బొగ్గు మంత్రిత్వ శాఖ
అక్టోబర్ మాసానికి ఎనిమిది కీలక పరిశ్రమలలో 18.4% వృద్ధిని సాధించిన బొగ్గు రంగం
గత ఏడాది అక్టోబర్‌లో 66.32 మిలియన్ టన్నులతో పోలిస్తే, ఈ సంవత్సరం 78.65మిలియన్ టన్నులకు పెరిగిన బొగ్గు ఉత్పత్తి
ఏప్రిల్లో 9.1% నుంచి 18.4% కు పెరిగిన బొగ్గు పరిశ్రమ సూచీ
Posted On:
05 DEC 2023 6:19PM by PIB Hyderabad
వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2023కు విడుదల చేసిన ఎనిమిది కీలక పరిశ్రమల సూచీ (ఐసిఐ) ప్రకారం, బొగ్గు పరిశ్రమ గత 16 నెలల్లో అత్యధికంగా 18.4% వృద్ధిని (తాత్కాలిక) సాధించి గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 145.8 పాయింట్లతో పోలిస్తే 172.6 పాయింట్లకు చేరుకుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2023-24లో గత ఏడాది ఇదే కాలంలో సంచిత సూచీతో పోలిస్తే 13.1శాతం పెరిగింది.
తాజా డాటా ఎనిమిది కీలక పరిశ్రమల ఉమ్మడి సూచీ కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 అక్టోబర్‌లో 12.1% (తాత్కాలిక) పెరిగింది.
ఎనిమిది కీలక పరిశ్రమలు - సిమెంట్, బొగ్గు, ముడి చమురు, విద్యుత్తు, ఎరువులు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు & ఉక్కుకు సంబంధించిన ఉమ్మడి, వ్యక్తిగత ఉత్పత్తి పనితీరును ఐసిఐ కొలుస్తుంది.
బొగ్గు పరిశ్రమ ఆకర్షణీయ వృద్ధి అక్టోబర్ 2023లో పెరిగిన చెప్పుకోదగిన పెరుగుదల కారణంగా కనిపిస్తోంది. ఈ నెలలో గత ఏడాది ఉత్పత్తి 66.32 ఎంటిలను అధిగమించి 78.65 మిలియన్ టన్నులను సాధించి, 18.59% పెరుగుదలను ప్రతిఫలించింది.
బొగ్గు పరిశ్రమ సూచీ ఏప్రిల్ 2023లో 9.1% వృద్ధిని నమోదు చేయగా, నిలకడైన, సుస్థిర వృద్ధిని ప్రదర్శిస్తూ అక్టోబర్ 2023లో అది 18.4%కి పెరిగింది.
విభిన్న వ్యూహాత్మక చొరవల ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడంలో కీలకపాత్రను పోషించింది. ఇందులో వాణిజ్య బొగ్గు గనుల తవ్వకాలకు దేశీయ ఉత్పత్తిని వేలం ఆధారిత పద్ధతి ద్వారా పెంపొందించడం, దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి గనుల అభివృద్ధిదారులు కమ్ నిర్వాహకులు (ఎండిఒ) నిమగ్నం చేయడం, అలాగే బొగ్గు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మూసివేసిన గనులను ఆదాయ- భాగస్వామ్య నమూనాలో తిరిగి తెరవడం వంటివి ఉన్నాయి.
బొగ్గు రంగ విశేష వృద్ధి, ఎనిమిది కీలక పరిశ్రమల మొత్తం వృద్ధికి దాని తోడ్పాటు అన్నవి బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర కృషి, చేపట్టిన చొరవలకు అద్దం పడతాయి. ఈ కృషి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతో కలిసి, స్వయం సమృద్ధి, ఇంధన భద్రత దిశగా దేశ పురోగతికి దోహదం చేస్తాయి.
***
(Release ID: 1983019)
Visitor Counter : 73