జల శక్తి మంత్రిత్వ శాఖ
13.69 కోట్ల (71%) గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరా
Posted On:
04 DEC 2023 2:45PM by PIB Hyderabad
2024 నాటికి కుళాయి నీటి కనెక్షన్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి క్రమబద్ధమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో నిర్ణీత నాణ్యతతో కూడిన త్రాగునీటిని అందించడానికి 2019 ఆగస్టు మాసం నుండి భారత ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) - హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
మిషన్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, జేజేఎం కార్యక్రమం కింద వివిధ పనులు ప్రతిపాదించబడ్డాయి..
1. ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి కనెక్షన్‌ని అందించడానికి గ్రామంలో పైపుల నీటి సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధి.
2. నమ్మకమైన తాగునీటి వనరుల అభివృద్ధి మరియు/ లేదా నీటి సరఫరా వ్యవస్థకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అందించడానికి ఇప్పటికే ఉన్న వనరులను పెంచడం.
3 భారీ స్థాయిలో వాటర్ ట్రాన్స్‌ఫర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్.
4. నీటి నాణ్యత సమస్యగా ఉన్న కలుషితాలను తొలగించడానికి సాంకేతిక జోక్యాలనే చేపట్టడం.
5. కనీస సేవా స్థాయి 55 ఎల్పీడీసీ వద్ద లను అందించడానికి పూర్తయిన మరియు కొనసాగుతున్న పథకాలను తిరిగి అమర్చడం.
6. కలుషిత నీటి నిర్వహణ-చికిత్స మరియు పునర్వినియోగం; మరియు
7. మద్దతు కార్యకలాపాలు మరియు సంఘాల సామర్థ్యాన్ని పెంపొందించడం.
2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ప్రకటించిన సమయం నుంచి 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించినట్టుగా నివేదించబడింది. ఇప్పటివరకు, 29.11.2023 నాటికి రాష్ట్రాలు/యుటీలు నివేదించిన ప్రకారం, దాదాపు 10.46 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడ్డాయి.
ఈ విధంగా, 29.11.2023 నాటికి దేశంలోని 19.24 కోట్ల గ్రామీణ కుటుంబాలలో దాదాపు 13.69 కోట్ల (71%) కుటుంబాలు తమ ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నట్లు నివేదించబడింది. 30.09.2023 నాటికి మరియు 29.11.2023 నాటికి కుళాయి నీటి కనెక్షన్ల రాష్ట్ర/యుటీ వారీగా వివరాలు జత చేయబడ్డాయి.
9 రాష్ట్రాలు/యూటీలు గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు తెలంగాణా, ఏ&ఎం దీవులు, దాద్రా నగర్ హవేలీ & డామన్ డయ్యూ మరియు పుదుచ్చేరి 30.09.2023 నాటికి సంబంధిత రాష్ట్రం/ యుటీలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు పంపు నీటి కనెక్షన్ను అందించినట్లు నివేదించాయి. ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.
(Release ID: 1982404)
Visitor Counter : 102