శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా భారతదేశం సాగిపోవడానికి బయో ఎకానమీతో పాటు నానో సైన్స్ కూడా ఎంతో దోహదపడతాయని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
చండీగఢ్‌లోని మొహాలీ గల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎన్‌ఎస్‌టి)లో భారతదేశపు మొట్టమొదటి నానో సైన్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులు మరియు విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. సంస్థ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేశారు.
ఐఎస్‌ఎస్టీ అనేది దేశంలోని మొట్టమొదటి నానో సైన్స్ ఇన్‌స్టిట్యూట్. దేశ ప్రయోజనాల కోసం నానోసైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరియు ఉత్పత్తులు/పరికరాలు మరియు సాంకేతికతను రూపొందించడానికి ఏర్పాటు చేయబడింది: డాక్టర్ జితేంద్ర సింగ్
అగ్రికల్చరల్ నానోటెక్నాలజీ, నానోమెడిసిన్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, క్వాంటం మెటీరియల్స్ అండ్ డివైస్ ఫిజిక్స్, నానో ఎలక్ట్రానిక్స్, మైక్రోఫ్లూయిడిక్స్ బేస్డ్ టెక్నాలజీస్, నానో బయో వంటి రంగాలపై ఐఎన్‌ఎస్‌టీ ప్రత్యేక దృష్టి సారించి పరిశోధనలు చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు.
Posted On:
03 DEC 2023 4:46PM by PIB Hyderabad
భారతదేశపు మొట్టమొదటి నానో సైన్స్ ఇన్‌స్టిట్యూట్ అయిన చండీగఢ్ సమీపంలోని మొహాలీలో గన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్‌ఎస్‌టీ) అధ్యాపకులు మరియు విద్యార్థులను ఉద్దేశించి, కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నానోసైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరియు ఉత్పత్తులు/పరికరాలు మరియు సాంకేతికతను రూపొందించడానికి ఏర్పాటు చేయబడిన దేశంలోనే మొట్టమొదటి నానో-సైన్స్ ఇన్‌స్టిట్యూట్ అని తెలిపారు. దేశ ప్రయోజనం కోసం మరియు భారీ భవిష్యత్ పాత్రను కలిగి ఉందని చెప్పారు.
5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా భారతదేశం సాగిపోవడానికి బయో-ఎకానమీతో పాటు నానో-సైన్స్ ఎంతో దోహదపడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
వ్యవసాయ నానోటెక్నాలజీ, నానోమెడిసిన్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, క్వాంటం మెటీరియల్స్ మరియు డివైస్ ఫిజిక్స్, నానో ఎలక్ట్రానిక్స్, నానోసైన్స్ మరియు మైక్రోఫ్లూయిడిక్స్ బేస్డ్ టెక్నాలజీస్, నానోబయోటెక్నాలజీకి సంబంధించిన విభిన్నమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలు చేయడం ఈ సంస్థ లక్ష్యం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్‌ఎస్‌టి) అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, 1960 ప్రకారం నానో సైన్స్ అండ్ టెక్నాలజీపై జాతీయ మిషన్ (నానో మిషన్) కింద భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క స్వయంప్రతిపత్త పరిశోధనా సంస్థ. ఇది నానోసైన్స్ మరియు సాంకేతికత వృద్ధి మరియు విస్తరణను ప్రోత్సహించడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం ఉన్న భారతదేశపు అగ్రగామి పరిశోధనా సంస్థగా అవతరించడం మరియు వ్యవసాయం, ఔషధం, శక్తి మరియు పర్యావరణంలో నానోసైన్స్ & నానోటెక్నాలజీ యొక్క అనువర్తనాల ద్వారా సమాజానికి దోహదపడటం ఐఎస్‌ఎస్‌టి లక్ష్యం అని చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఐఎస్‌ఎస్‌టి తన ప్రత్యేకమైన మరియు అసమానమైన ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని యువ తరంలో సైన్స్‌ను ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలో సాంకేతికతను అభివృద్ధి చేసే అభ్యాసాన్ని పెంపొందించడానికి గణనీయంగా దోహదపడిందన్నారు.ఐఎన్ఎస్‌టీ అధ్యాపకులు దేశవ్యాప్తంగా సుమారు 300 పాఠశాలల్లోని 15,000 మంది విద్యార్థులతో నేరుగా సంభాషించారని మరియు సైన్స్‌ను కెరీర్ కోణంలో తీసుకోవడం గురించి అవగాహన కల్పించారని ఆయన తెలియజేశారు. ఐఎన్‌ఎస్‌టి రోడ్‌షో 50,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు మరియు సాధారణ ప్రజలకు రోజువారీ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించింది. సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ కోసం దేశవ్యాప్తంగా 24 పాఠశాలలు/కళాశాలల నుండి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులను ఐఎన్‌ఎస్‌టిచేరువ చేసిందని మంత్రి తెలిపారు.
గ్లోబల్ మరియు స్థానిక సవాళ్లను పరిష్కరించడానికి ఇంధనం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, క్వాంటం మెటీరియల్స్ మొదలైన రంగాల్లో ఇంటర్ డిసిప్లినరీ ఫ్లేవర్‌తో నానోసైన్స్ మరియు నానోటెక్నాలజీలో అత్యాధునిక పరిశోధనలు ఐఎన్‌ఎస్‌టీ ప్రధాన లక్ష్యం అని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు.
"దేశం కోసం నానోసైన్స్ పరిజ్ఞానం" అనేది తమ నినాదమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఐఎన్‌ఎస్‌టి కొన్ని ప్రధాన లక్ష్యాలను పరిజ్ఞానాన్ని పెంపొందించడం మరియు దేశానికి ఉత్తమంగా సేవలందించే నానోసైన్స్ మరియు టెక్నాలజీలో యువకులకు అవగాహన కల్పించడం, అత్యున్నత స్థాయిలో నానోటెక్నాలజీకి సంబంధించిన అధునాతన శిక్షణా కోర్సులు మరియు ప్రయోగశాల పద్ధతులను అందించడం, ప్రోత్సహించడం వినూత్నమైన మరియు సవాలు చేసే సాంకేతికత/ఉత్పత్తి ఆధారిత శాస్త్రీయ ప్రాజెక్టులు వంటి కొన్ని ప్రధాన లక్ష్యాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
పరిశోధన (ప్రయోగశాల నుండి పరిశ్రమ వరకు) మరియు పరిశ్రమతో పరస్పర చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు అదే సమయంలో నానో సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క ప్రయోజనాలు మరియు రక్షణల గురించి ప్రజలకు మరియు మీడియాకు అవగాహన కల్పిస్తుంది.
మొహాలీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎన్‌ఎస్‌టి) భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ)కి చెందిన స్వయంప్రతిపత్త సంస్థ. ఇది భారతదేశంలో నానో పరిశోధనను పెంపొందించడానికి డీఎస్టీచే ప్రారంభించబడిన నానో మిషన్ క్రింద స్థాపించబడింది.ఇది 3 జనవరి 2013న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది దేశంలో మొట్టమొదటి భారతీయ నానో-పరిశోధన సంస్థ ఇది 3 జనవరి 2013న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది ట్రాన్సిట్ క్యాంపస్‌లో, సెక్టార్ 64,టెన్త్ పేజ్, మొహాలి, పంజాబ్ ఏర్పాటు చేయబడింది. ఐఎన్‌ఎస్‌టి కొత్త క్యాంపస్ ఇప్పుడు పంజాబ్‌లోని సెక్టార్-81 మొహాలీలోని నాలెడ్జ్ సిటీలో 35 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడింది.
<><><>
(Release ID: 1982198)
Visitor Counter : 163