రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జపాన్‌లోని యోకోసుకాలో 2023 డిసెంబర్‌ 02-05 తేదీల్లో ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ పర్యటన

Posted On: 03 DEC 2023 9:22AM by PIB Hyderabad

ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో దీర్ఘ శ్రేణి కార్యాచరణ విస్తరణలో భాగంగా, 2023 డిసెంబర్ 02న, జపాన్‌లోని యోకోసుకాలోకి ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ ప్రవేశించింది.

వృత్తిపరమైన పరస్పర కార్యాచరణలు, సమాజ సంక్షేమ కార్యకలాపాలు, నౌకల సందర్శనలు ఈ పర్యనటలో ఉంటాయి.

జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌తోనూ (జేఎంఎస్‌డీఎఫ్‌) నౌకల పరస్పర సందర్శనలు, వృత్తిపరమైన ఆలోచనల మార్పిడి, ఉమ్మడి యోగాసనాలు, ఉమ్మడి సముద్ర విన్యాసాల కోసం సమావేశం నిర్వహిస్తారు.

జపాన్‌లో నివశిస్తున్న భారతీయ సమక్షంలో, 04 డిసెంబర్ 2023న, నౌకాదళ దినోత్సవాన్ని ఈ నౌక జరుపుకుంటుంది.

రెండు దేశాల నౌకాదళాల మధ్య కుదిరిన ఒప్పందం (ఆర్‌పీఎస్‌ఎస్‌) ప్రకారం, జేఎంఎస్‌డీఎఫ్‌ వేగవంతమైన యుద్ధ సహాయక నౌక జేఎస్‌ తోవాడాకు ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ ఇంధనాన్ని అందజేయడం ప్రారంభించింది. 28 నవంబర్ 2023న ఇది ప్రారంభమైంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై రెండు దేశాల దృక్పథాలకు అనుగుణంగా, భారత్‌-జపాన్ మధ్య సముద్ర రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ పర్యటన లక్ష్యం.

 ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ నౌకను దేశీయ పరిజ్ఞానంతో నిర్మించారు, ఇది జలాంతర్గామి విధ్వంసక నౌక. అత్యాధునిక ఏఎస్‌ ఆయుధ శ్రేణి అందులో ఉంది.

_____



(Release ID: 1982132) Visitor Counter : 88