నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ సముద్రయాన సంస్థకు అత్యధిక ఓట్ల తో తిరిగి ఎన్నికైన భారత్


సముద్ర ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యంలో భారీ ప్రయోజనాలు కలిగిన పది దేశాల విభాగంకిందికి వచ్చిన భారత్.
ఈ కౌన్సిల్ కాలపరిమితి 2024‌‌–25 ద్వైవార్షికం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎం.ఓ.పి.ఎస్.డబ్ల్యు. సాగించిన కృషితో అత్యధిక ఓట్లు ఇండియా దక్కించుకోగలిగింది.

ఇది అంతర్జాతీయ సముద్రయాన కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఇండియా చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది.: శర్వానంద్ సోనోవాల్

ఐఎంఓలో ఇండియా నిరంతరాయ సర్వీసులను అందిస్తూ వస్తోంది, అలాగే కేటగిరి బిలో ప్రతిష్ఠాత్మక, నిరంతరాయ రికార్డును నెలకొల్పింది.

Posted On: 03 DEC 2023 5:04PM by PIB Hyderabad

అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంఒ) అసెంబ్లీ కి 2024–25 సంవత్సరాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో ఇండియా  అత్యధిక ఓట్లతో మరోసారి ఎన్నికైంది.  సముద్రయాన వాణిజ్యరంగంలో అత్యధిక ప్రయోజనాలు కలగిన పది దేశాల కేటగిరీలో ఇండియా ఈ స్థానం సంపాదించుకుంది.
ఈ పది దేశాలలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉన్నాయి. 

కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గ రవాణా శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ మాట్లాడుతూ, ఈ కౌన్సిల్కు ఇండియా ఎన్నిక కావడానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ మంత్రిత్వశాఖ అన్ని ప్రయత్నాలూ చేసినట్టు తెలిపారు.
ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్లో ఇండియా అత్యధిక ఓట్లు పొందడానికి సహకరించిన అంతర్జాతీయ సమాజానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికలో ఇండియాకు అత్యధిక ఓట్లు రావడమంటే,
అంతర్జాతీయ సముద్రయాన కార్యకలాపాల విషయంలో ఇండియా సాగించిన అద్భుత కృషి, దీనిని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా చూపిస్తున్న పట్టుదలలకు ఈ  అత్యధిక ఓట్లు నిదర్శనమని ఆయన తెలిపారు.

  అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐ.ఎం.ఒ)లో ఇండియా భారీ మద్దతు పొందింది. దీనితో ఇండియా అంతర్జాతీయ సముద్రయాన సంస్థలో సేవలు అందించేందుకు ప్రపంచదేశాలనుంచి గట్టి మద్దతు పొందింది.  అంతర్జాతీయ సముద్ర యాన సంస్థ, సముద్రయాన కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యం , రవాణా, ఇతర సముద్రయాన సంబంధిత కార్యకలాపాలను నియంత్రిస్తుంది.
పోర్టులు, షిప్పింగ్‌,జలమార్గాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ టి.కె.ర రామచంద్రన్‌, డిజి షిప్పింగ్‌ శ్యామ్‌ జగన్నాథన్‌, డిజిఎస్‌ కు చెందిన అధికారులు, లండన్‌ లోని హైకమిషన్‌, పరిశ్రమ ప్రతినిధుల నేతృత్వంలో భారతప్రతినిధి వర్గం ఇందుకు నాయకత్వం వహించింది.
ఐఎంఓ ఎగ్జిక్యూటివ్‌ విభాగమైన మండలి. అసెంబ్లీ కింద సంస్థ బాధ్యతలను చూస్తుంది. అసెంబ్లీ సెషన్‌ ల మధ్య ఈ కౌన్సిల్‌ అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది.  ప్రభుత్వాలకు సముద్రయాన భద్రతపై సలహాలు ఇవ్వడం, కాలుష్య నియంత్రణ మినహా ఇతర కార్యకలాపాలను ఇది నిర్వర్తిస్తుంది.

ఎం.ఐ.వి 2030 కింద ఐఎంఒలో ప్రాతినిధ్యం పెంచుకునేందుకు ఇండియా  లండన్‌లోని ఐఎం.ఓలో శాశ్వత సభ్యులను  నియమిస్తోంది. ఇండియాకు  సముద్రయాన నైపుణ్యతలను పెంచడానికి ఇండియా  ఐఎంఒలో జూనియర్‌ ప్రొఫెషనల్‌ ఆఫీసర్‌ (జెపిఒ) ప్రోగ్రామ్‌లుగా కనీసం ఇద్దరిని నామినేట్‌ చేయాలని నిర్ణయించింది.
జెపిఒ ప్రోగ్రాం అనేది  వ్యవస్థీకృత కార్యక్రమం. యునైటెడ్‌ నేషన్స్‌లో ఇది అంతర్భాగంగా ఉన్న కార్యక్రమం. దీని లక్ష్యం,  యువ ప్రొఫెషనల్స్‌కు  అంతర్జాతీయ సహకారం, తదితర అంశాల విషయంలో తగిన అనుభవం వచ్చేట్టు చూడడం. ఇందుకు ప్రత్యేక నిపుణులు సహకరించనున్నారు.

అంతర్జాతీయ సముద్రయాన రంగంలో భారతదేశ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు, అమృత్‌ కాల్‌ దార్శనికత 2057 సంకల్పం చెప్పుకుంది.  అమృత్‌ కాల్‌ దార్శనికత కార్యాచరణ కింద సుమారు43 అంశాలను గుర్తించడం జరిగింది. ఈ అమృత్‌ కాల్‌ దార్శనిక లక్ష్యాలు,అంతర్జాతీయ సముద్రయాన రంగంలో మన ఉనికిని మరింత పటిష్ఠం చేయనున్నాయి. ఇందులో ఇండియాలో ఐఎంఒ సెల్‌ ఏర్పాటు, ఐఎంఓ కేంద్రకార్యాలయంలో శాస్వత సభ్యుల ఏర్పాటు,  బిమ్‌స్టెక్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలు, ప్రాంతీయ ప్రాజెక్టులను సమన్వయంతో సకాలంలో పూర్తి చేసేందుకు పటిష్టమైన బిమ్‌స్టెన వ్యవస్థాగత నిర్మాణం ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. 

 

***


(Release ID: 1982549) Visitor Counter : 159