కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భ‌వ‌నాలు లేదా ప్రాంతాల‌లో డిజిట‌ల్ అనుసంధానానికి చ‌ట్ర‌పు రేటింగ్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌పై వ్యాఖ్య‌ల‌ను స్వీక‌రించేందుకు గ‌డువును పొడిగించిన ట్రాయ్ (టిఆర్ఎఐ)

Posted On: 05 DEC 2023 7:30PM by PIB Hyderabad

 భ‌వ‌నాలు లేదా ప్రాంతాల‌లో డిజిట‌ల్ అనుసంధానానికి చ‌ట్ర‌పు  రేటింగ్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌పై టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా 27.09. 2023న భాగ‌స్వాముల నుంచి అభిప్రాయాల‌ను ఆహ్వానిస్తూ సంప్ర‌దింపుల ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. అభిప్రాయాల‌ను స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీని 08.12.2023గాను, ప్ర‌తి వ్యాఖ్య‌ల‌కు ఆఖ‌రు తేదీని 22.12.2023గా నిర్ణ‌యించింది. 
వ్యాఖ్య‌ల‌ను, అభిప్రాయాల‌ను స‌మ‌ర్పించేందుకు స‌మ‌యాన్ని పొడిగించ‌మ‌ని భాగ‌స్వాములు/  పారిశ్రామిక సంస్థ‌ల నుంచి అందుకున్న విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, వ్యాఖ్య‌ల స‌మ‌ర్ప‌ణ‌కు ఆఖ‌రు తేదీని నాలుగు వారాలు అంటే 05 జ‌న‌వ‌రి 2024వ‌ర‌కు, ప్ర‌తివ్యాఖ్య‌ల‌కు గ‌డువును 19 జ‌న‌వ‌రి 2024వ‌ర‌కు పొడిగించాల‌ని నిర్ణ‌యించారు. 
సంప్ర‌దింపుల ప‌త్రం పై లిఖిత‌పూర్వ‌క వ్యాఖ్య‌ల‌ను, ప్ర‌ధానంగా ఎల‌క్ట్రానిక్ రూపంలో శ్రీ తేజ్‌పాల్ సింగ్‌, స‌ల‌హాదారు (క్యూఒఎస్‌-ఐ), ట్రాయ్‌కు adv-qos1@trai.gov.in అన్న ఇమెయిల్ చిరునామాకు పంపవ‌చ్చు.  గ‌డువును మ‌రొక‌సారి పెంచే విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిగ‌ణించ‌బోవ‌డం లేదు క‌నుక వ్యాఖ్య‌లు/  ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను స‌మ‌యంలోగా పంపాల‌ని భాగ‌స్వాముల‌ను కోరారు. 
ఏదైనా స్ప‌ష్టీక‌ర‌ణ‌ల కోసం, శ్రీ తేజ్‌పాల్ సింగ్‌, అడ్వైజ‌ర్ (క్యూఒఎస్‌-ఐ), ట్రాయ్‌ను adv-qos1@trai.gov.in అన్న చిరునామాకు మెయిల్ చేయ‌డం ద్వారా కానీ లేదా టెలిఫోన్ నెంః +91-11-2323-3602లో కానీ సంప్ర‌దించ‌వ‌చ్చు. 

 

***
 



(Release ID: 1983021) Visitor Counter : 34


Read this release in: English , Urdu , Hindi