సహకార మంత్రిత్వ శాఖ
బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఆడిట్
Posted On:
05 DEC 2023 3:27PM by PIB Hyderabad
బహుళ రాష్ట్ర సహకార సంఘాలలో పాలనను బలోపేతం చేసి, పారదర్శకతను పెంపొందించి, జవాబుదారీతనాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియను సంస్కరించడం కోసం ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి అనుబంధంగా ఉంచేందుకు, 97వ రాజ్యాంగ సవరణలోని అంశాలను పొందుపరిచేందుకు బహుళ-రాష్ట్ర సహకార సంఘాలు (ఎంఎస్‌సిఎస్) (సవరణ) చట్టం & నిబంధనలు, 2023ను 03.08.2023 & 04.08.2023న నోటిఫై చేయడం జరిగింది.
బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఆడిట్ ప్రక్రియను బలోపేతం చేసేందుకు దిగువన పేర్కొన్న అంశాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగిందిః
సెంట్రల్ రిజిస్ట్రార్ ఆమోదించిన ఆడిటర్ల ప్యానెల్ నుంచి ఆడిటర్ల ప్యానెల్ నుంచి 500 కోట్ల రూపాయలకన్నా ఎక్కువ టర్నోవర్ / డిపాజిట్లు గల బహుళ-రాష్ట్ర సహకార సంఘాలకు ఏకకాల ఆడిట్ ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టారు. ఏకకాల ఆడిట్ అన్నది మోసం లేదా అక్రమాలు ఉంటే ముందుగానే గుర్తించేలా చేసి, తక్షణం పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
బహుళ రాష్ట్ర సహకార సంఘాల కోసం దిగువన పేర్కొన్న రెండు ప్యానెళ్ళ ఆడిటర్లను 2023-24 ఆర్ధిక సంవత్సరానికి నోటిఫై చేశారుః
చట్టబద్ధమైన ఆడిట్‌ను నిర్వహించడం కోసం ఐదువందల కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్/ డిపాజిట్ (ఏదైనా) కలిగి ఉన్న బహుళ రాష్ట్ర సహకార సంఘాల కోసం ఆడిటర్ల ప్యానెల్
చట్టబద్ధమైన, ఏకకాలిక ఆడిట్‌ను నిర్వహించడం కోసం ఐదువందల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్/ డిపాజిట్ (ఏదైనా) కలిగి ఉన్న బహుళ రాష్ట్ర సహకార సంఘాల కోసం ఆడిటర్ల ప్యానెల్
బహుళ రాష్ట్ర సహకార సంఘాల కోసం కేంద్ర ప్రభుత్వం అకౌంటింగ్ & ఆడిటింగ్ ప్రమాణాలను నిర్ణయించడానికి ఒక నిబంధనను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ సమాచారాన్ని లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా వెల్లడించారు.
***
(Release ID: 1983022)
Visitor Counter : 93