ఆర్థిక మంత్రిత్వ శాఖ

అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.55 లక్షలకు పైగా విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న దిల్లీ కస్టమ్స్ అధికార్లు, కేసు నమోదు

Posted On: 01 DEC 2023 12:16PM by PIB Hyderabad

అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.55 లక్షలకు పైగా విలువైన విదేశీ సిగరెట్లను దిల్లీ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికార్లు నిన్న స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.55 లక్షల విలువైన 5,48,800 విదేశీ సిగరెట్లను జప్తు చేశారు.

ప్లాటినం సెవెన్, డేవిడాఫ్, డన్‌హిల్, మోండ్ సహా వివిధ బ్రాంట్ల సిగరెట్లను అధికార్లు స్వాధీనం చేసుకున్నారు. జప్తి చేసిన విదేశీ సిగరెట్‌ ప్యాకెట్ల మీద చిత్రంతో కూడిన ఆరోగ్య హెచ్చరికలు లేవు.

కస్టమ్స్ సుంకం ఎగ్గొట్టి విదేశీ సిగరెట్లను దేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని, ‘సిగరెట్లు & ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్యాకేజింగ్ & లేబులింగ్) సవరణ నియమాలు, 2022’ని కూడా ఉల్లంఘించారని, వాటిని దేశీయ మార్కెట్‌లో సరఫరా చేస్తున్నారని అధికార్లు అనుమానిస్తున్నారు.

కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 104 కింద ఒక నిందితుడిని అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

***



(Release ID: 1981809) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Tamil