ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

"నేడు, భారతదేశపు యువ అంకురసంస్థలు భారతీయ మార్కెట్ మరియు ప్రపంచం కోసం పరికరాలు, ఐ.పి. ఉత్పత్తులు, పరిష్కారాలు, వేదికలను రూపొందిస్తున్నాయి": కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్


"ఈ రోజు మనం మద్దతిస్తున్న భవిష్యత్ డిజైన్ డి.ఎల్‌.ఐ. అంకురసంస్థలు భవిష్యత్తులో వినూత్నమైన సంస్థలుగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి": కేంద్ర సహాయ మంత్రి


"కృత్రిమ మేధస్సు సరిగ్గా ఉపయోగించబడినప్పుడు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలన, భాషా అనువాదాన్ని సైతం మార్చగలదని మేము విశ్వసిస్తున్నాము": రాజీవ్ చంద్రశేఖర్


"ఇంటర్నెట్ కు భద్రత, విశ్వాసం అనే రక్షణ కవచాలు కావాలనే భారతదేశ దృక్పథంతో ప్రపంచం ఇప్పుడు సరితూగుతోంది": కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్


“2014కు ముందు, భారతదేశ సెమీ కండక్టర్ కథ తప్పిన అనేక వరుస అవకాశాలలో ఒకటి”: కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్


గురువారం బెంగళూరులో నిర్వహించిన "టెక్ సమ్మిట్" 26 వ ఎడిషన్‌ లో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Posted On: 01 DEC 2023 5:05PM by PIB Hyderabad

బెంగుళూరు టెక్-సమ్మిట్ 26వ ఎడిషన్‌ లో భాగంగా, గురువారం జరిగిన శిఖరాగ్ర సమావేశంలో నిర్వహించిన "ఫైర్‌-సైడ్-చాట్‌" లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తో ఏ.ఎం.డి. ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సిలికాన్ డిజైన్ ఇంజినీరింగ్ కంట్రీ హెడ్ శ్రీమతి జయ జగదీష్‌ పాల్గొన్నారు.  భారతదేశ అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ పరిశ్రమ, కృత్రిమ మేధస్సుతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి లో అంకురసంస్థలు పోషిస్తున్న కీలక పాత్ర పై కేంద్ర మంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 

 

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా, సెమికాన్ ఇండియా-2023 సదస్సును గుర్తుచేసుకుంటూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తీకరించిన భారతదేశ క్రియాశీల పరివర్తన గురించి ప్రముఖంగా పేర్కొన్నారు. 

 

 

శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, "గాంధీనగర్‌ లో జరిగిన 2023 సెమికాన్ ఇండియా సదస్సులో మేము ఒక మార్పును గమనించాం.  ప్రజలు ఇప్పుడు భారతదేశంలో ఎందుకు?” అని అడగడం నుంచి మనం భారతదేశంలో దీన్ని ఎప్పుడు తయారు చేస్తున్నాంభారతదేశంలో మనం ఎందుకు తయారు చేయలేము?” అని ప్రశ్నించే స్థితికి మారుతున్నారు.  ఈ మార్పుకు అనేక అంతర్లీన కారణాలు ఉన్నాయి, వాటిలో, జియో పాలిటిక్స్ తో పాటు, అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన పర్యావరణ వ్యవస్థ పై పెరుగుతున్న విశ్వాసం, సామర్థ్యాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.  గత ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలంలో, మన సాంకేతిక ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతోందో దాదాపు ప్రతి అంశాన్ని సూచిస్తోంది.  అది కృత్రిమ మేధస్సు, సెమీ-కండక్టర్లు, ఎలక్ట్రానిక్సు, వెబ్-3, సూపర్‌ కంప్యూటింగ్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి ఏ అంశాన్నైనా సూచిస్తోంది.” అని వివరించారు. 

 

 

డిజైన్‌ లో వారసత్వం లేకపోయినా, సెమీ-కండక్టర్ రంగంలో భారతదేశ వేగవంతమైన పురోగతి గురించి కేంద్రమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ,  “దశాబ్దాలుగా అవకాశాలను కోల్పోయిన మనం ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నామని నేను నమ్ముతున్నాను.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అనేక విధాలుగా, మనం, దాదాపు ఒక తరాన్ని దాటవేస్తూ, తరువాతి దశాబ్దంలో పూర్తిగా కొత్త అవకాశాలతో పాటు, ప్రస్తుతం ఉన్న ప్రత్యేక అవకాశాలను పరిశీలిస్తున్నాము.  ప్రపంచానికి ఈ రోజు అవసరమైన పరికరాలను రూపకల్పన చేయడం భారతదేశంలో వారసత్వం లేని విషయం.  కాబట్టి, గత కొన్ని సంవత్సరాలుగా, మనం ప్రతిభ, రూపకల్పన, ప్యాకేజింగ్, పరిశోధనల్లో అద్భుతమైన పురోగతిని సాధించామని నేను నమ్ముతున్నాను. సెమీ-కండక్టర్ దేశంగా, ప్రపంచ సెమీ-కండక్టర్ పర్యావరణ వ్యవస్థలో విశ్వసనీయ ఉత్పత్తిదారుగా మారాలని భారతదేశం ముందుకు సాగుతోంది.  దీన్ని మనం ఎంత త్వరగా అమలు చేయగలం అనేది ముఖ్యం." అని పేర్కొన్నారు. 

 

 

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంతో పాటు ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధస్సును అమలు చేయవలసిన ఆవశ్యకత గురించి, కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వివరిస్తూ, ఏ.ఐ. ని ఉపయోగించే ప్రభుత్వ విధానం గురించి ప్రత్యేకంగా తెలియజేశారు.   కృత్రిమ మేధస్సు అందించిన విస్తారమైన అవకాశాలను అంగీకరిస్తూనే, హాని కలిగించే అవకాశం ఉన్న చెడు విధానాల ఉనికి గురించి కూడా ఆయన తెలియజేశారు.   భద్రత, విశ్వాసం కోసం చట్టసభల రక్షణ కవచాల ఆవశ్యకత గురించి కూడా ఆయన ప్రత్యేకంగా వివరించారు. 

 

 

కృత్రిమ మేధస్సు గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “ కృత్రిమ మేధస్సు ని సరిగ్గా ఉపయోగించినప్పుడు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలనతో పాటు భాషా అనువాదాన్ని మార్చగలదని మేము విశ్వసిస్తున్నాము.  కృత్రిమ మేధస్సు ను సంగ్రహించడం, సామర్థ్యాలు, సమాచార కేంద్రాలను రూపొందించడం తో పాటు,  కృత్రిమ మేధస్సు గణన, శిక్షణ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా,  జీవితాలను మెరుగుపరచడం అనే భారతదేశ లక్ష్యాలకు దోహదపడే నమూనాలను రూపొందించడం పై మేము దృష్టి పెట్టడం జరిగింది.   కృత్రిమ మేధస్సు అనేది ఒక దేశంగా మన కోసం మనం నిర్దేశించుకున్న ఒక ట్రిలియన్ డాలర్ల మేర డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉన్న సాంకేతిక ఆవిష్కరణ.  అయితే, ఇటీవలి పరస్పర చర్చల్లో వెల్లడైన విధంగా, మనకు భద్రత, విశ్వాసం కలిగించే భరోసా అవసరమన్న భారతదేశ అభిప్రాయంతో ప్రపంచం ఇప్పుడు ఏకీభవిస్తోంది.  అయితే, కృత్రిమ మేధస్సు ఎంత గొప్పదైనప్పటికీ,  కృత్రిమ మేధస్సు ని దుర్వినియోగం చేయడం లేదా హాని కలిగించే విధంగా చెడు వ్యక్తులచే ఉపయోగించబడదని నిర్ధారించడానికి మనకు భద్రత, విశ్వాసంతో పాటు చట్టబద్ధమైన రక్షణ అవసరం కూడా ఉంది." అని పేర్కొన్నారు. 

 

 

2014 నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంకుర సంస్థలు పోషిస్తున్న ముఖ్యమైన పాత్ర గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “మన వద్ద 102 యునికార్న్‌లు ఉన్నాయి, అంకురసంస్థల్లోకి వచ్చిన 65 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌.డి.ఐ. లు ఉన్నాయి.  కాబట్టి అంకుర సంస్థలు మన ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, దృష్టిలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక దృష్టిలో కూడా భాగమే.  ప్రస్తుతం, మనం మద్దతిస్తున్న ఫ్యూచర్‌ డిజైన్ డి.ఎల్‌.ఐ. అంకురసంస్థల్లో చాలా వరకు భవిష్యత్తులో యునికార్న్‌ లుగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నేను భావిస్తున్నాను.  మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు గుండె, ఆత్మగా - మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అంకుర సంస్థలు ఒక ట్రిలియన్ డాలర్ల మేర డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సాధించే లక్ష్యానికి గణనీయంగా దోహదపడతాయి.  కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, తదుపరి తరం ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ లలోకి ఈ అంకురసంస్థలను ప్రవేశపెట్టినట్లైతే, అప్పుడు మరింత  విలువైన, ముఖ్యమైన ఐ.పి. ని కలిగి ఉండే మరిన్ని అంకురసంస్థలు ఉద్భవిస్తాయి." అని తెలియజేశారు.

 

 

*****



(Release ID: 1982199) Visitor Counter : 79