీ, ఎన్ఈజీడీ & ఐఐపీఏ నుండి ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్-దాడుల ప్రస్తుత దృష్టాంతంలో సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, శ్రీ ఎస్ కృష్ణన్ డిజిటల్ యుగంలో దుర్బలత్వాలను ఎత్తిచూపారు, ఏ సంస్థలోనైనా, ముఖ్యంగా సమాచార భద్రత కోసం సైబర్ భద్రతా వ్యూహాలను రూపొందించడంలో సీఐఎస్ఓ అధికారుల కీలక పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతిక పురోగతుల కంటే ముందంజలో ఉండటంలో సీఐఎస్ఓ అనివార్యమైన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఈ సంస్థ అధికారులు తమ సంస్థల సైబర్ భద్రతా ప్రయత్నాలకు మద్దతునిస్తూ.. వినూత్నంగా మరియు భవిష్యత్తు సవాళ్లకు తగ్గట్టుగా ఆలోచించాలంటూ ప్రోత్సహించారు. తన ప్రసంగంలో 5G మరియు 6G వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా ఎదురయ్యే సవాళ్లను నావిగేట్ చేయడంలో టెలికమ్యూనికేషన్ శాఖ పాత్రను కూడా అతను గుర్తుచేశారు. సైబర్ రెసిలెంట్ ఎకో సిస్టమ్‌ను రూపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ విభాగాలకు అవగాహన కల్పించడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, ఈ దిశగా చర్యలను ప్రారంభించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమం వివిధ ప్రభుత్వాల సేవలను సమగ్రంగా అందించడం కోసం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సైబర్ భద్రత మరియు భద్రతపై పాల్గొనేవారికి అవగాహన కల్పించడం మరియు దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పౌరులకు సేవలు, సైబర్ భద్రత గురించి సమగ్ర సమాచారం జ్ఞానం మరియు అవగాహనను అందించడం, అవగాహనను వ్యాప్తి చేయడం, సామర్థ్యాలను పెంపొందించడం అలాగే ప్రభుత్వ విభాగాలు వారి సైబర్ పరిశుభ్రత, రక్షణ మరియు భద్రతను పెంపొందించుకొనేలా చేయడం. జూన్ 2018 నుండి డిసెంబర్ 2023 వరకు, ఎన్ఈజీడీ 1,523 కంటే ఎక్కువ సీఐఎస్ఓలు మరియు ఫ్రంట్‌లైన్ ఐటీ అధికారుల కోసం 40 బ్యాచ్‌ల సీఐఎస్ఓ డీప్-డైవ్ శిక్షణా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించింది.
***
(Release ID: 1983027)
Visitor Counter : 97