ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ కార్యనిర్వాహక కమిటీలో భారతదేశం చేరింది
Posted On:
02 DEC 2023 5:46PM by PIB Hyderabad
రోమ్‌లోని ఎఫ్ ఏ ఓ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న 46వ సమావేశంలో కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ (సీ ఏ సీ ) కార్యనిర్వాహక కమిటీలో ఆసియా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే సభ్యునిగా భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
కార్యనిర్వాహక కమిటీ అనేది సీ ఏ సీ యొక్క ముఖ్యమైన విభాగం మరియు సభ్య దేశాలు దాని సభ్యత్వం పొందడానికి గణనీయమైన ఆసక్తిని కనబరుస్తాయి. ఈ సామర్థ్యంలో, భారతదేశం వివిధ ఆహార ఉత్పత్తుల వర్గాల కోసం అంతర్జాతీయ ప్రమాణాల నెలకొల్పే ప్రక్రియలో గణనీయమైన సహకారం అందించే అవకాశాన్ని పొందడమే కాకుండా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కూడా పాల్గొంటుంది. కమీషన్ యొక్క ప్రమాణాల అభివృద్ధి కార్యక్రమం నిర్వహణను చేపట్టడానికి ప్రతిపాదనల యొక్క "క్లిష్టమైన సమీక్ష" నిర్వహించడం ద్వారా మద్దతు ఇస్తుంది మరియు ప్రమాణాల అభివృద్ధి పురోగతిని కార్యనిర్వాహక కమిటీ పర్యవేక్షిస్తుంది.
కార్యనిర్వాహక కమిటీలో చైర్, ముగ్గురు వైస్ చైర్‌లు, ఆరుగురు ప్రాంతీయ సమన్వయకర్తలు మరియు కోడెక్స్‌లోని వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి ఎన్నికైన ఏడుగురు ప్రతినిధులు ఉంటారు.
చిరుధాన్యాల కోసం సమూహ ప్రమాణాలను ఏర్పాటు చేయాలనే భారతదేశ ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది మరియు మిల్లెట్ల కోసం ప్రపంచ ప్రమాణాలను స్థాపించడానికి భారతదేశం యొక్క చొరవను కమిషన్ అంగీకరించింది మరియు సభ్య దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి.
2023 నవంబర్ 27న జరిగిన సీ ఏ సీ సమావేశం యొక్క మొదటి రోజున అదనపు అజెండాల కేటగిరీ కింద చిరుధాన్యాలకు ప్రపంచ ప్రమాణాలను ఏర్పాటు చేయాలని భారతదేశం ప్రతిపాదించింది. ఈ విషయం పై నవంబర్ 30న సుదీర్ఘంగా చర్చించబడింది మరియు మూడు ప్రాజెక్ట్ పత్రాల తయారీకి కమిషన్ ఆమోదించింది.
భారత ప్రతినిధి బృందం లో శ్రీ జీ కమల వర్ధన రావు, సీ ఈ ఓ, ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఆరాధనా పట్నాయక్, నిఫ్టెం డైరెక్టర్ డాక్టర్ శ్రీ హరీందర్ ఒబెరాయ్, ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ జాయింట్ డైరెక్టర్ పి కార్తికేయన్, ఎపెడా జనరల్ మేనేజర్ డాక్టర్ సస్వతి బోస్ మరియు ఈ ఐ సీ అదనపు డైరెక్టర్ డాక్టర్ జే ఎస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
***
(Release ID: 1982130)