ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పురాణాలు Vs. వాస్తవాలు

జాతీయ ఆరోగ్య మిషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో సంతకం చేసిన అవగాహన ఒప్పందం, వ్యయ శాఖ జారీ చేసిన ఇతర మార్గదర్శకాలను పశ్చిమ బెంగాల్ పాటించడం లేదు


వ్యయ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం తప్పనిసరి షరతులు అమలు జరిగినప్పుడు మాత్రమే నిధులు విడుదల అవుతాయి.

అనేక సమావేశాలు నిర్వహించి, సూచనలు జారీ చేసినప్పటికీ ఏబీ-హెచ్ డబ్ల్యు సి మార్గదర్శకాలు అమలు జరగడం లేదు

Posted On: 03 DEC 2023 12:24PM by PIB Hyderabad

 జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతూ  లేఖ రాశారని కొన్ని పత్రికలలో వార్తలు వెలువడ్డాయి.

ఆయుష్మాన్ భారత్ -హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ (AB-HWCs) కోసం బ్రాండింగ్ మార్గదర్శకాలు లేఖ నం. D.O.No.Z-15015/11/2017-NHM-I తేదీ 30వ తేదీ మే 2018 ద్వారా విడుదల అయ్యాయి. . అయితే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల  భవనం రంగులు, రాష్ట్రంలో ఉపయోగించిన భాష నీలం, తెలుపు రంగులలో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ -హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ పేరును   ప్రాంతీయ భాషలో "సుసస్త్య కేంద్రం" అని ఆంగ్లంలో "హెల్త్ & వెల్నెస్ సెంటర్" అని ఉంది. 

జాతీయ ఆరోగ్య మిషన్ అమలు కోసం కేంద్ర  ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందం నిబంధనల ప్రకారం, మిషన్ కింద  కార్యక్రమం/కార్యకలాపాలను  ఎన్‌హెచ్‌ఎం రూపొందించిన ప్రకారం  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే  మార్గదర్శకాలకు  [క్లాజ్ 10.3]. అనుగుణంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా,  అవగాహన ఒప్పందం [క్లాజ్ 10.10] నిబంధనలకు విరుద్ధంగా లేని ఎన్‌హెచ్‌ఎం   అమలుకు సంబంధించి జారీ అన్ని  అన్ని మాన్యువల్‌లు, మార్గదర్శకాలు, సూచనలు సర్క్యులర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.  అదనంగా, వ్యయ శాఖ  మార్గదర్శకాల ప్రకారం   మూలధన పెట్టుబడి కోసం 2023-24 రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రాలు పనిచేయాల్సి ఉంటుంది. దీనిలో పారా(4)లో నిర్దేశించబడిన తప్పనిసరి షరతుల్లో ఒకటి.  పథకం మార్గదర్శకాలు క్రింది విధంగా ఉన్నాయి:

'‘అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల (CSSలు) అధికారిక పేరుతో పూర్తి సమ్మతి [స్థానిక భాషకు సరైన అనువాదం అనుమతించబడుతుంది] . అన్ని మంత్రిత్వ శాఖల అన్ని పథకాలలో కేంద్ర ప్రాయోజిత పథకా ల బ్రాండింగ్‌కు సంబంధించి భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు / సూచనలు అమలు చేయాల్సి ఉంటుంది. ’

నిబంధనలు, మార్గదర్శకాల అమలుకు సంబంధించి అనేక సమావేశాలు జరిగాయి. 2023 మార్చి 31, మే 11, 2023 న కేంద్ర ఆరోగ్య  శాఖ కార్యదర్శి అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సమావేశం జరిగింది,   జనవరి 12 2023, ఫిబ్రవరి 8, 2023, మార్చి 3, 2023 మరియు ఏప్రిల్ 24, 2023 తేదీల్లో  సంయుక్త కార్యదర్శి  (విధానం) కూడా సమావేశాలు నిర్వహించారు.  28  ఫిబ్రవరి 2023 న  అన్ని  హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల బ్రాండింగ్‌ని నిర్ధారించడానికి AS&MD (NHM)  DO లెటర్ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించడం జరిగింది. 2023 మార్చి 31 న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ అంశానికి సంబంధించి మరో డిఓ లేఖ రాశారు.   

ఈ అంశంపై పశ్చిమ బెంగాల్‌కు అనేక సమాచారాలు కూడా పంపబడ్డాయి. ఎన్‌హెచ్‌ఎం  అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పశ్చిమ బెంగాల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై  11 ఏప్రిల్, 2023 న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఎన్‌హెచ్‌ఎం లో పొందుపరిచిన అన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం గా పేర్కొన్నారు.  ఆయుష్మాన్ భారత్ -హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ అమలు జరుగుతున్న తీరు పరిశీలించిన సమయంలో   గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  ఆయుష్మాన్ భారత్ -హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు, పీహెచ్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, నిబంధనలు  పాటించలేదని వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వం జారీ  చేసిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కార్యక్రమం అమలు జరగడం లేదని పేర్కొంటూ  3 నవంబర్, 2023 న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వర్తమానం పంపింది. నిబంధనలు, మార్గదర్శకాలు అమలు జరిగినప్పుడు మాత్రమే వ్యయ శాఖ నిబంధన ప్రకారం తదుపరి నిధులు విడుదల అవుతాయని కూడా వర్తమానంలో స్పష్టం చేశారు.  వ్యయ శాఖ 19.09.23 న రాసిన లేఖలో  ఏబీ -హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలతో సహా కేంద్ర ప్రాయోజిత పథకాలలో బ్రాండింగ్‌ను అమలు చేయాలని రాష్ట్రానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిబంధనలు, మార్గదర్శకాలు అమలు కావడం లేదని  8 నవంబర్ 2023 న జరిగిన జాతీయ ఆరోగ్య మిషన్ సమావేశంలో కూడా  పునరుద్ఘాటించబడింది.

కేంద్ర ప్రభుత్వంతో జరిగిన  సంప్రదింపులు , కార్యక్రమాలలో కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం  పాల్గొనలేదు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు అయింది.  విధాన రూపకల్పన పై ప్రభుత్వానికి సహకారం, సలహాలను అందించడానికి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు సంబంధించి విస్తృతమైన విధానాలను పరిశీలించి  సిఫార్సు చేయడానికి అత్యున్నత సలహా సంస్థగా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పనిచేస్తోంది.  అన్ని రాష్ట్రాల ఆరోగ్య, వైద్య విద్య మంత్రులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. మే 2022లో గుజరాత్‌లో జరిగిన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 14వ సమావేశానికి తమ ప్రతినిధిని పంపని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 2023 జులై నెలలో ఉత్తరాఖండ్ లో జరిగిన 15వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్  సమావేశానికి కూడా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ స్థాయిలో ప్రాతినిధ్యం లేదు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో రాష్ట్రం కూడా పాల్గొనలేదు.  భారత రాష్ట్రపతి ప్రారంభించిన    ఆయుష్మాన్ భవ ప్రచారం  కొన్ని కార్యకలాపాలలో  పాక్షికంగా పశ్చిమ బెంగాల్ పాల్గొంటోంది. కార్యక్రమం   కింద నిర్ణయించిన  విధంగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించలేదు.

 

*****



(Release ID: 1982133) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Hindi , Tamil